E-Paper
Advertisement

OTT Movie: సైనికులను వేటాడే డైనోసర్లు … సీను సీనుకూ ఉత్కంఠే… సస్పెన్స్ తో మతి పోగొట్టే యాక్షన్ థ్రిల్లర్

OTT Movie: సైనికులను వేటాడే డైనోసర్లు … సీను సీనుకూ ఉత్కంఠే… సస్పెన్స్ తో మతి పోగొట్టే యాక్షన్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : వియత్నాం యుద్ధంలో డైనోసార్స్‌ వస్తే ఎలా ఉంటుంది ? ఈ కాన్సెప్ట్ తో ఫుల్ యాక్షన్ మోడ్ లో వచ్చిన సినిమా ‘ప్రిమిటివ్ వార్’ (Primitive War). ఈ అస్ట్రేలియన్ సైన్స్ ఫిక్షన్ మూవీ, ఈ రోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. జురాసిక్ పార్క్ ఫీల్ కావాలనుకుంటే, రాత్రి లైట్స్ ఆఫ్ చేసి, వాల్యూమ్ ఫుల్ పెట్టి చూస్తే ఈ యాక్షన్ కి, డైనోసార్స్‌ జోరుకి షాక్ అవుతారు. థియేటర్లలో చూడలేని వాళ్ళు ఎంచక్కా ఇంట్లోనే డైనోసార్స్‌తో పండగ చేసుకోండి. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2025 ఆగస్ట్ 21న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ అస్ట్రేలియన్ సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ లూక్ స్పార్క్ డైరెక్షన్ లో తెరకెక్కింది. మూడు నెలల తరువాత నవంబర్ 28 నుంచి లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇందులో ర్యాన్ క్వాంటెన్, ట్రిషియా హెల్ఫర్, నిక్ వెచ్స్లర్, జెరెమీ పైవెన్, జేకబ్ ఎలార్డి లీడ్ రోల్స్ లో నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1968 వియత్నాం యుద్ధం మధ్యలో ఒక దట్టమైన అడవి లోయలో ఒక అమెరికన్ ఆర్మీ స్పెషల్ ఫోర్స్ టీమ్ పూర్తిగా మిస్సింగ్ అయిందని రిపోర్ట్ వస్తుంది. ఎవరూ రేడియోలో మాట్లాడట్లేదు, ఎవరి బాడీలు కూడా దొరకలేదు. అప్పుడు వాళ్ళను వెతికేందుకు వల్చర్ స్క్వాడ్ అనే టీమ్‌ని పంపిస్తారు. ఈ టీమ్ హెలికాప్టర్‌లో దిగి జంగిల్ లోపలికి వెళ్తుంది. లోయ లోపలికి వెళ్లగానే వింతలు మొదలవుతాయి. వాళ్లు ఒక చెట్టు కింద ఒక అమెరికన్ సోల్జర్ బాడీ చూస్తారు. కానీ బాడీ మీద గన్ గుండ్లు కాదు… చాలా పెద్ద పంటి గాట్లు ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుందో టీమ్‌కి అర్థం కాదు. కానీ ఇది మనుషులు చేసిన పని కాదని తెలుస్తుంది. ఇంకా లోపలికి వెళ్తే మిగిలిన బాడీలు కూడా అలాగే ఉంటాయి. అందరూ టెన్షనలో పడిపోతారు.

Read Also : మ్యాజిక్ షూ తో మెంటలెక్కించే పనులు… ఒక్కసారిగా మారే జాతకం… నెక్స్ట్ లెవెల్ స్టోరీ

Advertisement

ఇంతలో జంగిల్ నుంచి భయంకరమైన సౌండ్ వినిపిస్తుంది. ఒక పెద్ద సైజులో ఒక డైనోసార్ బయటకు వస్తుంది. వెంటనే చిన్న చిన్న డైనోసార్స్ గుంపుగా దాడి చేస్తాయి. వచ్చిన టీంలో కూడా కొంత మంది చనిపోతారు. నిజానికి ఇక్కడ ఒక పాత సోవియట్ సీక్రెట్ ల్యాబ్ శిథిలాలు దొరుకుతాయి. రష్యన్ సైంటిస్టులు ఏదో ఎక్స్‌పెరిమెంట్ చేసి డైనోసార్స్‌ని మళ్లీ బతికించారు. కానీ ఆ ల్యాబ్ పేలిపోయి డైనోసార్స్ ఈ లోయలోనే ట్రాప్ అయిపోయాయి. ఇప్పుడు ఎవరైనా లోపలికి వెళ్తే వాటికి విందు భోజనం దొరికినట్టే. ఇక మిగిలిన టీమ్ మొత్తం షూట్ చేస్తూ, బాంబులు పెట్టి డైనోసార్స్‌తో ఫైట్ చేస్తుంది. చివరికి వీళ్ళంతా బయటికి బయట పడతారా ? డైనోసార్స్‌ కి బాలవుతారా ? అనే విషయాలను, ఈ అస్ట్రేలియన్ సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×