OTT Movie : థ్రిల్లర్ సిరీస్‌లు మనల్ని ఉత్కంఠతో నిండిన ప్రపంచంలోకి తీసుకెళతాయి. బో*ల్డ్ థీమ్ తో తెరకెక్కిన ఒక థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలో సందడి చేస్తోంది. డార్క్ కామెడీ, మధ్యతరగతి జీవితంలోని గందరగోళంతో నిండిన కథలను మీరు ఇష్టపడితే, ఈ హిందీ సిరీస్ పై ఓ లుక్ వేయండి. IMDbలో 7.0/10 రేటింగ్‌తో ఈ సిరీస్ ప్రశంసలు కూడా అందుకుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది. ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
ఈ కథ నోయిడాలో ఒక నిజాయితీ గల గవర్నమెంట్ ఉద్యోగి, చార్టర్డ్ అకౌంటెంట్ (CA) టాపర్ అయిన త్రిభువన్ మిశ్రా అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. త్రిభువన్ తన భార్య అశోకలత, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తుంటాడు. “నిజాయితీ నా బలం!” అని అతను గర్వంగా చెబుతాడు. లంచం తీసుకోవడాన్ని ద్వేషిస్తాడు. అతని బావ షంభు, బావమరిది షోభ అతన్ని “లూజర్” అని ఎగతాళి చేస్తుంటారు. ఒక రోజు, బ్యాంక్ స్కామ్ కారణంగా త్రిభువన్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. అతని సేవింగ్స్ కూడా పోతాయి. “ఇప్పుడు నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి?” అని అతను ఆందోళన చెందుతాడు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి రిపేర్లు, అశోకలత బేకరీ కల కోసం డబ్బు అవసరం కోసం త్రిభువన్ ఒక బిల్డర్ నుండి లంచం తీసుకుంటాడు. కానీ నీతి బాధతో ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని అనుకుంటాడు.
“ఇలా కాదు, నేను నిజాయితీగా డబ్బు సంపాదించాలి!” అని అతను భావోద్వేగంగా అనుకుంటాడు. అప్పుడు అతని స్నేహితుడు వినీత్, ఒక ప్రొఫెషనల్ మేల్ ఎస్కార్ట్, అతనికి షాక్ అయ్యే సలహా ఇస్తాడు. కానీ ఫ్యామిలీ కోసం “CA టాపర్” అనే పేరుతో ఆన్‌లైన్ అడల్ట్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేస్తాడు. “నేను ఈ విషయంలో బెస్ట్, ఎందుకు ట్రై చేయకూడదు?” అని అతను సరదాగా నవ్వుకుంటాడు. త్రిభువన్ త్వరలో నోయిడా మహిళలలో సూపర్‌హిట్ అవుతాడు. “CA టాపర్ బెస్ట్, అతను మమ్మల్ని లిసెన్ చేస్తాడు!” అని క్లయింట్స్ పొగిడేస్తారు. అతను డబ్బు సంపాదించి, అశోకలతకు బేకరీ ఓపెన్ చేస్తాడు. పిల్లల స్కూల్ ఫీజులు కడతాడు. “డబ్బు సంతోషాన్ని కొనగలదు!” అని అతను గర్వంగా అనుకుంటాడు. రంగురంగు షర్ట్స్ వేసుకుని, కాన్ఫిడెంట్‌గా నడుస్తాడు.
Read Also : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే
కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వస్తుంది. అతని క్లయింట్ బింది జైన్, నోయిడా “భుజియా కింగ్” తీకా రామ్ జైన్ భార్య, త్రిభువన్‌తో బాలీవుడ్ రొమాన్స్ కలలు కంటుంది. తీకా రామ్, ఒక గ్యాంగ్‌స్టర్. బింది అఫైర్ గురించి తెలుసుకుని, “ఈ CA టాపర్ ఎవడు?” అని కోపంతో రగిలిపోతాడు. ఒక హోటల్‌లో అతని అనుచరుడు రెడ్-హ్యాండెడ్‌గా పట్టుకుంటాడు. “నీవు నా బాస్ భార్యతో డాన్స్ చేస్తావా?” అని గన్ తీస్తాడు. గందరగోళంలో, త్రిభువన్ సెల్ఫ్-డిఫెన్స్‌లో అనుచరున్ని చంపేస్తాడు. “అమ్మో, నేను మర్డరర్‌నా?” అని త్రిభువన్ భయపడతాడు. బింది, “ఫింగర్‌ప్రింట్స్ తొలగించు, నేను సీక్రెట్‌గా నీకు హెల్ప్ చేస్తాను!” అని చెబుతుంది. త్రిభువన్ తన స్నేహితుడు వినీత్ సహాయంతో తప్పించుకుంటాడు. కానీ తీకా రామ్ త్రిభువన్‌ను వెతుకుతుంటాడు.
బింది మొదట త్రిభువన్‌కు సమాచారం ఇస్తూ సహాయం చేస్తుంది. కానీ ఒక రోజు, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను, లేచిపోదామా అని ప్రపోజ్ చేస్తుంది. త్రిభువన్, “అరె, నేను నా భార్యను ప్రేమిస్తాను, ఇది జస్ట్ బిజినెస్!” అని రిజెక్ట్ చేస్తాడు. బింది హార్ట్‌బ్రేక్ అయి, “నీవు నా బాలీవుడ్ డ్రీమ్‌ను బ్రేక్ చేశావు!” అని కోపంతో తీకా రామ్‌తో జతకట్టి త్రిభువన్‌ను చంపాలని ప్లాన్ చేస్తుంది. ఇక ఈ స్టోరీ ఉత్కంఠభరిత మలుపు తీసుకుంటుంది. త్రిభువన్ ఈ సమస్యల నుంచి ఇబయటపడతాడా ? బింది అనుకున్న పని చేస్తుందా ? త్రిభువన్ అడల్ట్ సైట్ లోనే కొనసాగుతాడా ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ థ్రిల్లర్ సిరీస్ ని మిస్ కాకుండా చుడండి.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
ఈ హిందీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘Tribhuvan Mishra CA Topper’. అమృత్ రాజ్ గుప్తా దీనికి దర్శకత్వం వహించారు. 2024 జూలై 18న ఇది నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. 9 ఎపిసోడ్‌లు, ఒక్కొక్కటి 44-67 నిమిషాలతో, తెలుగు సబ్‌టైటిల్స్ తో అందుబాటులో ఉన్నాయి. ఇందులో మనవ్ కౌల్ (త్రిభువన్ మిశ్రా), తిలోత్తమ షోమ్ (బింది జైన్), శుభ్రజ్యోతి బరత్ (తీకా రామ్ జైన్), నైనా సరీన్ (అశోకలత మిశ్రా), శ్వేతా బసు ప్రసాద్ (షోభ పాఠక్) ప్రధాన పాత్రల్లో నటించారు.