OTT Movie : ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న మలయాళం సినిమాలను, ఎక్కువగా ఫాలో అవుతున్నారు మూవీ లవర్స్. థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలను, కంటెంట్ బాగుంటే తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. థియేటర్లలో చూడకపోయినా ఓటిటి ప్లాట్ ఫామ్ అందుబాటులో ఉండటంతో, సమయం దొరికినప్పుడల్లా వీటిని చూసి ఎంటర్టైన్ అవుతున్నారు మూవీ లవర్స్. ఒక మలయాళం ఫ్యామిలీ డ్రామా మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మలయాళం మూవీ పేరు ‘పద్మ‘ (Padma). ఈ మూవీకి అనుప్ మీనన్ దర్శకత్వం వహించారు. ఇందులో సైకాలజిస్ట్ అయిన ఒక డాక్టర్ని తన భార్య మోసం చేస్తుంది. చివరికి ఇతనికి కూడా ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
రవి తన భార్య పద్మతో కలసి, ఒక మారుమూల గ్రామంలో సైకాలజిస్ట్ గా ఉంటాడు. సిటీలో క్లినిక్ పెడితే డబ్బులు ఉన్న రిచ్ పేషెంట్స్ వస్తారని, సిటీకి మకాం మారుస్తాడురవి. అక్కడ పద్మ రిచ్ పర్సన్స్ తో కలవడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటుంది. రవికి మాత్రం పేషెంట్స్ బాగానే వస్తుంటారు. వారి ప్రాబ్లమ్స్ కూడా రవి క్లియర్ చేస్తూ ఉంటాడు. ఒకసారి పద్మ ఫ్రెండ్స్ తో ఒక పార్టీకి వెళ్తుంది. అందులో హరిదాసు అనే వ్యక్తి పాటలు పాడుతాడు. హరిదాస్ పాటకు పద్మ మైమరిచిపోతుంది. అతని గురించి ఎక్కువ ఆలోచించడం మొదలు పెడుతుంది. ఈ క్రమంలో ఒక కాఫీ షాప్ లో అతన్ని కలవడానికి వెళుతుంది. అయితే అతడు తన రూమ్ కి ఇన్వైట్ చేస్తాడు. వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తూనే వెళ్లిపోతుంది. హరిదాసుతో ఆరోజు పద్మ ఏకాంతంగా గడుపుతుంది. ఆ తర్వాత పద్మ చాలా బాధపడి, భర్తని మోసం చేశానని ఏడుస్తుంది.
మరోవైపు రవి దగ్గరికి ఒక టీనేజ్ అమ్మాయి వచ్చి, తనకున్న ప్రాబ్లం చెప్తుంది. ఒక వ్యక్తి తనలో ఉన్న ఫీలింగ్స్ ని బయటకు తెచ్చాడని, వాటిని కంట్రోల్ చేయడానికి కొన్ని వీడియోలకు అలవాటు పడ్డాను అని చెప్తుంది. అందుకు డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఇలా ఉన్న క్రమంలో తన భార్య చేసిన పని భర్తకి తెలుస్తుంది. విషయం తెలిసిన భర్త మద్యం బాగా సేవించి ఆ అమ్మాయితో అసభ్యంగా మాట్లాడుతాడు. ఆ అమ్మాయి డాక్టర్ మాటలకి హర్ట్ అవుతూ సూసైడ్ చేసుకోవాలని అనుకుంటుంది. ఆ తర్వాత సారీ చెప్పి ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకుంటాడు. తనకు భార్య వల్ల సమస్యలు వస్తున్నాయని మరొక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ కోసం వెళ్తాడు. చివరికి రవి భార్యను క్షమిస్తాడా? రవి భార్యకు హరిదాస్ తో సంబంధం కంటిన్యూ అవుతుందా? వీళ్ళిద్దరూ నెక్స్ట్ స్టెప్ ఎలా వేసుకుంటారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘పద్మ’ (Padma) మూవీని మిస్ కాకుండా చూడండి.