BigTV English
Advertisement

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : ఆడియన్స్ ని భయపెట్టేందుకు ఒక కొరియన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇద్దరు నన్స్ చుట్టూ తిరిగే ఈ స్టోరీ వెన్నులో వణుకుపుట్టిస్తుంది. దెయ్యాలను తరిమే ఈ నన్స్ కి ఒక పవర్ ఫుల్ దెయ్యం తగులుతుంది. ఆ తరువాత స్టోరీ పరుగులు పెట్టిస్తుంది. హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన ఈ సినిమా, తెలుగులో కూడా అందుబాటులో ఉంది. థియేటర్లలో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ని కూడా వదలకుండా భయపెడుతోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ కొరియన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డార్క్ నన్స్’ (Dark nuns). ఈ మూవీకి వాన్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఇందులో సాంగ్, జియాన్, లీ జిన్, మూన్ వూ తదితరులు నటించారు. ఇది 2015లో వచ్చిన ‘ది ప్రీస్ట్’ మూవీకి సీక్వెల్. ఈ సినిమా 2025 జనవరి 24న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీ ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కొరియన్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ ఇంగ్లీష్, హిందీ, తమిళంతో పాటు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

కొరియాలో హీ-జూన్ అనే ఒక చిన్న అబ్బాయికి చాలా బలమైన దెయ్యం పడుతుంది. అతని అమ్మ భయపడి చర్చి హాస్పిటల్‌కు తీసుకెళ్తుంది. అక్కడ ఫాదర్ పాలో దెయ్యాలను నమ్మడు. అతనికి ఏవో మందులు ఇస్తాడు. అయితే సిస్టర్ మైకాలా గతంలో షామాన్ గా ఉండేది. మరో సిస్టర్ జూనియా కూడా దెయ్యాలు తొలగించడంలో ఎక్స్‌పర్ట్ గా ఉంటుంది. కానీ ఆమెకు క్యాన్సర్ ఉంటుంది. కానీ ఇద్దరు నన్స్ చర్చి రూల్స్ బ్రేక్ చేసి, క్రిస్టియన్ ప్రేయర్స్, షామాన్ మంత్రాలు మిక్స్ చేసి దెయ్యాన్ని ఎదుర్కొంటారు. కానీ ఇప్పుడు ఉన్న దెయ్యం మిగతా దెయ్యాల లెక్కన కాదు, చాలా మొండి దెయ్యం. ఇది జూనియా క్యాన్సర్‌ను ఎక్కువ చేస్తుంది.


Read Also : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

ఈ నన్స్ కూడా అంతే మొండిగా ఒక పాత లాండ్రీ రూమ్‌లో దెయ్యం తొలగించే ఒక కొత్త రిచ్యువల్ చేస్తారు. అయితే ఇప్పుడు దెయ్యం హీ-జూన్ నుంచి బయటకు వచ్చి జూనియా గర్భాశయంలోకి వెళ్తుంది. మైకాలా తన షామాన్ పవర్స్ ఉపయోగించి దెయ్యాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు కథ మరింత భయంకరంగా మారుతుంది. క్లైమాక్స్ కి అందరి ప్యాంట్లు తడిచిపోతాయి. చివరికి ఈ నన్స్ ఆ దెయ్యాన్ని వెళ్లగొడతారా ? ఆ మొండి దెయ్యం చేతిలో బలవుతారా ? అనే విషయాలను, ఈ కొరియన్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ ను చూసి తెలుసుకోండి.

 

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×