E-Paper
Advertisement

OTT Thriller:సస్పెన్స్‌తో మైండ్ బ్లాంక్.. ఈ OTT క్రైమ్ థ్రిల్లర్ తప్పక చూడాల్సిందే!

OTT Thriller:సస్పెన్స్‌తో మైండ్ బ్లాంక్.. ఈ OTT క్రైమ్ థ్రిల్లర్ తప్పక చూడాల్సిందే!
Advertisement

Por Thozhil:థ్రిల్లర్లందు క్రైమ్ థ్రిల్లర్లు వేరయా అన్నట్టుగా సీట్ ఎడ్జ్ లో కూర్చో బెట్టె కొన్ని క్రైమ్ థ్రిల్లర్లు ఇచ్చే కిక్ మరేవీ ఇవ్వవంటే ఆశ్చర్యం లేదు. ఇదిగో అలాంటి ఓ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ గురించే మనం మాట్లాడుకునేది.అదే జూన్ 9, 2023న రిలీజ్ అయిన  ‘పోర్ థొజిల్’ (Por Thozil).మాములుగా తమిళ సినిమా అంటే అరవ సాంబార్ ఘాటు గట్టిగా కొట్తోస్తుంది.కానీ అదే కాదు ఇది కూడా అంటూ పోర్ థొజిల్ అనే సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ ని డెలివర్ చేశాడు డైరెక్టర్  విగ్నేష్ రాజా.

క్రైమ్ థ్రిల్లర్లు చూసేవారికి ఈ సినిమా హాట్ ఫేవరేట్

Advertisement

ఈ కుర్ర డైరెక్టర్  తీసిన  ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతి సెకండ్ మనల్ని టెన్షన్‌లో ఉంచడం విశేషం. ముఖ్యంగా ఇందులో నటించిన శరత్ కుమార్, అశోక్ సెల్వన్, నిఖిలా విమల్ లు తమ నటనతో సినిమాని మరో మెట్టు ఎక్కించారు. ఇక జేక్స్ బెజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుందనే చెప్పాలి. అయితే ఇది ఒరిజినల్ గా తమిళంలో తీసినా తెలుగులో డబ్బింగ్ అదుతంగా చేయడం విశేషం. ఇక క్రైమ్ థ్రిల్లర్లు చూసేవారికి ఈ సినిమా హాట్ ఫేవరేట్ అవడం పక్కా.

also read:టైర్-1 స్టార్లు లేని బాక్సాఫీస్.. ఈ సినిమాలైనా సమ్మర్‌ను కూల్ చేస్తాయా?

Advertisement

కథ విషయానికి వస్తే .. 

ఇక ఎలివేషన్ ఆపి సినిమా కథేంటో చెప్పమంటారా.. చూడ్డానికే చిన్న కథే. అశోక్ సెల్వన్ (ప్రకాష్) ఒక యంగ్ పోలీస్ ఆఫీసర్. చదువులో టాపర్ కానీ, ప్రాక్టికల్ గా మాత్రం చాలా పిరికి. అతనికి లోకనాథన్ (శరత్ కుమార్) అనే సీనియర్ ఆఫీసర్ దగ్గర ట్రైనింగ్ చేయాల్సి వస్తుంది.  కాని లోకనాథన్ చాలా స్ట్రిక్ట్, సీరియస్ అండ్ రూడ్ పర్సన్. ఎవరితోనూ సరిగ్గా కలవడు.మరో వైపు సిటీలో  వరుసగా యువతుల హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు చేసే విధానం చూస్తుంటే అదొక సైకో కిల్లర్ పని అని క్లారిటీ వస్తుంది. ఇక ఈ కేసును ఛేదించే బాధ్యత లోకనాథన్, ప్రకాష్‌లకు అప్పగిస్తారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్లకు అసలైన షాకింగ్ విషయాలు రివీల్ అవుతాయ్.1970లలో జరిగిన కొన్ని హత్యలకు, ఇప్పుడు జరుగుతున్న హత్యలకు ఏదో లింక్ ఉందని కనిపెడతాడు ప్రకాష్.అసలు ఆ కిల్లర్ ఎవరు? ఎందుకు కేవలం యువతులనే టార్గెట్ చేస్తున్నాడు? చంపే ముందు వాళ్లను ఎందుకు హింసించట్లేదు? అనేది ఇందులో మిస్టరీ. ఈ క్రమంలోనే లోకనాథన్ ఎక్స్పీరియన్స్, ప్రకాష్ తెలివితేటలు వాడి ఆ కిల్లర్‌ని ఎలా పట్టుకున్నారు అనేదే సినిమా క్లైమాక్స్.

స్ట్రీమింగ్ ఎక్కడంటే ..

ఇక స్ట్రీమింగ్ విషయానికి వస్తే ఈ సినిమాని  సోనీ లివ్ (SonyLIV)లో అందుబాటులో ఉంది. మీరు గనుక ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ ని మిస్ అవ్వొద్దు అనుకుంటే మాత్రం వెంటనే చూసెయ్యండి. లేదంటే ఓ క్రైమ్ థ్రిల్లర్లలో ఒక మంచి మాస్టర్ పీస్‌ను మిస్ అయినట్టే!

also read:అసలే మొహమాటం.. పైగా అలాంటి సీన్లు, స్టార్ హీరోకు ముద్దు కష్టాలు.. నో చెప్పిన వినని డైరెక్టర్!

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×