E-Paper
Advertisement

పోచమ్మ విగ్రహాన్ని పొరపాటున పారేసే క్రిష్టియన్… కట్ చేస్తే కాటేరమ్మ జాతర

పోచమ్మ విగ్రహాన్ని పొరపాటున పారేసే క్రిష్టియన్… కట్ చేస్తే కాటేరమ్మ జాతర
Advertisement

Mystery Thriller OTT : మైండ్ బెండయ్యే సస్పెన్స్ థ్రిల్లర్లు ఓటీటీలో ఎన్నో ఉన్నాయి. గ్రిప్పింగ్ నరేషన్ తో, ఊహించని ట్విస్టులతో సాగే ఇలాంటి సినిమాలను ఎంజాయ్ చేయడమంటే ఇష్టమా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? దాని వివరాలు ఏంటి ? అన్న విషయాన్ని తెలుసుకుందాం పదండి.

ఆహా ఓటీటీలో అందుబాటులో

మూఢనమ్మకాల నేపథ్యంలో సాగే ఒక గ్రిప్పింగ్ మిస్టికల్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ Pochamma. 2026లో విడుదలైన ఈ సిరీస్ అరకు కాఫీ ఎస్టేట్ లో సాగుతుంది. రమేష్ ఇంద్ర దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 5 ఎపిసోడ్లు ఉంటుంది. ఒక సంపన్న కుటుంబం దేవుడి ఆగ్రహానికి గురైందా లేదా ఒక క్రూరమైన పగకు బలయ్యిందా అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ తో రన్ అవుతుంది స్టోరీ. ఈ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ Aha లో అందుబాటులో ఉంది. తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్. దర్శకుడు రమేష్ ఇంద్ర ఇందులో బంగ్లా ఓనర్ గా కీలక పాత్రను పోషించడం విశేషం. ఎల్.వి. ముత్తు గణేష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, శ్రీశ కుడువల్లి సినిమాటోగ్రఫీ హైలెట్ గా ఉంటాయి. ‘కాంతార’, ‘మంగళవారం’ సినిమాల తరహాలో సాగే అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది.

కథలోకి వెళ్తే…

Advertisement

పెద్ద వ్యాపారవేత్త ఫెడ్రిక్ (రమేష్ ఇందిరా). అరకు ప్రాంతంలో ఒక పాత విలాసవంతమైన కాఫీ ఎస్టేట్ బంగ్లాను కొంటాడు. ఆ ఎస్టేట్ మాజీ ఓనర్ రఘుపతి (అచ్యుత్ కుమార్) ఆర్థిక ఇబ్బందుల దాన్ని అమ్మేస్తాడు. అయితే ఆయన అందులోనే మేనేజర్‌ గా చేస్తాడు. ఆ బంగ్లాకి కాస్త దూరంలో ఒక పురాతన పోచమ్మ తల్లి విగ్రహం ఉంటుంది. స్థానికులు ఆ విగ్రహాన్ని ముట్టుకోవద్దని ఎంత చెప్పినా వినడు. ఫెడ్రిక్ మాత్రం తన స్థలంలో నుంచి ఆ పవిత్ర విగ్రహాన్ని తొలగిస్తాడు. ఆ విగ్రహం తొలగించిన మరుసటి రోజు నుండే ఆ ఇంట్లో వింత సంఘటనలు స్టార్ట్ అవుతాయి. ఊహించని విధంగా ఫెడ్రిక్ చిన్న కూతురు జెస్సీ దారుణంగా హత్యకు గురవుతుంది.

Also Read : పందెం కోడి చుట్టూ పరుగులు పెట్టే మూవీ… కడుపుబ్బా నవ్వించే కామెడీ మావా

Advertisement

జెస్సీ మరణం వెనుక రఘుపతి కొడుకు సురేశ్ ఉన్నాడని ఫెడ్రిక్ పెద్ద కూతురు ఇవా (ప్రియా శతమర్షణ్) పోలీసులకు కంప్లయింట్ చేస్తుంది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు కేసును దర్యాప్తు చేసి, ఆ ఇంట్లోని వాళ్ళ నిజ స్వరూపం బయట పడుతుంది. ఇవా భర్త డేవిడ్ (అర్జున్ అంబటి) పై కూడా పోలీసులకు అనుమానం వస్తుంది. మరోవైపు ఎస్టేట్ లోని కార్మికులు, ఊరి ప్రజలు మాత్రం పోచమ్మ తల్లి విగ్రహాన్ని అవమానించినందుకే జెస్సీ చనిపోయిందని నమ్ముతారు. ఈ శాపానికి గల కారణం ఏంటి ? నిజంగానే అమ్మవారు ఆ పాపను చంపిందా ? అనేది క్లైమాక్స్.

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×