E-Paper
Advertisement

Psychological Horror Movies OTT : హర్రర్ మూవీ లవర్స్ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన మూవీస్… ఒక్కసారి చూస్తే జన్మలో మర్చిపోలేరు

Psychological Horror Movies OTT : హర్రర్ మూవీ లవర్స్ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన మూవీస్… ఒక్కసారి చూస్తే జన్మలో మర్చిపోలేరు
Advertisement

Psychological Horror Movies OTT : హారర్ సినిమాలంటే మొదటగా దెయ్యాల సినిమాలే గుర్తుకు వస్తాయి. వింత ఆకారాలతో ఆడియన్స్ ని భయపెడుతుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఉన్న భయపెట్టే సీన్స్ చూస్తే, దెయ్యాలు కూడా ఏమాత్రం పనిచేయవు అనిపిస్తుంది. ఈ మూవీలు సైకలాజికల్ హారర్, మైండ్ గేమ్స్ తో రియల్ ఫియర్ ను కలిగిస్తాయి. రాత్రిపూట చూస్తే అంతే సంగతులు. ఇప్పుడు మనం ఓటీటీలో ఉన్న భయాంకరన సైకలాజికల్ హారర్ మూవీస్ పై ఓ లుక్ వేద్దాం పదండి.

1. Creep (2014)

ఒక వీడియో గ్రాఫర్ వెబ్‌సైట్‌లో ఒక యాడ్ చూసి పని కోసం జోసెఫ్ అనే వ్యక్తి వద్దకు వెళ్తాడు. జోసెఫ్ తనకు క్యాన్సర్ ఉందని, త్వరలో చనిపోబోతున్నానని, తన పుట్టబోయే కొడుకు కోసం ఒక వీడియో డైరీని రికార్డ్ చేయాలని కోరతాడు. అయితే జోసెఫ్ ప్రవర్తన క్రమంగా వింతగా, భయంకరంగా మారుతుంది. చివరికి వీడియో గ్రాఫర్ ప్రాణాలతో బయటపడ్డాడా లేదా అన్నదే ఈ సినిమా క్లైమాక్స్. ఇది ఫౌండ్ ఫుటేజ్ స్టైల్ ఉంటుంది. Netflixలో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత ఒంటరిగా ఉండటం భయంగా అనిపిస్తుంది.

2. Cube (1997)

Advertisement

కొంత మంది అపరిచితులు ఒక భారీ క్యూబ్ లాంటి రూమ్‌లో బందీ అవుతారు. ప్రతి రూమ్‌లో డెడ్లీ ట్రాప్స్, మెకానికల్ కిల్లింగ్ మెషిన్స్ ఉంటాయి. అసలు ఎవరూ ఎందుకు అక్కడికి వచ్చారో, ఎలా బయటకు వెళ్లాలో తెలియదు. మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ తో ఈ సినిమా నడుస్తుంది. ప్రస్తుతం Prime Videoలో ఇది స్ట్రీమ్ అవుతోంది. ఈ మూవీ చూస్తుంటే మెదడు కూడా ట్రాప్ అయినట్టు అనిపిస్తుంటుంది.

3. Eden Lake (2008)

ఒక కపుల్ లేక్ సైడ్‌లో రిలాక్స్ అవ్వడానికి వెళ్తారు. కానీ ఒక లోకల్ గ్యాంగ్ టీనేజర్స్ వాళ్లను టార్గెట్ చేస్తారు. రియలిస్టిక్ హారర్ సీన్స్ తో ఈ సినిమా భయంకరంగా ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత సమాజం అంటేనే భయం వేస్తుంది. Netflixలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

4. High Tension (2003)

Advertisement

మేరీ, అలెక్సియా అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు పరీక్షల కోసం చదువుకోవడానికి అలెక్సియా ఫామ్‌హౌస్‌కు వెళతారు. వాళ్ళు అక్కడికి వెళ్లిన మొదటి రాత్రి, ఒక ఒక సైకో కిల్లర్ ఆ ఇంట్లోకి చొరబడి అలెక్సియా కుటుంబాన్ని కిరాతకంగా చంపుతాడు. చివరిగా వచ్చే ట్విస్ట్ చాలా షాకింగ్ గా ఉంటుంది. ఇది prime videoలో అందుబాటులో ఉంది.

5. Incident in a Ghostland (2018)

పాస్కల్ లౌజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ చాలా భయంకరంగా ఉంటుంది. ఇందులో ఒక తల్లి తన ఇద్దరు కూతుళ్లతో ఒక కొత్త ఇంటికి వెళ్తుంది. అక్కడ ఇద్దరు సైకోలు వాళ్లను టార్చర్ చేస్తారు. ఆ సీన్స్ చూసిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండటానికి భయపడతారు. Netflixలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

Read Also : అయ్యబాబోయ్… సైబర్ క్రైమ్స్ ఇలా జరుగుతాయా ? ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×