E-Paper
Advertisement

OTT Movie : నాట్యగత్తెతో పోస్ట్ మ్యాన్ ప్రేమ కథ…పెళ్లయినా ఆమె మత్తులోనే… క్లైమాక్స్ కేక

OTT Movie : నాట్యగత్తెతో పోస్ట్ మ్యాన్ ప్రేమ కథ…పెళ్లయినా ఆమె మత్తులోనే… క్లైమాక్స్ కేక
Advertisement

OTT Movie : మరాఠీ సినిమా ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలిచింది ‘పోస్ట్‌కార్డ్’ మూవీ. 2013 లో వచ్చిన ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో పోస్ట్ మ్యాన్ తో కనెక్ట్ అయిన మూడు కథల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం 2014లో 61వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ మరాఠీ ఫీచర్ ఫిల్మ్‌గా గెలుచింది. 2013లో విడుదలైనా ఇప్పటికీ మరాఠీ సినిమా ప్రియులకు ఎమోషనల్ మాస్టర్‌పీస్‌గా ఉంది. ఇందులో రాధికా ఆప్టే కూడా ముఖ్య పాత్రలో నటించింది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

గజేంద్ర అహిరే దర్శకత్వం వహించిన ‘పోస్ట్‌కార్డ్’ (Postcard) మూవీ Amazon Prime Video, YouTubeలో స్ట్రీమింగ్ లో ఉంది. 2013లో విడుదలైన ఈ 107 నిమిషాల సినిమా U సర్టిఫికేట్ తో ఐయండిబిలో 8.3/10 రేటింగ్ పొందింది. ఇందులో ప్రధాన పాత్రలో గిరీష్ కులకర్ణి పోస్ట్‌మ్యాన్ గానటించారు. ఆయనతో పాటు, ప్రీతిశోధ్‌, సాయి తమ్హంకర్, మానవ్ కౌల్, రాధికా ఆప్టే నటించారు.

Advertisement

Read Also : ఒంటరి అమ్మాయి కనపడితే ఈ సైకో ఆగలేడు… స్టేట్ ని కుదిపేసిన కేసు… మస్ట్ వాచ్ సిరీస్

స్టోరీలోకి వెళ్తే

ఈ మరాఠీ సినిమా కాసిం అనే ఒక పోస్ట్‌మన్ తన జీవితంలోని మూడు కథలను చెప్పడం ద్వారా మొదలవుతుంది. ఈ మూడు కథలూ పోస్ట్‌మన్ కి కనెక్టెడ్ గా ఉంటాయి. అతను లెటర్స్ డెలివరీ చేస్తూ మనుషుల జీవితాల్లోని బాధలు, ఒంటరితనం, అతీంద్రియ అనుభవాలను చూస్తాడు. అతని భార్య జయకి ఆ లెటర్స్ చదవడం అలవాటుగా ఉంటుంది.

Advertisement

మొదటి కథ: మహారాష్ట్రలోని ఒక మిల్ వర్కర్ భికాజీ కాలే తన పిల్లల నుంచి లెటర్స్ కోసం ఎదురుచూస్తుంటాడు. వాటిని పోస్ట్‌మన్ చదివి వినిపిస్తాడు. భికాజీ జీవితమంతా కష్టపడి పని చేసి, రిటైర్ అవ్వాలనుకుంటాడు కానీ యజమాని అతన్ని మోసం చేసి ఒక వేయి రూపాయల రుణం ఉందని, వడ్డీతో సహా చెల్లించాలని చెబుతాడు. భికాజీ ఆ రుణం తీర్చడానికి మళ్లీ పని చేస్తాడు కానీ వడ్డీ మాత్రమే తగ్గుతుంది, అసలు అలాగే ఉంటుంది. అతని గురించి కాసిం భార్య తెలుసుకుని తన ఏడువందల రూపాయల సేవింగ్స్ పంపిస్తుంది. పోస్ట్‌మన్ డెలివరీ చేస్తాడు కానీ మూడువందలు తక్కువ ఉండటంతో భికాజీ మళ్లీ పనికి వెళ్తాడు.

రెండవ కథ: చాలా సంవత్సరాల తర్వాత పోస్ట్‌మన్ ఒక హిల్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతాడు. ఒక రోజు స్కూల్ గేట్ దగ్గర ఒక సైనికుడు పోస్ట్‌మన్‌ను గుర్తుపట్టి, తన కూతురికి లెటర్ ఇవ్వమని చెబుతాడు. ఆ స్కూల్ లో ఆ అమ్మాయికి కొన్ని ఏళ్ల క్రితమే గ్రాడ్యుయేట్ అయిందని తెలుస్తుంది. మరుసటి రోజు సైనికుడు ఆత్మ అని తెలుస్తుంది. ఒక ప్రమాదంలో అతను చనిపోయాడు. ఇప్పుడు కూతురిని చూడాలని వచ్చాడు. పోస్ట్‌మన్ ఆమెను వెతికి లెటర్ ఇస్తాడు. అయితే మొదట కూతురు తండ్రి తనను వదిలేశాడని భావించి బాధపడుతుంది, కానీ నిజం తెలిసి ఏడుస్తుంది.

మూడవ కథ: మరో గ్రామంలో డ్యాన్సింగ్ గర్ల్ గుల్జార్ (రాధికా ఆప్టే) తన లవర్ నుంచి లెటర్స్ కోసం ఎదురుచూస్తుంది. పోస్ట్‌మన్‌ లెటర్స్ ఇస్తూ ఆమె అందానికి మైమరిచిపోతాడు. తనని మీద ధ్యాస ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక రోజు ఆమె లవర్ చనిపోయినట్లు తెలుస్తుంది. పోస్ట్‌మన్ ఆమెకు తన లవర్ మరణం వల్ల వచ్చిన ఇన్సూరెన్స్ మనీ డెలివర్ చేస్తాడు. గుల్జార్ బాధలో మునిగిపోతుంది. ఈ మూడు కథలు కాసిం జీవితాన్ని మార్చేస్తాయి.

 

 

 

 

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×