Ananya Pandey : బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రజలకు ఈ పేరు పరిచయమే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన భారీ డిజాస్టర్ మూవీ లైగర్ లో హీరోయిన్ గా నటించింది. సినిమా టాక్ పక్కనపెడితే అమ్మడు అందాలకు, నటనకు తెలుగు ప్రజలు ఫిదా అయ్యారు. తెలుగులో ఈ సినిమా తర్వాత పాగా వెయ్యాలని అనుకుంది. కానీ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలకే అంకితం అయింది. బాలీవుడ్ లో పలు భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. త్వరలోనే ఈమె పెళ్లి పీటలు ఎక్కబోతుందని ఓ వార్త ఇండస్ట్రీని ఊపేస్తుంది. నిజా నిజాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
అనన్య పాండే, హీరో ఆదిత్య రాయ్ కపూర్ నుంచి బ్రేకప్ అయ్యాక మళ్లీ డేటింగ్ ప్రారంభించిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో భార్య నుంచి విడాకులు తీసుకున్న హార్థిక్ పాండ్యాతో అనన్య సన్నిహితంగా ఉందని ప్రచారం సాగింది.. ఇప్పుడు ఓ విదేశీ మోడల్ తో ప్రేమాయణం సాగిస్తుందని ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఇప్పుడు మరో వార్త షికారు చేస్తుంది. అనన్యకు పెళ్లి కూడా జరిగిపోతోందంటూ ఒకటే ప్రచారం హోరెత్తిపోతోంది. యువ క్రికెటర్ రియాన్ పరాగ్ ని అనన్య వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. కొత్త సంవత్సరానికి అడ్వాన్స్ విషెస్ చెబుతూ పెళ్లికి కూడా శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు కొందరు ఫ్యాన్స్.
ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. త్వరలోనే వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి.. సోషల్ మీడియాలో అనన్య గురించి ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నా అనన్య మాత్రం స్పందించలేదు. పరాగ్ ఇటీవలే టీమ్ ఇండియా ఆటగాడిగా ఆరంగేట్రం చేసాడు. అయితే భుజం గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగిన T20 సిరీస్ లో ఆడలేకపోయాడు. మరోవైపు అనన్య పాండేతో అతడి వివాహం జరగబోతోందనే ప్రచారం . అయితే గతంలో ఈ క్రికెటర్ అనన్య పాండే హాట్ గురు అనే కామెంట్ చేసాడు. దాంతో ఈ వార్తలు మొదలయ్యాయి. ఆ తర్వాత అనన్యను రియాన్ ప్రేమిస్తున్నాడన్న వాదన బలపడింది. అయితే ఇప్పుడు కొత్తగా పెళ్లి పుకారు పుట్టుకొచ్చింది. ఇది పూర్తిగా నిరాధారమైనది. నిజానికి ఎలాంటి వాస్తవం లేకుండా సెలబ్రిటీ సర్కిల్స్‌లో తరచూ ఇలాంటి గాసిప్‌లు చక్కర్లు కొట్టడం సహజం.. దీనిపై వీరిద్దరిలో ఎవరొకరు స్పందిస్తే తప్ప అసలు నిజం ఏంటో తెలియదు. ఏం చెప్తారో చూద్దాం.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే రెండు ప్రాజెక్టు లకు సైన్ చేసిందని తెలుస్తుంది. త్వరలో వాటి గురించి పూర్తి వివరాలు తెలియనున్నాయి..