E-Paper
Advertisement

India – UAE: యుఎఇ టూరిస్టులకు భారత్ గుడ్ న్యూస్, ఇక వీసా లేకుండానే..

India – UAE: యుఎఇ టూరిస్టులకు భారత్ గుడ్ న్యూస్, ఇక వీసా లేకుండానే..
Advertisement

భారత్- యుఎఇ మధ్య దశాబ్దాలుగా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. ప్రధానిగా నరేంద్రమోడీ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. ఈ నేపథ్యంలో కీలకమైన పర్యాటక, వ్యాపార మార్కెట్ అయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చే సందర్శకుల ప్రయాణ నిబంధనలను మరింత సులభతరం చేసింది. ఇందులో భాగంగానే వీసా ఆన్ అరైవల్ (VoA) సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే 6 విమానాశ్రయాల్లో  ఈ సౌకర్యం ఉండగా, ఇప్పుడు మరో మూడు విమానాశ్రయాలకు విస్తరించింది. టూరిజం, వైద్యం, వ్యాపార పర్యటనలకు వచ్చే యుఎఇ ప్రయాణికులకు ఈజీ ఎంట్రీ, తక్కువ ఫార్మాలిటీలు, మరింత సౌలభ్యం ఉండేలా ఈ నిర్ణయం తీసుకుంది.  రెండు దేశాల మధ్య పర్యాటకం, విమాన కనెక్టివిటీ పెరుగుతున్నందున.. VoA నెట్‌ వర్క్ ను విస్తరించింది. చివరి నిమిషంలో హాలీడేస్, వీకెండ్ ట్రిప్స్, కల్చరల్ ఎక్స్ ప్లొరేషన్ ను మరింత పోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తుంది. భారత్, యుఎఇ మధ్య ట్రావెల్ కారిడార్ బలోపేతం కానుంది.

మరో మూడు విమానాశ్రయాలకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం

ఇప్పటికే ఆరు ఎయిర్ పోర్టులలో యుఎఇ టూరిస్టులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉండగా, ఇప్పుడు మరో మూడు ఎయిర్ పోర్టులకు విస్తరించింది. కొచ్చి, కాలికట్, అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులలోనూ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ లిస్టులో న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు,  హైదరాబాద్ ఉన్నాయి. మొత్తంగా ఇప్పుడు వీసా ఆన్ అరై వల్ సౌకర్యం ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల సంఖ్య మొత్తం తొమ్మిదికి చేరింది.

వీసా ఆన్ అరైవల్‌ సౌకర్యాన్ని ఎవరు పొందవచ్చంటే?

Advertisement

వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని పొందడానికి యుఎఇ ప్రయాణికులు కొన్ని కండీషన్స్ కు లోబడి ఉండాలి.

⦿ ఇండియన్ ఇ-వీసా, రెగ్యులర్/పేపర్ వీసాను గతంలో పొంది ఉండాలి. వారు దానిని ఉపయోగించి ప్రయాణించకపోయినా ఫర్వాలేదు.

Advertisement

⦿ కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే పాస్‌ పోర్ట్‌ ను కలిగి ఉండాలి. రెండు ఖాళీ పేజీలతో ఉండాలి.

⦿ పర్యాటకం, వ్యాపారం, సమావేశాలు, మెడికల్ ప్రయోజనాల కోసం, 60 రోజులకు మించకుండా ఉండేందుకు భారత్ కు వచ్చేవారికి అవకాశం ఉంటుంది.

⦿ తల్లిదండ్రులు, తాతా, మామల వ్యక్తులు పాకిస్తాన్‌ లో జన్మించినవారు, శాశ్వత నివాసితులు కాకూడదు. అటువంటి ప్రయాణికులు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం లేదంటే దుబాయ్‌ లోని భారత కాన్సులేట్ జనరల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

⦿ భారత్ కు మొదటిసారి వచ్చే సందర్శకులు రాకముందే ఇ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది.

వీసా ఫీజు, వ్యాలిడిటీ   

భారత వీసా కోసం ప్రయణీకుడికి రూ. 2000 చెల్లించాల్సి ఉంటుంది. పెద్దలు, పిల్లలకు కూడా ఇదే ఛార్జీ విధిస్తారు. ఈ వీసా 60 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. డబుల్-ఎంట్రీ VoA 60 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. 60 రోజులలోపు రెండు విజిట్స్ చెయ్యొచ్చు. ఒక వ్యక్తి ఈ సౌకర్యాన్ని ఎన్నిసార్లు పొందవచ్చనే దానిపై ఎటువంటి పరిమితి లేదు.

Read Also: జస్ట్, 7 గంటల్లో ప్రపంచాన్ని చుట్టేసే విమానాన్ని సిద్ధం చేస్తున్న చైనా.. టికెట్ ధర ఎంతంటే?

Related News

11 రాష్ట్రాలు.. 4,000 కిలో మీటర్లు.. దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇదే!

భారీ వర్షాలకు దెబ్బతిన్న ట్రాక్.. రైళ్ల రాకపోకలకు బ్రేక్!

రైళ్లలో ఇక చెత్తబుట్టలు నిండిపోవు.. ఇండియన్ రైల్వే సూపర్ ప్లాన్!

వర్షాల దెబ్బకు కుంగిన రైల్వే ట్రాక్.. ఏకంగా 14 ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు!

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. గుంటూరు, తిరుపతి సహా 8 రైళ్ల టైమింగ్స్ ఛేంజ్!

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

Big Stories

Advertisement
×