BigTV English

Nagarjuna:టబు, రమ్యకృష్ణ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్.. నాగ్‌ను ఇరకాటంలో పెట్టిన జగపతిబాబు

Nagarjuna:టబు, రమ్యకృష్ణ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్.. నాగ్‌ను ఇరకాటంలో పెట్టిన జగపతిబాబు

Nagarjuna:టాలీవుడ్ నవ మన్మధుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున (Nagarjuna ) 50 ఏళ్లు దాటినా.. ఇంకా నిత్య యవ్వనంగా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈయన ఫిట్నెస్ సీక్రెట్ తెలుసుకోవడానికి అటు సూపర్ స్టార్లు కూడా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అలాంటి ఈయన తాజాగా ఇద్దరు హీరోయిన్ల గురించి అడగగా.. తెలివిగా సమాధానం చెప్పి చిక్కుల నుండి బయటపడ్డారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


విలక్షణ నటుడు జగపతిబాబు (Jagapati Babu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’.. మొదటి ఎపిసోడ్ కి నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఇందుకు సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు ఆదివారము విడుదల చేశారు. ప్రోమో విడుదల అవ్వగానే నా స్నేహితుడు అంటూ నాగార్జునను ఆప్యాయంగా ఆహ్వానించిన జగపతిబాబు.. ఏం దాచుకోకుండా మాట్లాడుకునే షో ఇది అని చెప్పగానే ఓకే అంటూ నవ్వులు కురిపించారు నాగార్జున.

ఇకపోతే ఇంటర్వ్యూలో భాగంగా రమ్యకృష్ణ (Ramya Krishnan), టబు (Tabu) ఇద్దరిలో బెస్ట్ కో యాక్ట్రెస్ ఎవరు? అని జగపతిబాబు ప్రశ్నించగా..” కొన్ని చెప్పకూడదు.. నేను చెప్పను” అంటూ సరదాగా చెప్పి తెలివిగా తప్పించుకున్నారు నాగార్జున. ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో “రమ్యకృష్ణ , సౌందర్య (Soundarya) ఇద్దరిలో నీకు ఇష్టమైన నటి ఎవరు?” అని నాగార్జున అడగగా.. ఇది నా ఇంటర్వ్యూ కాదు అంటూ అటు జగపతిబాబు కూడా సమాధానాన్ని దాటవేశారు. అలా మొత్తానికి అయితే ఇద్దరూ కూడా ఎవరికి వారు కాంట్రవర్సీకి చోటు ఇవ్వకుండా ఆడియన్స్ కి నవ్వులు తెప్పిస్తూ.. ప్రోమో ని ఆసక్తికరంగా మార్చేశారు. ఇక పూర్తి ఎపిసోడ్ ఈనెల 15వ తేదీన ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ Zee5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది.


నాగార్జున కెరియర్..

నాగార్జున విషయానికి వస్తే.. ప్రస్తుత హీరోగా సినిమాలు చేయకపోయినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే చివరిగా ధనుష్ (Dhanush ), రష్మిక మందన్న(Rashmika Mandanna), శేఖర్ కమ్ముల (Sekhar Kammula) కాంబినేషన్లో వచ్చిన కుబేరా (Kubera ) సినిమాలో కీలక పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు రజినీకాంత్ (Rajinikanth) హీరోగా.. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వస్తున్న కూలీ (Coolie) సినిమాలో కూడా నాగార్జున నటిస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు సినిమాకి ఆయన పాత్ర హైలెట్ కానుంది అని.. ఇటీవల ట్రైలర్ ద్వారా రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఇక భారీ అంచనాల మధ్య ఆగస్టు 14వ తేదీన తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.. ఇక ఈ సినిమాలో నాగార్జునతో పాటు ఉపేంద్ర (Upendra ), అమీర్ ఖాన్(Aamir Khan), శృతిహాసన్(Shruti Haasan) వంటి భారీ తారాగణం భాగం అయింది . మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

జగపతిబాబు కెరియర్..

అటు జగపతిబాబు విషయానికి వస్తే.. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అంతేకాదు అప్పట్లోనే పలువురు స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా పోషించారు. రీ ఎంట్రీ లో విలన్ పాత్రలు చేస్తూ అదరగొడుతున్న ఈయన.. అప్పుడప్పుడు హీరోలకు, హీరోయిన్లకు తండ్రి క్యారెక్టర్లు కూడా చేస్తున్నారు.. అంతేకాదు ఇప్పుడు హోస్ట్ గా కూడా మారి తన టాలెంట్ నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు.

also read:NTR: నా తొలి అభిమాని అతడే.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

Related News

Chiranjeevi Vs Balakrishna: మరోసారి బయటపడ్డ మెగా నందమూరి విభేదాలు.. అసలు గొడవ అక్కడేనా?

OG Title: OG.. టైటిల్ ని ఆ నిర్మాత గిఫ్ట్ ఇచ్చారు.. అసలు నిజం చెప్పేసిన దానయ్య

OG Film: పవన్ అభిమానులకు బిగ్ షాక్… హెచ్డీ ప్రింట్ లీక్!

Pawan Kalyan: ఓజీ చూడాలంటే ఇది తప్పనిసరి… పవన్ ఫ్యాన్స్ కి ప్రసాద్ మల్టీప్లెక్స్ కండిషన్

Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య వ్యంగ్య కామెంట్స్‌పై చిరంజీవి స్పందన.. కీలక ప్రకటనతో..

Shah Rukh Khan: కొడుకు చేసిన పనికి షారుక్‌కి భారీ మూల్యం.. రూ. 2 కోట్లు పరువు నష్టం దావా!

OG Success Meet : థమన్ బాం*చ*త్ అన్నాడు… సక్సెస్‌మీట్‌లో నిర్మాత కామెంట్

Sujeeth: రాజమౌళికి పోటీగా సుజీత్… అంతా పవన్ వల్లే

Big Stories

×