E-Paper
Advertisement

Crime Thriller OTT: మొహం మీద మాస్క్ పెట్టి చంపే కిల్లర్… నిమిషానికో ట్విస్ట్… మైండ్ బెండింగ్ క్లైమాక్స్

Crime Thriller OTT: మొహం మీద మాస్క్ పెట్టి చంపే కిల్లర్… నిమిషానికో ట్విస్ట్… మైండ్ బెండింగ్ క్లైమాక్స్
Advertisement

Crime Thriller OTT : వరుణ్ సందేశ్ మొదట్లో కెరీర్ పీక్స్ వెళ్ళినా, చాలా రోజుల వరకు ఒక్క హిట్ కూడా పడలేదు. ఆ మధ్య బిగ్ బాస్ లో తళుక్కున మెరిసి అడపా దడపా పాత్రలు చేశాడు. రీసెంట్ గా వచ్చిన ‘నయనం’ వెబ్ సిరీస్ తో కొంచెం ప్రేక్షకుల కంట్లో పడ్డాడు. అతను డాక్టర్ గా నటించిన ఈ సిరీస్ చాలా మందిని ఆకట్టుకుంది. అయితే గత ఏడాది ఈ హీరో నటించిన ఒక కాప్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలైంది. ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఓటీటీలో ఇది ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఏ ఓటీటీలో ఉందంటే

వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ పేరు ‘కానిస్టేబుల్’ (Constable). ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. గత ఏడాది అక్టోబర్ 10న ఈ సినిమా థియేటర్లలో అడుగు పెట్టింది. వరుణ్ తప్ప ఇందులో చెప్పుకోదగ్గ నటులు లేకపోవడం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది. మధులిక వారణాసి ఇందులో కథానాయికగా నటించింది. ఇక ఈటీవీ విన్ (ETV Win) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు 2026 జనవరి 29 నుండి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హ్యాపీ డేస్ తో అరంగేట్రం చేసిన తర్వాత, కొత్త బంగారు లోకం వంటి సూపర్ హిట్ సినిమాలతో ఒక వెలుగు వెలిగిన ఈ హీరోకి, మరొక్క హిట్ పడితే సెట్టు.

కథ ఏమిటంటే

Advertisement

కాశీ (వరుణ్ సందేశ్) మోకిల అనే గ్రామంలో ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తుంటాడు. మహతి (మధులిక వారణాసి) కూడా కానిస్టేబుల్ గా అదే స్టేషన్ లో పనిచేస్తూ ఉంటుంది. కాశీపై మహతి ప్రేమలో పడుతుంది గానీ, ఆ విషయాన్ని పైకి చెప్పలేకపోతుంటుంది. ఈ ప్రేమ కథ ఇలా ఉంటే, ఎప్పుడూ తన పని తాను చేసుకుపోయే కాశీ జీవితం, ఆ గ్రామంలో జరిగే వరుస హత్యలతో ఒక్కసారిగా తలకిందులవుతుంది. ఒక రోజు కాశీ మేనకోడలు కీర్తి డెడ్ బాడీ పొలిమేరలో కనిపిస్తుంది. దీంతో కాశీ ఆ హంతకుడిని పట్టుకోవడానికి స్వయంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఇన్వెస్టిగేషన్ లో దిమ్మతిరిగే విషయాలను కాశీ తెలుసుకుంటాడు. చివరికి కాశీ కిల్లర్ ని కనిపెడతాడా ? ఆ గ్రామంలో వరుస హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ? కీర్తి చావుకు కారణం ఎవరు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : హీరో నిప్పు అంటించుకుని మరీ అనౌన్స్ చేస్తే… ఏడేళ్ళ క్రితమే ఆగిపోయిన సిరీస్… ఇన్నేళ్ల తరువాత అప్డేట్

Tags

Related News

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×