E-Paper
Advertisement

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..  10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్
Advertisement

fire Accident in Hospital: ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగి ఒక రోజు గడవక ముందే అలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఏం జరిగిందో తెలీదుగానీ ఒక్కసారిగా ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బీహార్‌లోని ఓ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం

Advertisement

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఓ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మంటలు మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్త ఆసుపత్రిలోని వివిధ విభాగాలకు వ్యాపించినట్లు తెలుస్తోంది.

అధికారుల సమాచారం మేరకు.. ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పొగతో నిండిపోవడంతో మరణించిన వారిలో రోగులు ఉన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్ని ప్రమాదం గురించి తెలియగానే 12 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. దాదాపు నాలుగు గంటల తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Advertisement

తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఘటన.. 10 మంది మృతి?

అగ్ని ప్రమాదం విషయం తెలియగానే అధికారులు అలర్ట్ అయ్యారు. ఫలితంగా ఆసుపత్రిలోని సుమారు 20 మందిని రక్షించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐదో అంతస్తులో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చాలా మంది పేషెంట్ల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెబుతున్నారు. ఘటన సమయంలో ఆసుపత్రిలో ఎంతమంది రోగులున్నారు అనేది తెలియాల్సివుంది. ఘటన గురించి తెలియగానే రోగులు బంధువులు షాకయ్యారు.

ALSO READ: అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×