E-Paper
Advertisement

Manasa Varanasi : మిస్ ఇండియా మానస సినిమాలకు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఇదే..?

Manasa Varanasi : మిస్ ఇండియా మానస సినిమాలకు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఇదే..?
Advertisement

Manasa Varanasi : మానస వారణాసి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌ అయ్యింది.. ప్రస్తుతం టాలీవుడ్ లోనే పలు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది. ఈమె తెలుగులో ఇప్పటివరకు చేసింది కేవలం రెండు సినిమాలే. ఈమె రెండో సినిమాగా కపుల్ ఫ్రెండ్లీ తో ప్రేక్షకులను పలకరించింది.. ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ ని అందుకోవడంతోపాటుగా కలెక్షన్లు వర్షం కూడా కురిపిస్తుంది. ఈ సందర్భంగా ఈమె గతంలో యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అలాగే పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలను బయటపెట్టిన అమ్మడు సినిమాలకు దూరం అవడానికి కారణాలను కూడా వివరించింది.. ఇంతకీ సినిమాలకు ఎందుకు అంత గ్యాప్ తీసుకునిందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..

సినిమాలకు గ్యాప్ ఎందుకంటే..?

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి సినిమా ప్రమోషన్స్ టైం లో ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.. 2020లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ ను గెలుచుకున్నారు. అయితే మీరు ఒక సినిమా చేసి సైలెంట్ అయ్యారు ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు అసలు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు అని యాంకర్ అడుగుతారు. దానికి మానస మాట్లాడుతూ మిస్ ఇండియా టైటిల్ గెల్చుకున్న తర్వాత కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. ఏదో చేద్దామని అనుకున్నాను. కానీ అక్కడ మనం చేసే అంత లేదు కాబట్టి.. నటన వైపు ఆసక్తి ఉండడంతో ఇలా వచ్చాను అని ఆమె అన్నారు. మొదట ఈమె దేవకి నందన వాసుదేవ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ మూవీలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా అంటుకోవడంతో ఈమెకు స్టార్ ఇమేజ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తుందో చూడాలి.

Advertisement

Also Read :డైరెక్టర్ బాబీ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లా.. సినిమా తియొచ్చు..

మిస్ ఇండియా టైటిల్ గెలిస్తే ఎంత ఇస్తారంటే..? 

అంతేకాదు ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మిస్ ఇండియా టైటిల్ ని గెలిచిన తర్వాత వచ్చిన రెమ్యూనరేషన్ గురించి బయట పెట్టింది. మిస్‌ ఇండియా వరల్డ్, మిస్‌ తెలంగాణ 2020 విన్నర్‌గా నిలిచింది. అక్కడ్నుంచి సినిమాల్లోకి వచ్చింది. కోట్లల్లో వారి ప్రైజ్‌ మనీ, స్పాన్సర్లు, యాడ్స్ ఇలా భారీగా సంపాదిస్తారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో దీనిపై మానస స్పందించి క్లారిటీ ఇచ్చింది.. అక్కడ వచ్చిన ఒక్క రూపాయి కూడా అకౌంట్లోకి రాదని చెప్పింది. హోటల్స్, జిమ్‌, ప్రోగ్రామ్స్, మేకప్‌, కాస్ట్యూమ్స్, ట్రావెలింగ్‌, సర్వీసెస్‌ వంటి వాటికి ఖర్చు చేస్తారని, తమకు వచ్చిన డబ్బులను తమకే స్పెండ్‌ చేస్తారని ఆమె అన్నారు.. మొత్తానికి ప్రస్తుతం శనివాళ్ళతో బిజీ అయ్యేందుకు ఈమె బాగానే ప్రయత్నాలు చేస్తుంది. ఇకముందు ఎలాంటి స్టోరీ తో సినిమా రాబోతుందో చూడాలి..

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×