AmePushpa 2 Advance Booking: ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 మరికొద్ది రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాను థియేటర్లలో ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2.. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో మేకర్స్ ఒక్కో అప్డేట్ ను వదులుతున్నారు.. తాజాగా ఈ మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. త్వరలో ట్రైలర్ ను రిలీజ్ చెయ్యనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక అలాగే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ను కూడా నేటి నుంచే ఓపెన్ అయ్యాయి. పుష్ప గాడి సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి.. బుకింగ్స్ లో దున్నెస్తుంది. ఇప్పటివరకు ఎన్ని కోట్లు రాబట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం..
పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్..
అల్లు అర్జుమ్ పుష్ప 2 అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేసుకుల్లాగ అమ్ముడు పోయాయని తెలుస్తుంది.. నిజానికి ఓవర్సీస్‌లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ను ఒక నెల ముందుగానే ప్రారంభించారు. పలు దేశాల్లో ఈ సినిమాకు భారీగా బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. ఇకపోతే విడుదలకు 20 రోజులకు పైగా ఉండగా రికార్డు ప్రీ సేల్స్ నమోదు అవుతున్నాయి. ఈ సినిమా ఓవర్సీస్ లో ఇప్పటి వరకు సుమారుగా 1 మిలియన్ డాలర్లకు చేరువైంది. అంటే సుమారుగా ఈ సినిమా రిలీజ్‌కు ముందే 8.3 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లు సమాచారం.. ఇంకా మరో మూడు రోజులు ఈ కాసుల వర్షం కురిపిస్తుంది. .
డిసెంబర్ 5 న ప్రపంచం వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి ప్రమోషన్స్‌ను గతంలో ఎన్నడూ చూడని రీతిలో చేయనున్నారు. ఇండియాలోని ప్రధాన నగరాల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. నవంబర్ 17వ తేదీన పాట్నా లో ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా ప్రమోషన్స్‌ను చేస్తున్నారని టాక్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను ఇటీవలే అమెరికాలో ప్రారంభించారు.. ఇక తెలుగులో ఏ మాత్రం రాబడుతుందో చూడాలి..
అల్లు అర్జున్ , సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘పుష్ప’ చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. 2021 లో విడుదలైన ఈ సినిమా తెలుగు లో అంతంత మాత్రమే ఆడినప్పటికీ.. నార్త్ లో ప్రభంజనం సృష్టించించింది. అక్కడ ఏకంగా రూ. 108 కోట్లు రాబట్టింది. తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా హిట్ అనిపించుకుంది. ఓవర్సీస్లో కూడా మంచి వసూళ్లు సాధించింది. దీంతో సెకండ్ పార్ట్ పై హైప్ ఏర్పడింది.. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప 2 కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. ఇప్పటి వరకు మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ తో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..