Illu Illalu Pillalu ToIlluday Episode August 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లోకి వచ్చిన దొంగ శ్రీవల్లి దగ్గర తాళాలు తీసుకొని దొంగతనానికి వచ్చాడంటూ బయట పెట్టేస్తుంది.. నీ దగ్గర ఉన్న తాళాలు ఆ దొంగ చేతికి ఎలా వచ్చాయి.. ముందు ఆ దొంగని పట్టుకోవాల్సిందే అని నర్మదా అంటుంది. ఇప్పుడు వచ్చిన వాడు మళ్ళీ రాని నమ్మకం లేదు కదా ఖచ్చితంగా వస్తాడు మనం ఇక్కడే వెయిట్ చేద్దామని అంటుంది.. ఇప్పుడు అందరూ ఇంత మూడిగా ఉంటే ఏం బాగుంటుంది అని నర్మదా తిరుపతిని అడుగుతుంది. ఏం బాగోలేదు దొంగ వచ్చినట్లుగా లేదు ఎవరో చచ్చినట్టుగా ఉందని తిరుపతి అంటాడు. నర్మదా అత్తయ్య మామయ్యని ఎలాగైనా కలపాలి అని మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి అత్తయ్య అని అడుగుతుంది..తిరుపతి వాళ్ళు చెప్పడం కాదమ్మా వాళ్ళు మొదటి నుంచి ఎలా ఉన్నారు? నేను చెప్తానని వాళ్ళ లవ్ స్టోరీ గురించి చాలా గొప్పగా చెప్తాడు.. రామ రాజు, వేదవతి మధ్య దూరం తగ్గించేస్తుంది నర్మద.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే రామరాజు ఇంట్లోకి సేన భద్ర వాళ్ళ కుటుంబం వస్తారు.. ఏమైంది ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతారు.. మీ వియ్యంకుడు మా ఇంట్లో దొంగతనానికి వచ్చారు అంటూ సేన రామరాజు పై రెచ్చిపోయి మాట్లాడుతాడు. ఎందుకు ఆయనను ఇలా కట్టేశారు దొంగతనం కొచ్చారని మీకు ఎవరు చెప్పారు అని రామరాజు అరుస్తాడు.. అసలు ఆయనకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి? ఆయనే ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు అని అంటాడు.
ఆనందరావుని కాపాడటానికి భాగ్యం అదృష్ట దేవతలాగా ఎంట్రీ ఇస్తుంది. ఆయన గారండీ అంటూ వెతుక్కుంటూ వస్తుంది.. శ్రీవల్లి పుట్టినరోజు అని శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన వచ్చారు ఇప్పటివరకు ఇంటికి రాలేదు అని చెప్తుంది.. ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటమ్మా వల్లి ఇవాళ నీ పుట్టినరోజున అని రామరాజు అడుగుతాడు. దానికి శ్రీవల్లి అవును అని అంటుంది. ముందే చెబితే గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలు చేసేవాళ్ళము కదా అని రామరాజు అంటాడు. చెబుదామని అనుకున్నాను మావయ్య కానీ మర్చిపోయాను అని శ్రీవల్లి అంటుంది. ఇంతకీ మా ఆయన ఏడండి అని పార్టీ అడుగుతుంది.. భాగ్యం అని పక్కనున్న వ్యక్తి అని అంటూ నేనేంటి మా ఆయన గొంతు లాగా పిలుస్తున్నాడు అని భాగ్యం కావాలని అంటుంది.
మీ ఆయన్ని నేను అని ఆనందరావు భాగ్యమును పిలుస్తాడు.. మా ఇంటి దగ్గర కొట్టారు అని కాస్త ఓవరాక్షన్ చేస్తుంది. మా అమ్మాయికి నాయనా అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి నిద్రపోడు అందుకే రాత్రి వచ్చాడు అని భాగ్యం అంటుంది. అదే నిజమైన రామరాజు అది అసలు మ్యాటరు అలా పొరపాటున మీ ఇంటికి వచ్చాడు అని క్లారిటీ ఇస్తారు. ఈ మేటర్ ఇంతటితో వదిలేస్తే బాగుంటుందని రామరాజు అంటుంది.
మా ఆయన గారిని కట్టడానికి మీరెవరండి.. మా ఆయన ఏం తప్పు చేశాడు ఎవరింట్లో దొంగతనం చేశాడు అని భాగ్యం నిలదీసి అడుగుతుంది. ఇక చేసేదేమీ లేక సేన వాళ్ళు ఆనంద్ రావు నీ వదిలేసి వెళ్ళిపోతారు.. ఇంకా బయట ఎందుకు పదండి లోపలికిని రామరాజు తోపాటు ఆనందరావు భాగ్యం కూడా లోపలికి వెళ్ళాలనుకుంటారు. ఈ గండం నుంచి ఎలాగోలాగా గట్టేక్కామని భాగ్యం అనుకుంటుంది.. కానీ నర్మదకు మాత్రం ఎక్కడో ఏదో జరుగుతుంది అని అనుమానం అయితే మొదలవుతుంది..
భాగ్యం బ్రతికి పోయాను రా బాబు అని తనకు తానే మాట్లాడుకోవడం నర్మద వింటుంది.. ఏదో తేడాగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది. భాగ్యం దగ్గరికి వచ్చి ఏంటి పిన్ని గారు ఏదో టెన్షన్ పడుతున్నట్టు ఉన్నారు అని అడుగుతుంది. టెన్షన్ పడడం ఎందుకు? ఏం తప్పు చేయలేదు కదా అని నర్మదతో అంటుంది.. ఇక లోపలికి వెళ్లి తల్లి తండ్రి కూతురు ముగ్గురు కలిసి ఈ ప్లాను ఫెయిల్ అవ్వడం గురించి మాట్లాడుకుంటారు.. కాస్త ఏంటే మన బండారం బయటపడేది అని శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం జరిగినా ఇది మన మంచికే జరిగిందని చెప్పాలి ఈ 10 లక్షల మేటర్ ఏంటో కానీ నాకు కాపురం కూల్ ఎలా ఉంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
Also Read: పల్లవి చెంప పగలగొట్టిన అవని.. తమ్ముడి కోసం అవని షాకింగ్ నిర్ణయం..
ఇప్పటికైతే తప్పించుకున్నాం కానీ ఆయన కాసేపట్లో వచ్చి డబ్బులు ఎక్కడ అని అడుగుతాడు ఏం చేయాలి అని ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు. అమ్మతో మాత్రం వీళ్ళ ముగ్గురు ఏదో చేస్తున్నారని డౌటుతోనే ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో భాగ్యం బండారం బయటపడుతుందా? శ్రీవల్లి గురించి అసలు నిజం నర్మద తెలుసుకుంటుందా? ఏం జరుగుతుందో చూడాలి…