E-Paper
Advertisement

Court Room Darama Series : బాస్ మీద వేధింపుల కేసు… కోర్టులో దద్దరిల్లే వాదనలు… ఓటీటీలోకి బెంగాలీ సిరీస్

Court Room Darama Series : బాస్ మీద వేధింపుల కేసు… కోర్టులో దద్దరిల్లే వాదనలు… ఓటీటీలోకి బెంగాలీ సిరీస్
Advertisement

Court Room Darama Series : ఓటీటీలోకి ఇక బెంగాలీ కోర్టు డ్రామా వెబ్ సిరీస్ రీసెంట్ గా స్ట్రీమింగ్ కి వచ్చింది. తన బాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కోర్టుకు వెళ్ళే జయితా అనే యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కోర్టు డ్రామా వెబ్ సిరీస్ లను ఇస్టపడే వాళ్ళుకు ఈ సిరీస్ బెస్ట్ ఛాయిస్. అయితే ఇందులో  అ*డల్ట్ కంటెంట్ ఉన్నందున దీనికి 18+ రేటింగ్ ఇవ్వబడింది. పిల్లలు ఈ సిరీస్ కి దూరంగా ఉండటమే మంచిది. దీని పేరు ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ బెంగాలీ కోర్టు డ్రామా వెబ్ సిరీస్ పేరు ‘అదాలత్ ఓ ఏక్టి మేయే’ (Adalat O Ekti Meye). ఇది 2026 ఫిబ్రవరి 20 నుండి ప్రముఖ బెంగాలీ ఓటీటీ ప్లాట్‌ ఫామ్ hoichoi లో స్ట్రీమింగ్ అవుతోంది. కమలేశ్వర్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో కౌషాని ముఖర్జీ, కౌశిక్ సేన్, బసబ్దత్త ఛటర్జీ, రాహుల్ అరుణోదయ బెనర్జీ వంటి నటులు నటించారు. ఇది 1981లో వచ్చిన తపన్ సిన్హా క్లాసిక్ సినిమా ‘అదాలత్ ఓ ఏక్టి మేయే’ ఆధునిక వెర్షన్. మొత్తం 7 ఎపిసోడ్లతో ఈ సిరీస్ రూపొందింది. ప్రతి ఎపిసోడ్ కథను ఒక్కో మలుపు తిప్పుతుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జయిత అనే అమ్మాయి ఒక కార్పొరేట్ కంపెనీలో పని చేస్తూ ఉంటుంది. తన బాస్ డీకే తనపై లైంగిక దాడి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ మొదలవుతుంది. అయితే ఈ కేసు పెట్టవద్దని జయిత కుటుంబ సభ్యులు ఆమెపై తీవ్రమైన ఒత్తిడి తెస్తారు. సమాజం ఏమనుకుంటుందో అన్న భయం ఒకవైపు, తన ఆత్మగౌరవం కోసం పోరాడాలనే పట్టుదల మరోవైపు.. ఈ రెండింటి మధ్య జయిత చేసే పోరాటమే ఈ సిరీస్. అయితే కోర్టులో ఈ కేసు విచారణ మొదలైనప్పుడు అసలు కష్టాలు మొదలవుతాయి. జయితకు ఆ రోజు జరిగిన సంఘటనలు పూర్తిగా గుర్తుండవు. దీన్నే అడ్డం పెట్టుకుని ప్రత్యర్థి తరపు లాయర్ ఆమెను ఇబ్బంది పెడతాడు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? నిజంగానే ఆమెపై అఘాయిత్యం జరిగిందా ? మరో మలుపు ఉందా? చివరికి కోర్టులో ఎలాంటి నిజం బయటపడింది? అనే విషయాలు ఉత్కంఠభరితంగా సాగుతాయి.

Read Also :  జోంబీగా మారే కూతురు… తండ్రి మాస్టర్ ప్లాన్… ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోలేరు భయ్యా

Tags

Related News

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

Big Stories

Advertisement
×