E-Paper
Advertisement

అంతరిక్షం నుంచి వచ్చిన వింత సంకేతం… మానవాళి ఉనికినే ప్రశ్నార్థకం చేసే సైన్స్ ఫిక్షన్ వండర్

అంతరిక్షం నుంచి వచ్చిన వింత సంకేతం… మానవాళి ఉనికినే ప్రశ్నార్థకం చేసే సైన్స్ ఫిక్షన్ వండర్
Advertisement

Sci-Fi Action Drama: ఏలియన్స్ ఉన్నారని తెలుసుకోవడం ఒక ఎత్తయితే… వాళ్లకు మనమే సిగ్నల్ పంపితే ? ఆ సిగ్నల్‌ కు అవతలి వైపు నుంచి స్పందన వస్తే ? పైగా ఆ స్పందన భూమిపై ఉన్న కోట్లాది మంది ప్రాణాలకే ముప్పుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఓ రహస్యమైన సైన్స్ ఫిక్షన్ ప్రయోగం ఊహించని విపత్తుగా మారే కథే ‘సిగ్నల్ వన్’ (Signal One). మరి ఈ సినిమాలో మానవాళికి డేంజరస్ గా మారే ఆ సిగ్నల్ ఏంటి ? అనేది తెలియాలంటే లెట్స్ గెట్ ఇంటూ ది స్టోరీ.

కథలోకి వెళ్తే…

అనికా కస్క్ (Isabelle Fuhrman) టాలెంటెడ్ కంప్యూటర్ సైంటిస్ట్. ఆమె తెలివితేటలను గుర్తించిన టెక్ బిలియనీర్ సామ్ హ్యూస్టన్ (Dennis Quaid), మానవాళి భవిష్యత్తును మార్చగల ఓ అత్యంత రహస్యమైన ప్రాజెక్ట్ కోసం అనికాను భారీ పారితోషికంతో నియమించుకుంటాడు. తనతో పాటు ఇంజనీర్ చార్లీ కమిన్స్కీ (Josh Hutcherson)ను తీసుకుని అనికా కరేబియన్ దీవుల్లోని ఓ మారుమూల, అత్యంత సురక్షితమైన ప్రైవేట్ రీసెర్చ్ సెంటర్‌ కు చేరుకుంటుంది. అక్కడ జీనియస్ సైంటిస్ట్ పెర్రీ గ్లాస్నర్ (David Thewlis) రూపొందించిన ‘లిటిల్‌మౌత్’ (LITTLEMOUTH) అనే హైటెక్ మిషన్ గురించి ఆమెకు తెలుస్తుంది.

Advertisement

అది సాధారణ శాస్త్రీయ ప్రయోగం కాదు. భూమికి దూరంగా ఉన్న పరగ్రహ జీవుల మేధస్సు నుంచి వచ్చే సంకేతాలను గుర్తించడం, వాటిని విశ్లేషించడం, అవసరమైతే వారితో కమ్యూనికేట్ చేయడం ఈ మిషన్ లక్ష్యం. అయితే కేవలం ఏలియన్స్ సిగ్నల్స్ కోసం ఎదురుచూడకుండా, వారికే నేరుగా సందేశం పంపాలని టీమ్ తీసుకున్న ఓ నిర్ణయం పరిస్థితులను పూర్తిగా మార్చేస్తుంది. ఆ సిగ్నల్ అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత ఊహించని ఖగోళ మార్పులు మొదలవుతాయి. భూమికి తెలియని ఏదో శక్తి చాలా దగ్గరగా వస్తున్నట్లు సంకేతాలు అందుతాయి.

ఇక అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. మన సిగ్నల్‌కు స్పందిస్తున్న ఆ గ్రహాంతర జీవులు స్నేహం కోసం వస్తున్నారా ? లేక మన గ్రహాన్ని స్వాధీనం చేసుకోవడానికా ? శాస్త్రవేత్తలు చేసిన ఒక్క ప్రయోగం మానవాళి మనుగడకే ముప్పుగా మారడంతో, అనికా, చార్లీ తమ ప్రయోగశాల నుంచి బయట పడటమే కాదు… భూమిని కాపాడేందుకు అసాధ్యమైన పోరాటంలోకి దిగాల్సి వస్తుంది. చివరికి ఆ ఏలియన్ శక్తి అసలు ఉద్దేశం ఏంటి ? అనికా టీమ్ చేసిన తప్పును సరిదిద్దగలిగారా ? భూమిని ఆ విపత్తు నుంచి కాపాడగలిగారా ? అనేదే సినిమా మిగతా కథ.

హాలీవుడ్ స్టార్స్‌తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్…

Advertisement

‘సిగ్నల్ వన్’లో ఇసాబెల్లె ఫుర్మాన్, డెన్నిస్ క్వాయిడ్, జోష్ హట్చర్సన్, డేవిడ్ థెవ్లిస్ కీలక పాత్రల్లో నటించారు. జోనాథన్ సోబోల్ దర్శకత్వం వహించారు. సైన్స్ ఫిక్షన్ నవల ‘The Dark Forest Theory’ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఈ సినిమా Huluలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగులో ఆడియో, సబ్‌టైటిల్స్ రెండూ అందుబాటులో లేవు. ఇంగ్లీష్ వెర్షన్‌ను ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తోనే చూడాలి. ఏలియన్స్, స్పేస్ మిస్టరీ, సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాల కోసం ఓటీటీలో వెతికే వాళ్ళు ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వొద్దు.

Read Also: అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

Tags

Related News

పాత జ్ఞాపకాల మధురమైన కాన్వాస్… సతీష్ వేగేశ్న మార్క్ ఫ్యామిలీ ఈవెంట్ విజువల్ ట్రీట్

కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ సామాన్యుడి పోరాటం… మనసును తాకే ఎమోషనల్ మాస్టర్‌పీస్

అర్ధరాత్రి నిద్రలోనే దాడి చేసే ఆత్మలు… నిద్రపోవడానికి కూడా భయపడే హర్రర్ థ్రిల్లర్

శవంతో బయటపడ్డ నివ్వెరపోయే నిజాలు… షాకింగ్ ట్విస్టులున్న సీట్-ఎడ్జ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్

నగరంలో బాంబ్ డిఫ్యూజన్ హడావుడి… అదిరిపోయే హై-వోల్టేజ్ హీస్ట్ థ్రిల్లర్

ప్రాణ స్నేహితుల మధ్య అగ్నిపర్వతంలా బద్దలయ్యే ఆవేశం… మనుషుల నైజానికి అద్దం పట్టే మైండ్ బెండింగ్ డ్రామా

చీకటి కోనలో చిత్రమైన రాక్షసి… క్షణం క్షణం వణికించే హర్రర్ మిస్టరీ

Big Stories

Advertisement
×