Kukatpally News: హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. కూకట్ పల్లిలో బంధువులతో కలిసి షటిల్ ఆడుతుండగా.. కరెంట్ షాక్ తో 14 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ట్రాన్స్ ఫార్మర్ పై పడ్డ షటిల్ కాక్ ను బాలుడు విజయ్ చంద్రకాంత్ బ్యాట్ తో తీసేందుకు ప్రయత్ని్స్తుండగా కరెంట్ షాక్ కు గురయ్యాడు. కిందపడి విలవిల కొట్టుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం..
క్షణాల్లో జరిగిపోయింది..
స్థానికులు సమాచారం ప్రకారం.. బాలుడు విజయ్ చంద్రకాంత్ బంధువులు, ఫ్రెండ్స్ తో షటిల్ ఆడుతున్నాడు. అయితే ఆడుకుంటుండగా బాలుడు కొట్టిన షటిల్ కాక్ నేరుగా వెళ్లి ట్రాన్స్ ఫార్మర్ పై పడింది. అయితే ఆ కాక్ ను తీసుకోవడానికి బాలుడు తన చేతిని ఉపయోగించాడు. దీంతో హైఓల్టేజీతో బాలుడు కరెంట్ షాక్ కు గురయ్యాడు. బాలుడు ఒక్కసారిగా గట్టి అరుస్తూ కింద పడిపోయాడు. స్పృహ కోల్పోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రి తరలించేందకు సిద్ధమయ్యారు.. అయితే ఆస్పత్రికి తరలించగా అప్పటికే.. బాలుడు మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాన్స్ఫార్మర్ పై కాక్ పడటంతో షటిల్ బ్యాట్ తో తీసేందుకు ప్రయత్నించగా కరెంట్ షాక్ తగిలి 14 ఏళ్ల బాలుడు మృతి
KPHB లోని వసంత్‌నగర్‌లో ఘటన pic.twitter.com/OFcvgmMHo8
— BIG TV Breaking News (@bigtvtelugu) August 11, 2025
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం..
అపార్ట్ మెంట్ పక్కనే ట్రాన్స్ ఫార్మర్ ఉండడం బాలుడు మృతికి కారణమైంది. వర్షకాలంతో కరెంట్ తో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో అపార్ట్ మెంట్ చుట్టూరా రక్షణ కంచెలు లేకపోవడం కుటుంబ సభ్యులతో పాటు స్థానికుల్లో ఆందోళన కలిగిసోతంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో చుట్టూరా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
వర్షాకాలంలో కరెంట్ తో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.. విద్యుత్ వైర్లను ఎవరు తాకవద్దని నిపుణులు సూచిస్తున్నారు. తడి చేతులతో స్విచ్ లు, ప్లగ్ లు ముట్టుకోవద్దని చెబుతున్నారు. పిడుగుపాటు సమయంలో కరెంట్ ఆఫ్ చేయడం. ఇంట్లో స్విచ్ లు, కరెంట్ వస్తువులు నుంచి వాసన రావడం గమనిస్తే కరెంట్ నిలిపివేసి సమీపంలో ఎలక్ట్రీషియన్ ను సంప్రదించండి.
ALSO READ: Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్
ALSO READ: ECL Notification: ఈసీఎల్‌లో 1123 అప్రెంటీస్ ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం.. మంచి అవకాశం బ్రో