OTT Movie : ఫీల్-గుడ్, లైట్-హార్టెడ్ వైబ్‌తో ఓటీటీలో ఒక సినిమా ఆకట్టుకుంటోంది. ఇది ఒక వ్యక్తి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. ఇది ఒక సామాన్య జీవితం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన ఇన్‌స్పైరింగ్ స్టోరీ. రిచర్డ్ మోంటానెజ్ అనే ఒక మెక్సికన్-అమెరికన్ జనిటర్, ‘ఫ్లామిన్ హాట్ చీటోస్’ ఐడియాతో ఫ్రిటో-లే కంపెనీని షేక్ చేస్తాడు. ఆ తరువాత అతని లైఫ్ కూడా మారిపోతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
ఈ అమెరికన్ బయోగ్రాఫికల్ మూవీ పేరు ‘Flamin’ Hot’. 2023లో వచ్చిన ఈ సినిమాకి ఈవా లాంగోరియా దర్శకత్వం వహించారు. జెస్సీ గార్సియా (రిచర్డ్), అన్నీ గొంజాలెజ్ (జూడీ), డెన్నిస్ హేస్‌బర్ట్ (క్లారెన్స్), టోనీ షల్హౌబ్ (రోజర్ ఎన్రికో) ప్రధాన పాత్రల్లో నటించారు. సెర్చ్‌లైట్ పిక్చర్స్ నిర్మాణంలో ఇది రూపొందింది. 99 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDbలో 6.8/10, Rotten Tomatoesలో 69% రేటింగ్ ను కలిగి ఉంది. 2023 జూన్ 9 నుంచి Jio hotstar లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.
Read Also : కూతురితో ఇదేం పాడు పని? పక్షవాతం కంటే డేంజర్ మదర్… కిర్రాక్ క్లైమాక్స్
‘ఫ్లామిన్ హాట్’ అనేది రిచర్డ్ మోంటానెజ్ అనే మెక్సికన్-అమెరికన్ వ్యక్తి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఒక ఫీల్-గుడ్ బయోపిక్. రిచర్డ్ మోంటానెజ్ కాలిఫోర్నియాలోని ఒక పేద మెక్సికన్ వలస కుటుంబంలో పుడతాడు. చిన్నప్పుడు చాలా కష్టాలను ఎదుర్కొంటాడు. పేదరికం, చదువు లేకపోవడం వల్ల జీవితంలో ఇబ్బందులు పడతాడు. అంతేకాకుండా వయసులో ఉన్నప్పుడు గ్యాంగ్‌లలో చేరి తప్పుడు దారిలో వెళ్తాడు. కానీ తన భార్య జూడీ ప్రేమ, సపోర్ట్‌తో జీవితాన్ని మార్చుకుంటాడు. ఇక1976లో రిచర్డ్ ఫ్రిటో-లే కంపెనీలో జనిటర్‌గా ఉద్యోగం సంపాదిస్తాడు. అక్కడ అతను కష్టపడి పని చేస్తూ, ఆ కంపెనీ తయ్యారు చేసే స్నాక్స్ గురించి నేర్చుకుంటాడు.
ఒకసారి ఈ కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు, రిచర్డ్ తన మెక్సికన్ సంస్కృతి నుంచి స్ఫూర్తిని తీసుకొని, లాటినో వాళ్లకు ఇష్టమైన స్పైసీ రుచి ఆధారంగా “ఫ్లామిన్ హాట్ చీటోస్” అనే ఐడియాను తీసుకొస్తాడు. ఈ చిప్స్ చాలా కారంగా, రుచిగా కూడా ఉంటాయి. ఈ ఐడియాను నేరుగా కంపెనీ సీఈఓ రోజర్ ఎన్రికోతో చెప్పే సాహసం చేస్తాడు. అతని ఐడియా విజయవంతమై, ఫ్లామిన్ హాట్ చీటోస్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవుతుంది, రిచర్డ్ కూడా కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా ఎదుగుతాడు. ఇలా ఇతని జీవితం సక్సెస్ బాటలో పడుతుంది.