Eluru Crime: ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి వివాదం నేపథ్యంలో జన్మనిచ్చిన తల్లిని కత్తితో నరికి నరికి చంపేశాడు కసాయి కొడుకు. ఆ తర్వాత పగ తీరిన తర్వాత కత్తిని నేలపై పడేశాడు. ఈ ఘటనను చూసిన ఓ వ్యక్తి పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. అప్పటికే ఆ తల్లికి కన్నుమూసింది.
కొడుకు పుట్ట లేదని తల్లిదండ్రులు చేయని పూజలు ఉండవు. ఒకవేళ పుట్టిన కొడుకు సరైన మార్గంలో లేకుంటే ఆ తల్లి మనసు విలవిల లాడిపోతుంది. అలాంటి కన్న తల్లిని కేవలం ఆస్తి కోసం కత్తితో నరికి చంపేశాడు. పట్టపగలు నడిరోడ్డుపై ఈ దారుణం వెలుగుచూసింది.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని అశోక్‌నగర్ ప్రాంతంలో లక్ష్మీ నరసమ్మ ఉంటోంది. ఆమె వయస్సు 50 ఏళ్లు పైమాటే. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. గతంలో ఆమె భర్త చనిపోయాడు. ఆమెకి కొడుకు శివాజీ తాపీ మేస్త్రిగా పని చేస్తున్నాడు.
ఓ కూతురు ఉంది, ఇటీవలే వివాహం చేసింది. శివాజీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు, కూతుర్ని చూసుకుని ఆ తల్లి తెగ ముసిరిపోయేది. భర్త ఉన్నప్పటి నుంచి లక్ష్మీ నరసమ్మ సొంత ఇంటిలో నివాసం ఉంటోంది. లక్ష్మీ నర్సమ్మకు కొంత ఆస్తి ఉంది. ఈ విషయంలో తల్లి-కొడుకు మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ALSO READ: వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య, తల్లిదండ్రులు ఏమన్నారు?
ఇటీవల కొయ్యలగూడెం వచ్చిన తల్లితో గొడవ పడ్డాడు. వాటాల విషయంలో కొడుకు అంగీకరించలేదు. గతంలో రెండుసార్లు తల్లిపై దాడికి యత్నించాడు.ఇరుగుపొరుగువారు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గాడు. ఆనాటి నుంచి ఆస్తి విషయంలో పగతో రగిలిపోయేవాడు శివాజీ. అయితే ఆదివారం ఇంటి సమీపంలో తల్లిపై దాడి చేశాడు కొడుకు శివాజీ.
ఆ తర్వాత పట్ట పగలు నడిరోడ్డుపై కత్తితో నరికి నరికి చంపేశాడు. ఇంకా బతికి ఉందేమోనని పదే పదే చూశాడు. ఘటనకు కూతవేటు దూరంలో ఓ వ్యక్తి వెంటనే పరుగు పరుగున అక్కడికి చేరుకున్నాడు. ఆ వ్యక్తి నచ్చ జెప్పడంతో కత్తిని కింద పడేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు.
లక్ష్మీనరసమ్మ తలపై నాలుగు, మెడపై నాలుగు, శరీరంపై మరో రెండు కత్తి గాయాలు ఉన్నాయి. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.