E-Paper
Advertisement

Podarillu serial : ‘పొదరిల్లు’ సీరియల్ నటీనటులు.. ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారంటే..?

Podarillu serial : ‘పొదరిల్లు’ సీరియల్ నటీనటులు.. ఎవరు ఏ పాత్రలో నటిస్తున్నారంటే..?
Advertisement

Podarillu serial : బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ మంచి స్టోరీ వల్ల టాప్ రేటింగ్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ప్రస్తుతం తెలుగు టాప్ ఛానెల్ స్టార్ మా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం కొత్త సీరియల్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంటుంది. రీసెంట్ గా ఈ ఛానెల్ మరో కొత్త సీరియల్ ను ప్రసారం చేస్తుంది. ఆ సీరియల్ పేరు పొదరిల్లు.. ఆర్.కె. శంభూశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ పై ఈ సీరియల్ ప్రసారం అవుతుంది. ఈ సీరియల్ తమిళ సీరియల్ ‘అయ్యనారుతుణై’కి అధికారిక రీమేక్..డిఫరెంట్ స్టోరీతో ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది..మరి ఈ సీరియల్లో నటించిన నటీ నటులు ఎవరు? సీరియల్ స్టోరీ ఏంటో ఓ లుక్ వేద్దాం పదండీ…

పొదరిల్లు సీరియల్ లో ఎవరు ఏ పాత్రలో నటించారు..?

చక్రీ..

ఈ సీరియల్ మెయిన్ హీరో చక్రీ.. ఇతను ఒక తమిళ నటుడు.. తెలుగులో ఇదే మొదటి సీరియల్.. ఈయన అసలు పేరు దీపక్ కుమార్.. తమిళ్లో పలు సీరియల్స్లలో నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు.

మాధవ్..

Advertisement

ఈ సీరియల్ లో పెద్ద అన్నగా మాధవ్ నటిస్తున్నారు.. ఈయన అసలు పేరు అజయ్ సత్యనారాయణ.. నిజానికి ఈయన కన్నడ యాక్టర్. తెలుగులో గతంలో కళ్యాణం కమనీయం, నువ్వు నేను ప్రేమ వంటి సీరియల్స్లలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కేశవ..

ఈ సీరియల్ లో మాధవ్ తమ్ముడిగా కేశవా నటిస్తున్నాడు.. ఇతను మన తెలుగు యాక్టర్.. ఈయన అసలు పేరు గౌరవ వర్మ.. శివంగి, కాంతారా వంటి పలు సీరియల్స్లలో నటించాడు..

కన్నా…

Advertisement

పొదరిల్లు సీరియల్ లో మాధవ్ ఆఖరి తమ్ముడు పాత్రలో కన్నా నటిస్తున్నాడు.. ఇతని అసలు పేరు అభినవ్.. ఈయన తెలుగు యాక్టర్. తెలుగులో ఇప్పటికే పలు సీరియల్స్లలో నటించాడు. కలిసుందాం రా సీరియల్ అతనికి మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది.. ఇప్పుడు పొదరిల్లు సీరియల్ లో నటిస్తున్నాడు.

మహాలక్ష్మి..

ఈ సీరియల్లో హీరోయిన్ పాత్రలో మహాలక్ష్మి నటించింది. ఈమె కన్నడ యాక్టర్. గతంలో మగువా ఓ మగువా సీరియల్లో నటించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. ఇది ఇప్పుడు ఈమెకి తెలుగులో రెండో సీరియల్.. మహాలక్ష్మి అసలు పేరు కృతిక ఉమాశంకర్.. ఈ సీరియల్లో నటిస్తున్నందుకు ఈమె రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి..

వీరందరూ కూడా ఈ సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్ లలో నటిస్తున్నారు.. వీరితో పాటుగా సైడ్ క్యారెక్టర్లలో నటిస్తున్న వాళ్ళు కూడా తెలుగు యాక్టర్స్ కావడం విశేషం..

Also Read :శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

పొదరిల్లు స్టోరీ విషయానికొస్తే.. 

బృందావనం అనేది ఇంటిపేరు.. ఆ ఇంటిపెద్ద నారాయణ. అతనికి నలుగురు మగపిల్లలు.. తన భార్య చనిపోతుంది.. దాంతో అతను తాగుబోతు అవుతాడు. ఆ తర్వాత పిల్లలను పట్టించుకోడు. పెద్ద కొడుకు మాధవ ఆ ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేస్తాడు. ఆ తర్వాత ఆస్తి ఇవ్వలేదని నారాయణ చెల్లి తాయారు ఇంట్లోకి ఆడ దిక్కు రాదని, ఎవరికి పెళ్లిళ్లు కావని శాపం పెడుతుంది.. ఆమె అన్నట్లుగానే ఆ ఇంట్లో ఎవరికి పెళ్లి కాదు.. పెళ్లి కోసం అన్నదమ్ములు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు.. ఆడ దిక్కులేని ఆ ఇంటికి ఏ అమ్మాయి కోడలుగా వస్తుంది. ఆ తర్వాత పాడుబడ్డ ఇంటిని మారుస్తుందా..? అందరికి పెళ్లిళ్లు అవుతాయ అన్నది ఈ సీరియల్ స్టోరీ. మరి చివరకు అందరు సెటిల్ అవుతారా అన్నది స్టోరీలో చూడాల్సిందే..

Related News

Intinti Ramayanam Avani : రెండోసారి తల్లి కాబోతున్న అవని.. ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూస్..!

Karthika Deepam 2 Serial Today Episode May 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  కోత్త సీఈవోగా దీప – షాక్ లో జ్యోత్స్న

Podarillu Today Episode : శైలుకు దిమ్మతిరిగే షాక్.. నిజం చెప్పిన చక్రీ.. మహాకు నిద్రపట్టదు..

Brahmamudi Serial Today Episode May 16th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్ ను చంపేస్తానన్న రేఖ 

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కోసం రోహిణి మాస్టర్ ప్లాన్.. రోహిణి దిమ్మతిరిగే షాక్.. ఇది కదా ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అవనిపై పార్వతి ప్రశంసలు.. పల్లవి మాస్టర్ ప్లాన్.. 50 లక్షలు కొట్టేసిన దొంగ..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ పై ప్రేమ సీరియస్.. నర్మద కౌంటర్.. ప్రేమకు ధీరజ్ సర్ప్రైజ్..

Anchor Varshini : వర్షిణి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? హీరోయిన్ల కన్నా ఎక్కువే..

Big Stories

Advertisement
×