Telugu Film Federation Comments: తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫిల్మ్ఫెడరేషన్ సభ్యుల సమావేశం ముగిసింది. తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై నేడు ఫెడరేషన్ సభ్యులు, వివిధ సినిమా సంఘాల ప్రతినిధులు సోమవారం సచివాలయంలో మంత్రిని కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఫెడరేషన్తో సమావేశమై కార్మికుల సమస్యలపై చర్చించారు. కార్మికుల సమ్మె విషయంలో నిర్మాతలు కాస్తా తగ్గాలని సూచించారు. ఫెడరేషన్ తో చర్చించి వారి సమస్యలు పరిష్కరించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అలాగే యూనియన్లు సమ్మె చేయడం కరెక్ట్ కాదన్నారు. అలాగే నిర్మాత చెప్పినట్టుగా ఇయర్ వైస్ పెంపుకు ఫెడరేషన్ సభ్యులు అంగీకరించాలని ఆయన సూచించారు.
ఫెడరేషన్ కు సానుకూలంగా
అలాగే దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో మంత్రి ఫెడరేషన్ సభ్యులకు సానుకూలంగా స్పందించారని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు మీడియాకు తెలిపారు. సమావేశం అనంతరం వారు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. మా పరిస్థితి మంత్రికి వివరించామన్నారు. ‘సమావేశంలలో పలు అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. మేము చెప్పిన సమస్యల పై ఆయన నిర్మాతలకు ఫోన్ చేసి మాట్లాడారు. మా సమస్యలను వారికి చెప్పారు. రేపటి నిర్మాతలతో సమావేశానికి మంత్రి వస్తానని చెప్పారు. రేపటి ఫిల్మ్ ఛాంబర్ భేటీలో సానుకూల స్పందన వస్తుందని నమ్ముతున్నాం. రేపటి భేటీలో అంతిమ నిర్ణయం ఉంటుంది. మా తరపున కమిటీ ఉంది. కమిటీ సభ్యులు హాజరు అవుతారు‘ అని చెప్పారు.
కాగా 30 శాతం వేతనాల పెంపు డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు సమ్మెకు సైరన్ మోగించారు. దాదాపు వారం రోజులుగా ఈ సమ్మె కొనసాగుతుంది. ఈ వ్యవహరంలో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య సఖ్యత కుదరడం లేదు. అంతేకాదు ఇరు వర్గాలు కూడా తగ్గేదే లే అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. మరోవైపు ఫెడరేషన్ ఇష్టారీతిని నిర్ణయాలు తీసుకుంటున్నాయి, యూనియన్ నేతల వల్ల నిర్మాతలు తరచూ సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోందని నిర్మాతల మండలి అసహనం వ్యక్తం చేస్తోంది. తమ డిమాండ్ల మేరకు కార్మికులు 30 శాతం వేతనాల పెంపు కుదరదని, సమ్మె విరమించి షూటింగ్ లకి వచ్చిన వాళ్లతో పని చేయించుకుంటాం.. లేదని ఇతర రాష్ట్రల నుంచి కార్మికులు తెప్పించుకుని షూటింగ్స్ కొనసాగిస్తామని నిర్మాతలు అంటున్నారు.
షూటింగ్స్ పున:ప్రారంభం..
మరోవైపు ఫెడరేషన్ కూడా వేతనాలు పెంచకంటే సమ్మె విరమించేది లేదని, ఎన్ని రోజులైన తమ నిరసన కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు సినిమా పంచాయతీ ప్రభుత్వ వరకు చేరింది. సమ్మె సమస్య కొలిక్కి రాకపోవడం మంత్రి కోమటిరెడ్డి వెంకటరేడ్డిని ఫెడరేషన్ సభ్యులు, వివిధ సినిమా సంఘాల ప్రతినిధులు మంత్రితో భేటీ అయ్యారు. తమ ప్రభుత్వం కార్మికుల పక్షమన్నారు. రాష్ట్రంలో సినీ కార్మికుల సమ్మె కారణంగా నిలిచిపోయిన పెండింగ్ షూటింగ్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి వారిని కోరారు. సినిమా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నామని, ఈ కమిటీ అన్ని పక్షాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. బుధవారం నుండి షూటింగ్స్ పునఃప్రారంభమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Producer SKN: నిర్మాతల సంచలన నిర్ణయం.. ఇండస్ట్రీ సమస్యలు క్లియర్ అయ్యేవరకు..