Viswambhara Movie: ఈమధ్య ఒక సినిమా హిట్ అవ్వాలంటే స్టోరీ బాగా ఉంటే సరిపోదు. అందులోని పాటలు మ్యూజిక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి. సినిమా హిట్ అయిన అవ్వకపోయినా సరే పాటలు మాత్రం మంచి రెస్పాన్స్ ని అందుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువగా ఐటమ్ సాంగ్ల హవా నేను నడుస్తుంది. సినిమాలోని ఐటమ్ సాంగ్ కు మంచి క్రేజ్ ఏర్పడుతుంది. అందుకే మేకర్స్ కూడా ఐటెం సాంగ్ కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. అసలు విషయానికి వస్తే.. విశ్వంభర మూవీ లో ఐటమ్ సాంగ్ గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. బాలీవుడ్ బ్యూటి మౌనీరాయ్ చిరుతో స్టెప్పులు వేస్తుందని టాక్.. అయితే దీని కోసం ఆమె భారీగానే వసూల్ చేస్తుందని ఓ వార్త. మరి ఆమె రెమ్యూనరేషన్ ఎంతో ఒకసారి తెలుసుకుందాం..
మౌనీరాయ్ రెమ్యూనరేషన్ ఎంతంటే..?
విశ్వంభర లోని ఐటమ్ సాంగ్ కోసం తాజాగా ముహూర్తం ఫిక్స్ చేశారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో .. భీమ్స్ ఈ సాంగ్‌కి సంగీతం అందించాడు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటకు ఏఎస్ ప్రకాష్ భారీ సెట్ వేశాడు. ఈ సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోను మేకర్స్ పంచుకున్నారు. షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సాంగ్ లో చేసేందుకు మౌనీరాయ్‌కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనేది హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.5 నిముషాల పాటకు దాదాపు 50 లక్షలు తీసుకుందని సమాచారం.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..
Also Read :ఆదివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..
విశ్వంభర బడ్జెట్ ఎంతంటే..?
మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో గత రెండేళ్లుగా హిట్ సినిమా పడలేదు. ప్రస్తుతం విశ్వంభర మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కునాల్ కపూర్, ఆషిక రంగనాథ్, ఇషా చావ్లా, రావు రమేష్, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు విశ్వంభర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఈ మూవీకి ఏం ఏం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో రూపోందిస్తున్నారు. ఎప్పుడో ప్రారంభమైన విశ్వంభర షూటింగ్ అనివార్య కారణాలతో ఇంకా జరుగుతూనే ఉంది. ఈ మూవీపై బజ్ కూడా లేకపోవడంతో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.. ప్రస్తుతం మెగాస్టార్ అనిల్. రావిపూడితో ఓ సినిమా చేస్తున్నారు.