SBI recruitment: కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్ విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంటెక్ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా ఇవ్వనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ముంబయి ఖాళీగా ఉన్న మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగా ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. ఫిబ్రవరి 24వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం .
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 42
ఇందులో రెండు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేనేజర్(డేటా సైంటిస్ట్), డిప్యూటీ మేనేజర్(డేటా సైటింస్ట్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టుల వారీగా..
మేనేజర్(డేటా సైంటిస్): 13 ఉద్యోగాలు
డిప్యూటీ మేనేజర్(డేటా సైంటిస్ట్): 29 ఉద్యోగాలు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంటెక్( కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్), ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉంటే జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వయస్సు: మేనేజర్ ఉద్యోగానికి 26 నుంచి 36 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి 24 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. మేనేజర్ ఉద్యోగానికి నెలకు రూ.85,920 నుంచి రూ.1,05,280 జీతం ఉంటుంది. డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి రూ.64,820 నుంచి రూ.93,960 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వర్క్ ఎక్స్ పీరియన్స్‌ను పరిగణలోకి తీసుకుంటారు.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 24
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట‌్‌ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://sbi.co.in/web/careers/current-openings
అర్హత ఉన్న అభ్యర్థులందరూ వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్ విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంటెక్ పాసైన అభ్యర్థులు అందరూ అర్హలు అవుతారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది. మేనేజర్ ఉద్యోగానికి నెలకు రూ.85,920 నుంచి రూ.1,05,280 జీతం ఉంటుంది. డిప్యూటీ మేనేజర్ ఉద్యోగానికి రూ.64,820 నుంచి రూ.93,960 వరకు జీతం ఉంటుంది. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. జాబ్ కొట్టండి. ఆల్ ది బెస్ట్.
Also Read: IOCL jobs: టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హతతో జాబ్స్.. ఈ జాబ్ గిట్ల వస్తే రూ.78,000 జీతం..
ముఖ్యమైనవి:
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 24
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 42
జీతం: ఉద్యోగాన్ని బట్టి రూ.64,820 నుంచి రూ.1,05,280 వరకు ఉంటుంది.