Chinmayi Sripada : తమిళ స్టార్ సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తన గొంతుతో పాటలు అందించి ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు హీరోయిన్లకు చాలామందికి ఈమె డబ్బింగ్ చెప్తుంది. ఒకవైపు తన ప్రొఫెషన్ ను ముందుకు సాగిస్తూనే మరోవైపు సమాజంలో జరిగే అన్యాయాలపై గొంతు లేపుతూ ఉంటుంది. అయితే ఈమె చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ఆమెకే రివర్స్ అవుతుంటాయి. అయినా కూడా న్యాయం జరిగే వరకు పోరాడుతానంటూ ప్రతి దానికి ముందుంటుంది. తాజాగా ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది. ఫిలింఫేర్ అవార్డులో అనంతరం ప్రెస్ మీట్ లో ఈమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
‘అల్టిమేట్ దివా సింగర్’ అవార్డు..
యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది.. మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులు కలిసి సందడి చేశారు.. సౌత్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు అవార్డులు వరించాయి. ఈ క్రమంలో ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదకు అల్టిమేట్ దివ సింగర్ అనే అవార్డు దక్కింది. ప్రతి ఏడాది ఈమెకు ఏదో ఒక అవార్డు వరిస్తూనే ఉంది.. ఈ అవార్డును అందుకున్న చిన్మయి విలేకర్లతో మాట్లాడింది.. విలేకరులతో దురుసుగా మాట్లాడడంతో పాటుగా, ఆమె మాట్లాడిన తీరుపై నెటిజన్లు విమర్శలకు ఇప్పిస్తున్నారు.
Also Read: భాగ్యం పై నర్మదకు అనుమానం.. శ్రీవల్లి దొరికినట్లేనా? చందు పై రామరాజు సీరియస్..
రిపోర్టలకు స్ట్రాంగ్ వార్నింగ్..
అవార్డు అందుకున్న తర్వాత మీడియాతో మాట్లాడింది సింగర్ చిన్మయి.. మీడియా ప్రతినిధులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు ఓపిగ్గా సమాధానం చెప్పింది. క్రమంలో ఓ విలేకర్ అడిగిన ప్రశ్న తనకి తీవ్రమైన కోపాన్ని కలిగించింది. దానిపై స్పందించిన ఈమె మాట్లాడుతూ.. నన్ను ఏడేళ్లు ఇండస్ట్రీకి బ్యాన్ చేశారు.. కనీసం డబ్బింగ్ కూడా చెప్పేదానికి అవకాశం లేకుండానే చేశారు అని తన ఆవేదనను వ్యక్తం చేసింది. అప్పట్లో నేను ఎవరిని ప్రశ్నించలేకపోయాను. మీరు నన్ను ప్రశ్నిస్తున్నారా? ఎందుకు మీకు ఇదంతా అని ఒక్కసారిగా కోపం తో అరిచేసింది. మీ పని ఏదో మీరు చూసుకోండి అన్నట్లుగా వార్నింగ్ ఇచ్చింది.. ప్రస్తుతం ఈమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మొన్న మధ్య బాలీవుడ్ డ్రామా మూవీ గురించి ఈమె మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి.. ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్న ఈమెకు ఇలాంటివి కొత్తవి కాదు.. మరి ఇప్పుడు మరో వివాదం లో ఇరుక్కున్నట్లే కనిపిస్తుంది. ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.