Anantapur Crime: ఫ్యామిలీ సమస్యలు ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. ఫలితంగా మూడేళ్ల వయస్సులో ముక్కు పచ్చలారని బాలుడికి నూరేళ్లు నిండాయి. తల్లి యమడిగా మారి కొడుకుని అత్యంత దారుణంగా చంపేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. సంచలనం రేపిన ఈ ఘటన అనంతపురం టౌన్‌లో వెలుగుచూసింది. అసలేం జరిగింది?
అనంతపురంలో దారుణం, యమడిగా మారిన తల్లి
అనంతపురం పట్టణంలో ఉంటున్నారు రవి-అమూల్య దంపతులు. అమూల్య సొంతూరు కర్నూలు టౌన్. జేఎన్టీయూ ఆడిటోరియానికి ఎదురుగావున్న ఎల్‌ఐసీˆ కాలనీ ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. ఈ దంపతులకు మూడేళ్ల కొడుకు ఉన్నాడు. రవి శ్రీసత్యసాయి జిల్లాలోని రామగిరి మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేస్తున్నాడు.
మరి దంపతుల మధ్య గొడవలు ఎన్నాళ్లుగా జరుగుతున్నాయో తెలీదు. గురువారం రాత్రి తన ఇంట్లోనే మూడేళ్ల కొడుకు గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. డ్యూటీ తర్వాత రాత్రి ఇంటికి వచ్చాడు భర్త రవి. ఇంటి తలుపు వేసి ఉండటంతో భార్యకు పలుమార్లు ఫోన్ చేశాడు, ఆమె లిఫ్ట్ చేయలేదు.
మూడేళ్ల కొడుకుని చంపి, ఆపై తల్లి ఆత్మహత్య
దీంతో అపార్టుమెంటు వాసులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, తలుపులు పగల గొట్టి ఇంట్లోకి వెళ్లారు. బెడ్ రూమ్‌లో నేలపై చిన్నారి మృతిదేహం కనిపించింది. బాలుడి మెడపై గాయాలున్నాయి, ఆ పక్కనే కత్తి ఉంది.
తొలుత కొడుకుని చంపి, తర్వాత అమూల్య ఆత్మహత్యకు పాల్పడి పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అమూల్య భర్త, స్థానికులను పలువుర్ని విచారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అఘాయిత్యానికి కారణాలు తెలియరాలేదు. అమూల్య ఆత్మహత్య విషయాన్ని ఆమె పేరెంట్స్‌కు సమాచారం ఇచ్చారు పోలీసులు.
ALSO READ: తీవ్ర విషాదం.. 14వ అంతస్తు నుంచి పడి బీటెక్ స్టూడెంట్ మృతి
వారిచ్చే ఫిర్యాదును బట్టి కేసు నమోదు చేస్తామని చెబుతున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరగుతున్నట్లు స్థానికులు చెబుతున్నమాట.ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా అమూల్య ఈ ఘోరానికి పాల్పడి ఉంటుందని అంటున్నారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
భర్త వేధింపుల కారణంగానే మా కూతురు ఘాతుకానికి పాల్పడింది అని ఆరోపిస్తున్న మృతురాలి తల్లిదండ్రులు. మా ఎదురుగా కూతుర్ని కొట్టాడని, అందువల్ల ఇలాంటి నిర్ణయం తీసుకొందని అన్నారు. వాడు అల్లుడు కాదు, వాడుక సైకో అని, నిరంతరం కూతుర్ని వేధించేవాడని గోడు వెళ్లబోసుకున్నారు. పెళ్లి సమయంలో 50 లక్షలు కట్నం ఇచ్చామని, మరింత కట్నం కావాలని వేధింపులకు దిగాడని వాపోయారు. ఇలాంటి వాడికి తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. కూతురు అమూల్య బిటెక్ టాపర్ అని, బాగా చదువుకున్న అమ్మాయిని ఇలాంటి వాడికి ఇచ్చి గొంతు కోశామని కన్నీరుమున్నీరు అవుతున్నారు.