BigTV English

Guillain Barre Syndrome: బయట నుండి పన్నీర్, చీజ్ కొని తెస్తున్నారా ? గులియన్ బారే సిండ్రోమ్ నుండి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు

Guillain Barre Syndrome: బయట నుండి పన్నీర్, చీజ్ కొని తెస్తున్నారా ? గులియన్ బారే సిండ్రోమ్ నుండి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు

Guillain Barre Syndrome: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం గులియన్ బారే సిండ్రోమ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీంతో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ప్రజలు గుల్లెయిన్ బెర్రీ సిండ్రోమ్ బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలు చేస్తున్నారు డాక్టర్లు. అసలు గుల్లెయిన్ బెర్రీ సిండ్రోమ్ అంటే ఏమిటి ? గుల్లెయిన్ బెర్రీ సిండ్రోమ్ ఎలా వ్యాపిస్తుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


గుల్లెయిన్ బెర్రీ సిండ్రోమ్ అనేది ఒక వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో బాధితుడి రోగనిరోధక శక్తి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి దీనిని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు.  ఈ వ్యాధి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది.

బలహీనతే కాకుండా, ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి చేతులు ,కాళ్ళలో జలదరింపును అనుభవిస్తారు. ఇది మాత్రమే కాకుండా, శ్వాసకోశ సమస్యలు కూడా ప్రారంభంలో కనిపిస్తాయి. కాలక్రమేణా ఇది పక్షవాతానికి దారితీస్తుంది.


గులియన్ బెర్రీ సిండ్రోమ్ ఎలా వస్తుంది ?

గులియన్ బెర్రీ సిండ్రోమ్ ప్రధాన కారణాలు కనుగొనలేదు. అయితే దీనికి సంబంధించి అనేక పరిశోధనలు మాత్రం జరిగాయి.  ఈ వ్యాధి శ్వాసకోశ లేదా జీర్ణశయాంతర సంక్రమణ కారణంగా వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఈ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. కలుషిత ఆహారం, నీటిలో కూడా క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది గిలియన్ బెర్రీ సిండ్రోమ్ పెరుగులదను ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా ఇది అతిసారం, వికారంతో పాటు పొత్తి కడుపులో తిమ్మిరి వంటి లక్షణాలను కూడా కలుగజేస్తుంది.

అంతే కాకుండా ఈ బ్యాక్టీరియా నాడీ కణాలపై ప్రభావం చూపుతుంది. రోగ నిరోధక శక్తిని కూడా ప్రభావం చేస్తుంది. ఫలితంగా అలసటగా అనిపిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది.

గిలియన్ బెర్రీ సిండ్రోమ్ పెరుగులకు గల కారణాల్లో  కలుషిత ఆహారం ముఖ్యమైనదని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా బయట తినే వారిలో ఈ ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు. మార్కెట్ లో లభించే పన్నీర్, చీజ్ తో పాటు జంక్ ఫుడ్ గిలియన్ బెర్రీ సిండ్రోమ్ వ్యాప్తి చెందడానికి గల కారణాలు.

పన్నీర్ , జున్ను వంటి పాల పదార్థాలు పాయిశ్చరైజ్ చేయని పాలతో తయారు చేస్తారు. అంతే కాకుండా వీటిని స్వచ్ఛమైనవేనని మనం ఈజీగా గుర్తించలేము. ఎక్కువ రోజులు వీటిని నిల్వ చేయడానికి ఫ్రిజ్ లో ఉంచుతారు. ఇలాంటి సమయంలోనే వీటిలో బ్యాక్టీరియా పెరుగుతుంది. వీటిని తినడం వల్ల గులియన్-బార్రే సిండ్రోమ్ ప్రమాదం మరింత పెరుగుతుంది.

ఇదే కాకుండా వండిన అన్నాన్ని ఎక్కువ సేపు నిల్వ చేసినా కూడా అది ఫుడ్ పాయిజనింగ్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. దీనిలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. బయట రెస్టారెంట్లు, హోటల్లలో ఇలాంటి అన్నం, చీజ్, పన్నీర్ తో తయారు చేసిన ఆహార పదార్థాలను వడ్డిస్తారు. అందుకే బయట తినడం మానుకోవడం చాలా ఉత్తమం. గులియన్-బార్రే సిండ్రోమ్ బారిన పడకుండా ఉండాలంటే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటం బెటర్.

గిలియన్ బెర్రీ సిండ్రోమ్ (GBS) ఏదైనా చికిత్స ఉందా?
గ్విలియన్ బెర్రీ సిండ్రోమ్ (GBS)కి ప్రస్తుతం ఎటువంటి నివారణ లేదు. కానీ దాని చికిత్స కోసం ప్లాస్మా ఫోరేసిస్ , హై ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ చేయాలి. ప్లాస్మా ఫెరిసిస్ ఈ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మొదటి రెండు వారాలు చికిత్సకు చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేదంటే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది.

Also Read: గుమ్మడి ఆకులు మహిళల ఆరోగ్యానికి వరం, ఎందుకో తెలుసా ?

మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి:
గిలియన్ బెర్రీ సిండ్రోమ్ (GBS) నివారించడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
దీనితో పాటు, ప్రతిరోజు వ్యాయామం లేదా ధ్యానం చేయండి.
మీ బరువును నియంత్రించుకోండి. అనారోగ్యకరమైన జీవనశైలికి బై-బై చెప్పండి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×