OTT Movie : కొన్ని కామెడీ సినిమాలు మనల్ని నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ హిందీ సినిమా స్టోరీ ఒంటరితనంతో బాధపడే 70 ఏళ్ల వృద్ధుడి చుట్టూ తిరుగుతుంది. ఆవయసులో అతను బ్యాంకాక్ కు వెళ్తాడు. ఎందుకు వెళ్లాడనేదే ఈ స్టోరీ. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక విచిత్రమైన అడ్వెంచర్‌ను అందిస్తుంది. ఈ సినిమా ఎక్కడ చూడొచ్చు? దీని పేరేమిటి ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
ఈ కథ ఆత్మారామ్ దుబే అనే 70 ఏళ్ల రిటైర్డ్ విడోవర్ చుట్టూ తిరుగుతుంది. అతను ఉజ్జయిని లో ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన గౌరవనీయ వ్యక్తి. ఆత్మారామ్ తన భార్యను గాఢంగా ప్రేమించాడు. ఆమె 21 సంవత్సరాలుగా పక్షవాతంతో బెడ్‌రిడెన్‌గా ఉండి, ఒక సంవత్సరం క్రితం చనిపోయిఉంటుంది. అతను 22 సంవత్సరాలుగా సెలిబేట్‌గా జీవిస్తున్నాడు. “నా జీవితం ఇంతేనా?” అని ఆత్మారామ్ ఒంటరితనంతో బాధపడుతూ, ఒక రోజు తనకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉందని తెలుసుకుంటాడు. “అమ్మో, ఇప్పుడు నేను ఎప్పటికీ ఆ పని చేయలేనా?” అని అతను డిప్రెస్డ్ అవుతాడు.
ఒక రోజు ఆత్మహత్యకు కూడా ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో, సంతులన్ అనే ఒక స్థానిక బార్బర్ ఆత్మారామ్‌ను రక్షిస్తాడు. “అరె, బాబాజీ, జీవితానికి ఇంకో ఛాన్స్ ఇవ్వండి!” అని సంతులన్ సరదాగా చెప్పి, ఆత్మారామ్‌ను ఒక 85 ఏళ్ల పెహ్ల్వాన్ వద్దకు తీసుకెళ్తాడు. ఆ పెహ్ల్వాన్, “రోజూ వ్యాయామం చేయండి, 20 రా ఉల్లిపాయలు తినండి!” అని సలహా ఇస్తాడు. ఈ రెమెడీ ఆత్మారామ్ కు బాగా పనిచేస్తుంది. ఇక ఆత్మారామ్‌కు మళ్లీ కోరిక కలుగుతుంది. “ఇప్పుడు నేను ఒక్కసారైనా ఆపని చేయాలి!” అని ధైర్యంగా అనుకుంటాడు. సంతులన్ “సరే, బాబాజీ, నేను సెట్ చేస్తాను!” అని ఒక అమ్మాయిని అరేంజ్ చేస్తాడు. కానీ ఆత్మారామ్ భయపడి చికెన్ అవుట్ అవుతాడు.
Read Also : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
‘Thai Massage’ 2022 నవంబర్ 11న థియేటర్లలో విడుదలైంది. మంగేష్ హడవలే దీనికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం Netflix లో ఈ సినిమా అందుబాటులో ఉంది. 122 నిమిషాల నిడివితో IMDbలో 6.3/10 రేటింగ్ ను పొందింది. ఇందులో గజరాజ్ రావు (ఆత్మారామ్ దుబే), దివ్యేందు శర్మ (సంతులన్ కుమార్), అలీనా జసోబినా (రీటా), సన్నీ హిందుజా (ముకేష్ దుబే), రాజ్‌పాల్ యాదవ్ (జుగ్ను భయ్యా), విభా చిబ్బర్ (మిసెస్ పంచాల్), అనురితా ఝా (అను దుబే), ప్రధాన పాత్రల్లో నటించారు.