OTT Movie : హాలీవుడ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలకు ఒక రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుంది. ఈ సినిమాలలో కొన్ని సీన్స్ యూత్ ని గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తాయి. ఒక రాజ్యంలో రాణి బయటకు వెళ్లి సాధారణమైన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం లాంటి కథలు చాలానే చూశాం. అయితే ఈ రోజు మన మూవీ సజ్జేషన్ లో చెప్పుకోబోయే యూత్ ఫుల్ మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “వర్జిన్ టెర్రిటరి” (Virgin Territory) హీరో ఒక చర్చిలో మూగవాడి గా నటిస్తూ అందులో ఉండే నన్స్ తో ఏకాంతంగా గడుపుతూ ఉండగా, ఆ రాజ్యపు యువరాణి అతనిని ప్రేమించడంతో మూవీ స్టోరీ నడుస్తుంది. ప్రస్తుతం ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఒక రాజ్యంలో పింపిని అనే యువరాణి ఉంటుంది. ఆమె తండ్రి చనిపోవడంతో జర్మినో అనే వ్యక్తి రాజ్యాధికారం చేజిక్కించుకుంటాడు. అయితే యువరాణిని పెళ్లి చేసుకోవడానికి జర్మినో ప్రయత్నిస్తాడు. అది ఇష్టం లేని యువరాణి రాజ్యం నుంచి ఒంటరిగా బయటకి వెళ్ళిపోతుంది. మరోవైపు హీరో మూగవాడిగా నటిస్తూ ఒక చర్చిలో ఉంటాడు. అతడు నిజంగానే మూగవాడు అని అనుకుంటారు అక్కడున్న నన్స్. హీరో అందంగా ఉండటంతో నన్స్ హీరోని ఇష్ట పడతారు. హీరో వాళ్లతో ప్రతిరోజు ఏకాంతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ హీరో అదే పనిలో ఉంటాడు. ఆ సమయంలోనే ఆ ప్రాంతంలోకి యువరాణి నన్ రూపంలో వస్తుంది. అయితే హీరో మూగవాడు కాదని హీరోయిన్ కి తెలిసిపోతుంది. యువరాణి కూడా అతనిని ఇష్టపడుతుంది. ఒక రోజు అతనికి చెవిలో ఐ లవ్ యు అని చెప్పి వెళ్ళిపోతుంది.
హీరో ఇలా చేస్తున్నాడని తెలిసి ఆ చర్చిలో ఫాదర్ అతనిని అక్కడినుంచి బయటికి పంపిస్తారు. యువరాణి మళ్లీ రాజ్యానికి వెళుతుండగా అతనిని కూడా తీసుకొని వెళుతుంది. హీరోయిన్ అతనిని తన రాజ్యంలో పెడుతుంది. వీరిద్దరి ప్రేమ గురించి తెలిసిన జర్మినో హీరోని చరసాలలో బంధిస్తాడు. ఈ విషయం తెలిసిన యువరాణి జర్మినో తో, నిన్ను పెళ్లి చేసుకోవాలంటే అతనిని వదిలేయమని చెప్తుంది. ఇంతలో హీరోయిన్ ఒక ఉపాయం ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఆ రాజ్యానికి ఒక యువరాజు యువరాణిని పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. ఈ క్రమంలో యువరాణిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? హీరో జైలు నుంచి బయటికి వస్తాడా? యువరాణి వేసే పధకం ఏమిటి? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “వర్జిన్ టెర్రిటరరి” (Virgin Territory) మూవీని మిస్ కాకుండా చూడండి.