OTT Movie : జాంబీ సినిమాలు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ జానర్ లో వస్తున్న సినిమాలు, దాదాపు మంచి విజయాలనే సాధిస్తున్నాయి. తెలుగు భాషలో కూడా ఇలాంటి సినిమాలు మంచి టాక్ తో దూసుకెళ్లాయి. జంబిరెడ్డి లాంటి సినిమా ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో వైరస్ వల్ల ప్రపంచమే నాశనం అవుతుంది. ఒక డాక్టర్ తన కుక్కతో కలిసి, వైరస్‌కు క్యూర్ కనుగొనేందుకు పోరాడతాడు. విల్ స్మిత్ నటించిన ఈ సినిమా అపోకలిప్టిక్ థ్రిల్లర్‌గా, విజువల్స్ తో అదరగొట్టింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
‘ఐ ఆమ్ లెజెండ్’ (I Am Legend) ఫ్రాన్సిస్ లారెన్స్ డైరెక్ట్ చేసిన అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్. రిచర్డ్ మాథెసన్ 1954లో రచించిన నవల ఆధారంగా రూపొందింది. ఇందులో విల్ స్మిత్, ఆలిస్ బ్రాగా, చార్లీ టాహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2007 డిసెంబర్ 14న రిలీజ్ అయిన ఈ సినిమా 126 నిమిషాల రన్‌టైమ్ కలిగి ఉంది. IMDbలో 7.2/10, Rotten Tomatoesలో 68% రేటింగ్ ను పొందింది. Amazon Prime Video లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
2012లో ఒక వైరస్ మానవజాతిని దాదాపు నాశనం చేస్తుంది. ఈ వైరస్ 90% మందిని చంపి, మిగిలిన వాళ్లను డార్క్ సీకర్స్‌గా, జాంబీలాంటి మ్యూటెంట్స్‌గా మారుస్తుంది. డాక్టర్ రాబర్ట్ నెవిల్ (విల్ స్మిత్) ఒక వైరాలజిస్ట్. ఈ వైరస్‌కు ఇమ్యూన్‌గా ఉన్న ఏకైక వ్యక్తిగా, తన జర్మన్ షెపర్డ్ కుక్క సామ్‌తో న్యూయార్క్ సిటీలో బతుకుతుంటాడు. రాబర్ట్ రోజూ రేడియో సిగ్నల్స్ పంపిస్తూ, ఇతర సర్వైవర్స్‌ని వెతుకుతుంటాడు. అదే సమయంలో తన ఇంటి బేస్‌మెంట్ లాబ్‌లో, వైరస్‌ను క్యూర్ చేసే మందు కోసం ప్రయోగాలు చేస్తుంటాడు. అతను డార్క్ సీకర్స్‌ని ట్రాప్ చేసి, వాళ్లపై టెస్ట్ చేస్తాడు. కానీ ఫలితాలు అంతంత మాత్రమే ఉంటాయి.
రాబర్ట్ రోజూ తన స్టోర్‌లో మానిక్విన్స్‌తో మాట్లాడే కన్వర్సేషన్ సీన్స్, సామ్‌తో బాండింగ్ ఒక ఎమోషనల్ డెప్త్ ఇస్తాయి. ఈక్రమంలో రాబర్ట్ ఒక ప్రమాదంలో చిక్కుకుంటాడు. ఈ డార్క్ సీకర్స్ అతన్ని ట్రాప్ చేస్తాయి. అక్కడ సామ్ బాగా గాయపడుతుంది. ఒక హార్ట్‌బ్రేకింగ్ సీన్‌లో, సామ్ వైరస్‌కు ఇన్‌ఫెక్ట్ అవడంతో రాబర్ట్ దానిని చంపాల్సి వస్తుంది. ఇది అతన్ని డిప్రెషన్‌లోకి వెళ్ళేలా చేస్తుంది. అతను రాత్రిపూట డార్క్ సీకర్స్‌ని ఎటాక్ చేసి, సూసైడ మూడ్‌లోకి వెళ్తాడు. కానీ ఆనా, ఇథన్ అనే ఇద్దరు సర్వైవర్స్ అతన్ని కాపాడతారు.
ఇక క్లైమాక్స్‌లో డార్క్ సీకర్స్ రాబర్ట్ ఇంటిని ఎటాక్ చేస్తాయి. రాబర్ట్ తన లాబ్‌లో ఈ వైరస్ కి మందుని సక్సెస్‌ఫుల్‌గా డెవలప్ చేస్తాడు. కానీ డార్క్ సీకర్స్ అతని లాబ్‌ని బ్రేక్ చేస్తాయి. ఇప్పుడు పరిస్థితి మరింత క్రిటికల్ గా మారుతుంది. రాబర్ట్ ఈ డార్క్ సీకర్స్ నుంచి బయట పడతాడా ? అతనుకూడా ఈ వైరస్ కి బలవుతాడా ? అతడు కనిపెట్టిన మందు పని చేస్తుందా ? అనే విషయాలను ఈ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : ఎక్కడా చూడని దరిద్రం… వీడేం ముట్టుకున్నా మటాష్… చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్