OTT Releases This Week : మే నెల ముగిసి జూన్ మొదటి వారం మొదలయింది. ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు యాక్షన్, డ్రామా, క్రైమ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిపోయాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన అనేక చిత్రాలు, సిరీస్ లు ఈ వారం విడుదలవుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
ETV Win ఓటీటీలో మే 31 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ షురూ అయ్యింది. ఆంటోనీ మట్టిపల్లి దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ షార్ట్ ఫిల్మ్ లో మానవ సంబంధాలు, వ్యక్తిగత పోరాటాలను స్ట్రెయిట్ గా, హార్ట్ టచింగ్ గా చూపించారు . సుధ, లావణ్య, జయంత్, రాఘవ ప్రధాన పాత్రలు పోషించారు. సింపుల్ స్టోరీతో మెప్పించే చిత్రం ఇది.
తమిళ ఫ్యామిలీ డ్రామా ‘కార్మెని సెల్వం’ జూన్ 3న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతోంది. సముద్రఖని, గౌతం వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా చంద్రమౌళి నటించిన ఈ చిత్రం ఒక టాక్సీ డ్రైవర్ జీవిత సంఘర్షణలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల మధ్య అతను ఎదుర్కొనే సవాళ్లు కన్నీళ్ళు తెప్పిస్తాయి. తెలుగు డబ్బింగ్ తో కూడా అందుబాటులో ఉంటుంది.
జూన్ 3న అమెజాన్ MX ప్లేయర్‌లో విడుదలవుతున్న ఆరు ఎపిసోడ్‌ల పీరియడ్ డ్రామా ఇది. టైటాన్ వాచీల సృష్టి వెనుక ఉన్న అద్భుతమైన ప్రయాణం, భారతదేశపు ప్రతిష్టాత్మక బ్రాండ్ ను నిర్మించిన దార్శనికుల కథ ఇది. నసీరుద్దీన్ షా, జిమ్ సర్భ్ నటించారు. తెలుగు డబ్బింగ్ ఆప్షన్ కూడా రానుంది.
జూన్ 4 న సాయంత్రం 7 గంటలకు జియో హాట్‌స్టార్‌లో విడుదలవుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ : ది రివేంజ్’. రణవీర్ సింగ్, మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ నటించిన ఈ చిత్రం “రా” కట్‌లో వస్తోంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
జూన్ 5న సోనీ లివ్‌లో విడుదలవుతున్న ఈ ఫ్యామిలీ డ్రామా సీజన్ మళ్లీ మిశ్రా కుటుంబ జీవితంలోకి తీసుకెళ్తుంది. హాస్యం, ఎమోషన్, రోజువారీ సవాళ్లతో నిండిన ఈ సిరీస్ మధ్యతరగతి జీవితాన్ని అందంగా చూపిస్తుంది. ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
Also Read : క్రైమ్ నుంచి రొమాన్స్ వరకు… ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే
నెట్‌ఫ్లిక్స్ జూన్ 4న విడుదల చేయనున్న డార్క్ కామెడీ మూవీ. మాధురీ దీక్షిత్, త్రిప్తి దిమ్రి, ధరణ దుర్గ నటించిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా రానుంది.
జూన్ 5న ZEE5లో విడుదలవుతున్న మలయాళ యాక్షన్ డ్రామా ఇది. మమ్ముట్టి, మోహన్‌లాల్, ఫహద్ ఫాసిల్, నయనతారలు నటించిన ఈ చిత్రం తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ వారం యాక్షన్, డ్రామా, క్రైమ్, కామెడీ అన్నీ ఉన్నాయి.
వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్ లో జూన్ 5న మలయాళ మూవీ ’29’, కన్నడ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కేడీ: ది డెవిల్’ 2026 జూన్ 5న ZEE5లో, కరిష్మా కపూర్ ‘బ్రౌన్’ సిరీస్ జూన్ 5న జీ5లో, అమెజాన్ ప్రైమ్ వీడియో కొత్త ఒరిజినల్ సిరీస్ ‘ది పిరమిడ్ స్కీమ్’ జూన్ 5న స్ట్రీమింగ్ కానున్నాయి.