BigTV English
Advertisement

OTT Movie : అబ్బాయిలు మాత్రమే చేసే ఆ పని కోసం రంగంలోకి దిగే నన్… సింగిల్ గా చూశారో నైటంతా దబిడి దిబిడే

OTT Movie : అబ్బాయిలు మాత్రమే చేసే ఆ పని కోసం రంగంలోకి దిగే నన్… సింగిల్ గా చూశారో నైటంతా దబిడి దిబిడే

OTT Movie : దెయ్యాల సినిమాలు ఇచ్చే కిక్ మరో లెవెల్ లో ఉంటాయి. ఈ సినిమాలకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. అయితే వీటిని ఒంటరిగా చూసే ధైర్యం చాలామంది చేయరు. కొన్ని సినిమాలను అలా చుస్తే పై ప్రాణాలు పైకే పోతాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఇందులో ఒక నన్ మొదటి మహిళా ఎక్సార్సిస్ట్ కావాలని కలలు కంటుంది. కానీ ఆమె గతంతో ముడిపడిన ఒక డెమన్‌తో పోరాడాల్సి వస్తుంది. ఈ స్టోరీ ఈ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …


మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘ప్రే ఫర్ ది డెవిల్’ (Prey for the Devil) డేనియల్ స్టామ్ డైరెక్ట్ చేసిన అమెరికన్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్. జాక్వెలిన్ బైయర్స్, కోలిన్ సాల్మన్, క్రిస్టియన్ నవారో, వర్జీనియా మాడ్సెన్, బెన్ క్రాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. లయన్స్‌గేట్ నిర్మించిన ఈ సినిమా 2022 అక్టోబర్ 28న థియేటర్లలో రిలీజ్ అయింది. 93 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 5.3/10 రేటింగ్ ను పొందింది. Netflix, Amazon Prime Video, Apple TVలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.


Read Also : ఓకే ఒక్క ఐడియా… కంపెనీలకే కారం పెట్టి కోటీశ్వరుడయ్యే క్లీనర్… వీడు చాలా హాట్ గురూ

స్టోరీలోకి వెళితే

సిస్టర్ ఆన్ అనే వయసులో ఉన్న ఒక నన్, బోస్టన్‌లోని సెయింట్ మైఖేల్ ది ఆర్చాంజెల్ ఎక్సార్సిజం స్కూల్‌లో పనిచేస్తుంటుంది. ఆమె తన బాల్యంలో మానసిక రోగంతో ఉన్న తల్లితో చాలా ఇబ్బందులు పడుతుంది. దీనిని ఆన్ డెమన్ పొసెషన్‌గా భావిస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డెమన్ పొసెషన్స్ పెరగడంతో, కాథలిక్ చర్చ్ ఎక్సార్సిజం స్కూళ్లను తిరిగి తెరవాల్సి వస్తుంది. కానీ నన్స్‌కి ఎక్సార్సిజం నేర్చుకోవడం నిషేధం. ఫాదర్ క్విన్, ఆన్‌లోని టాలెంట్ ను గుర్తించి, ఆమెకు ఎక్సార్సిజం రహస్యంగా నేర్పుతాడు. ఆన్, ఫాదర్ డాంటేతో కలిసి, నటాలీ అనే చిన్న అమ్మాయి కోసం పోరాడుతుంది. నటాలీలో ఒక డెమన్‌ ఆవహిస్తుంది. అయితే తన తల్లిని బాధపెట్టిన డెమన్‌, ఇప్పుడు నటాలీలో పొసెస్డ్ అయిన డెమన్‌ ఒకటే అని ఆన్ భావిస్తుంది. నటాలీ శరీరం విచిత్రంగా వంగడం, గోడలు ఎక్కడం, భయంకరమైన గొంతుతో మాట్లాడడం వంటి సన్నివేశాలు అందరినీ భయపెడుతుంటాయి.

ఆన్ డెమన్‌తో స్ట్రెయిట్ ఫైట్ చేయడం కాకుండా, దానిని నటాలీలో నుంచి బయటకి పంపడానికి ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉంటే, ఫాదర్ డాంటే సోదరి ఒక మోసగాడివల్ల అబార్షన్ చేయించుకుని ఉంటుంది. ఇప్పుడు ఆమెలో కూడా డెమన్‌ పొసెస్డ్ అవడంతో ఆన్ సహాయం కోరతాడు. స్టోరీ నడిచే కొద్దీ ఆన్ కి చెందిన ఒక డార్క్ సీక్రెట్ బయటపడుతుంది. టీనేజ్ వయసులో ఆమెకి కూడా అబార్షన్ జరిగి ఉంటుంది. ఈ కారణంగానే డెమన్ ఆమెను టార్గెట్ చేయడానికి కారణమవుతుంది. క్లైమాక్స్‌లో, ఆన్ నటాలీని రక్షించడానికి తన జీవితాన్ని రిస్క్ చేస్తూ, డెమన్‌తో ఫైనల్ బ్యాటిల్‌ కి దిగుతుంది. ఆమె హోలీ వాటర్, స్క్రిప్చర్ రీడింగ్స్‌తో డెమన్‌ని ఎదిరిస్తుంది. కానీ ఒక ట్రాజిక్ ట్విస్ట్‌తో స్టోరీ ముగుస్తుంది. ఆ డెమన్‌ ఎవరు ? ఎందుకు అబార్షన్ అయిన మహిళలను టార్గెట్ చేస్తోంది ? డెమన్‌ ని ఆన్ కట్టడి చేస్తుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Movie : యాక్షన్ లేదు, రొమాన్స్ లేదు… IMDbలో 7.4 రేటింగ్‌… హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామా

OTT Movie : మంత్రముగ్ధులను చేసే కథ… మెంటలెక్కించే క్లైమాక్స్.. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లో మిస్ అవ్వకుండా చూడాల్సిన థ్రిల్లర్లు

OTT Movie : బీహార్ రాజకీయాలు ఎంత బ్రూటల్‌గా ఉంటాయో తెలుసుకోవాలా ? అయితే ఈ వెబ్ సిరీస్‌లపై లుక్కేయండి

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

Big Stories

×