E-Paper
Advertisement

బీఆర్ఎస్ నాయకులకు మంత్రి పొంగులేటి ఓపెన్ ఛాలెంజ్..?

బీఆర్ఎస్ నాయకులకు మంత్రి పొంగులేటి ఓపెన్ ఛాలెంజ్..?
Advertisement

Minister Ponguleti: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై, ప‌లువురు మంత్రుల‌పైనా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డైరెక్ష‌న్‌లో హ‌రీష్‌రావు, కేటీఆర్‌లు చేస్తున్న ప‌లు ఆరోప‌ణ‌ల్లో నిజం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన బుధవారం స‌చివాల‌యంలో మంత్రులు సీత‌క్క‌, పొన్నంప్ర‌భాక‌ర్ , ఎంపీలు అనిల్ కుమార్ యాద‌వ్‌, చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు న‌వీన్ యాద‌వ్‌, సామెల్ , బీ ల‌క్ష్మారెడ్డి, శ్రీ గ‌ణేష్‌, రాంమోహ‌న్ రెడ్డి లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

సర్వే నెంబర్ 613లో..

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి, ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న అబద్ధాల రావు, డ్రామా రావు, శకుని మామలు.. ఇప్పుడు ఆ బురదను ప్రజా ప్రభుత్వానికి అంటించాలని చూస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. ” రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలం, నాదురుగుల్ గ్రామంలో సర్వే నెంబర్ 613లో 373 ఎకరాల 13 గుంటలు భూమి ఉన్నది.ఇది ప్రైవేటు భూమిగా, కొన్ని సందర్భాల్లో 2004 నుంచి గవర్నమెంట్ భూమిగా, రకరకాలుగా అనేక కోర్టుల్లో దీన్ని కొట్లాడటం జరిగింది. ఒకసారి ప్రైవేటు పార్టీ గెలవడం, ఒకసారి ప్రభుత్వం గెలవడం, పైకోర్టులకు పోవడం, పోలీసు సపోర్ట్ కోర్ట్ డైరెక్షన్ తెచ్చుకోవడం గత ప్రభుత్వంలో కొన్నిజరిగాయి. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ఫా ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒమెగా డెవలప్మెంట్స్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మూడు సంస్థలకు 1-9-2014న నాదురుగుల్ గ్రామాన్ని613 సర్వే నెంబరులో రిజిస్ట్రేషన్ చేశారు.

Advertisement

Also Read: హైదరాబాద్‌లో దారుణం.. శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినిపై అత్యాచారం

అసత్య ప్రచారాలు..

ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసింది బీఆర్ఎస్ కాదా? ఈ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను 2016 సెప్టెంబర్ 24 మ్యుటేషన్ చేసింది కూడా మీ ప్రభుత్వంలో కాదా? మూడు కంపెనీలకు ఫైల్ నెంబర్ బి/1351/2/2021-1-1, 2021-2, 2021-3, 2011-3 వీళ్లకు మ్యుటేషన్ చేసింది బీఆర్ ఎస్సే ”అని మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలు ఇస్తానని మంత్రి తెలిపారు. కానీ ఈ భూములను పొంగులేటి కబ్జా చేశాడని చెప్పడం సరికాదన్నారు. రోజుకో మంత్రిపై అసత్య ప్రచారాలు చేస్తూ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతుందన్నారు. అసలు బీఆర్ ఎస్ పదేళ్లు అధికారంలోకి రాకముందు ఆ లీడర్ల ఆస్తులు ఎంత? ఇప్పుడెంత ఉన్నాయి? అనే వివరాలపై ఎంక్వైయిరీ చేయాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. ఆక్రమాస్తులను కాపాడుకోవడం కోసం తమ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తే ఊరుకోబోమని మంత్రి హెచ్చరించారు.

Advertisement

Also Read: హైదరాబాద్ టూ విశాఖపట్నం ప్రయాణికులకు గుడ్ న్యూస్..?

Related News

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×