E-Paper
Advertisement

One Battle After Another on OTT : లియోనార్డో డికాప్రియో బ్లాక్ కామెడీ యాక్షన్ చిత్రం ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చు అంటే ?

One Battle After Another on OTT : లియోనార్డో డికాప్రియో బ్లాక్ కామెడీ యాక్షన్ చిత్రం ఓటీటీలోకి… ఎప్పుడు, ఎక్కడ చూడచ్చు అంటే ?
Advertisement

One Battle After Another on OTT : గత ఏడాది థియేటర్లలోకి వచ్చిన టైటానికి హీరో లియోనార్డో డికాప్రియో మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. మూడు గంటల నిడివి గల ఈ బ్లాక్ కామెడీ యాక్షన్ చిత్రం కథ, ఒక మాజీ విప్లవకారుడు బాబ్ ఫెర్గూసన్ (లియోనార్డో డికాప్రియో) చుట్టూ తిరుగుతుంది. తన కూతురు అదృశ్యం కావడంతో, తన పాత శత్రువుల నుండి ఆమెను రక్షించుకోవడానికి అతను చేసే పోరాటమే ఈ సినిమా. ఇది విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుని, బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లను సాధించింది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ హాలీవుడ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ (One Battle After Another). ప్రఖ్యాత దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టైటానిక్ స్టార్ లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 26న థియేటర్లలో విడుదలైంది. 2026 ఫిబ్రవరి 26 నుండి JioHotstarలో స్ట్రీమింగ్ కానుంది. ఇది థామస్ పిన్చాన్ రాసిన 1990 నాటి నవల ‘వైన్‌ల్యాండ్’ ఆధారంగా రూపొందింది. ఇందులో లియోనార్డో డికాప్రియోతో పాటు సీన్ పెన్, బెనిసియో డెల్ టోరో, రెజినా హాల్, టెయానా టేలర్ వంటి ప్రముఖులు కూడా నటించారు. ఇది దాదాపు 175 మిలియన్ల బడ్జెట్‌తో, ఆండర్సన్ కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రం కూడా .

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఇది1980 కాలంలో కాలిఫోర్నియాలో జరుగుతుంది. ఇందులో బాబ్ ఫెర్గూసన్ (లియోనార్డో డికాప్రియో) ఒక విచిత్రమైన, కాస్త గందరగోళమైన జీవితం గడిపే వ్యక్తి. ఒకప్పుడు విప్లవ భావాలు ఉన్న బాబ్ , తన కూతురు హఠాత్తుగా మాయమవడంతో ఆమెను వెతుక్కుంటూ బయలుదేరుతాడు. ఈ క్రమంలో అతను తన పాత శత్రువులైన ఫెడరల్ ఏజెంట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక సమస్య తీరింది అనుకునేలోపే మరో కొత్త సమస్య ఎదురవుతూ, సినిమా అంతా “ఒకదాని తర్వాత ఒకటి” (One Battle After Another) యుద్ధం చేస్తున్నట్లే సాగుతుంది. కథ ముందుకు వెళ్లేకొద్దీ, బాబ్ తన కూతురిని మిస్సింగ్ వెనుక పెద్ద రాజకీయ కుట్రలు ఉన్నాయని అతనికి అర్థమవుతుంది. అతనికి ఎదురయ్యే మనుషులు, పరిస్థితులు అన్నీ చాలా వింతగా, ఉత్కంఠభరితంగా ఉంటాయి. చివరికి బాబ్ తన కూతురిని కాపాడుకుంటాడా ? అసలు ఆమె ఎందుకు కిడ్నాప్ అయింది ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ బ్లాక్ కామెడీ యాక్షన్-థ్రిల్లర్ ను చూసి తెలుసుకోండి.

Read Also : బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ‘ల్యాండ్‌లార్డ్’… స్ట్రీమింగ్ కోసం ఎదురు చూపులు

Tags

Related News

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×