E-Paper
Advertisement

Skin Hazards: కిచెన్ లో వాడే ఈ పదార్థాలు చర్మానికి నేరుగా పూయడం ఎంత ప్రమాదమో తెలుసా?

Skin Hazards: కిచెన్ లో వాడే ఈ  పదార్థాలు చర్మానికి నేరుగా పూయడం ఎంత ప్రమాదమో తెలుసా?
Advertisement

ఇప్పటి రోజుల్లో చాలా మంది నేచురల్ స్కిన్ కేర్ అనే పేరుతో వంటగదిలో వాడే పదార్థాలను నేరుగా ముఖానికి పూస్తున్నారు. నిమ్మరసం, బేకింగ్ సోడా, కాఫీ, చక్కెర వంటి పదార్థాలు చర్మాన్ని ఎంతోమంచిదని సోషల్ మీడియాలో వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మేస్తున్నారు. కానీ నిపుణులు చెబుతున్న ప్రకారం ఇవి అన్ని సందర్భాల్లో సురక్షితం కావు. కొన్ని చర్మానికి తీవ్ర నష్టం కలిగించవచ్చు.

నిమ్మరసం
చర్మానికి ఒక సహజ రక్షణ పొర ఉంటుంది. దీనిని స్కిన్ బ్యారియర్ అంటారు. ఇది మన చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. కానీ సరైన జ్ఞానం లేకుండా కిచెన్ పదార్థాలను ఉపయోగిస్తే ఈ రక్షణ పొర దెబ్బతిని, చర్మ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. మొదటగా నిమ్మరసం గురించి చెప్పుకోవాలి. ఇది చాలా మంది ఎక్కువగా ఉపయోగించే పదార్థం. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని తెల్లగా చేస్తుందని భావించి నేరుగా రాసుకుంటారు. కానీ ఇలా వాడితే చర్మం కాలినట్లుగా మంట, ఎర్రబారడం, బొబ్బలు రావడం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా సూర్యకాంతిలోకి వెళ్లినప్పుడు ఈ సమస్యలు మరింత పెరుగుతాయి.

Advertisement

బేకింగ్ సోడా
ఇక బేకింగ్ సోడా కూడా చాలామంది స్క్రబ్‌గా వాడుతున్నారు. కానీ ఇది చాలా ఆల్కలైన్ గుణం కలిగిన పదార్థం. మన చర్మం సహజంగా స్వల్ప ఆమ్ల గుణం కలిగి ఉంటుంది. ఈ సమతుల్యం చెడిపోతే చర్మం పొడిగా మారుతుంది. దురద, ఇర్రిటేషన్, మొటిమలు వంటి సమస్యలు పెరుగుతాయి. కాబట్టి బేకింగ్ సోడా వాడటం చాలా జాగ్రత్తగా ఉండాలి. చక్కెర, కాఫీతో స్క్రబ్ చేయడం కూడా ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. కానీ ఇవి గట్టిగా ఉండటంతో చర్మంపై చిన్న గాయాలు చేస్తాయి. ఈ చిన్న గాయాలు బయటికి కనిపించకపోయినా, లోపల చర్మాన్ని దెబ్బతీస్తాయి. దీని వల్ల చర్మం త్వరగా వృద్ధాప్యానికి లోనవుతుంది.

Also read: Hair Growth tips: వేసవిలో జుట్టు రాలిపోకుండా సులువైన హెయిర్ గ్రోత్ చిట్కాలు

Advertisement

అలాగే టీ ట్రీ ఆయిల్, లావెండర్ ఆయిల్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా చాలామంది నేరుగా వాడుతున్నారు. కానీ ఇవి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి అలర్జీ కలిగించవచ్చు. చర్మం ఎర్రబారడం, దురద, ర్యాషెస్ వంటి సమస్యలు కనిపించవచ్చు. కాబట్టి ఈ ఆయిల్స్‌ను నేరుగా కాకుండా డైల్యూట్ చేసి వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా కొంతమంది గుడ్డు తెల్లసొన, ఓట్స్ వంటి పదార్థాలతో ఫేస్ మాస్క్‌లు తయారు చేస్తారు. ఇవి సహజమైనవే అయినా, సరైన శుభ్రత పాటించకపోతే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. దీని వల్ల చర్మ ఇన్ఫెక్షన్స్ రావచ్చు.

వేసవి కాలంలో చర్మం మరింత సున్నితంగా మారుతుంది. ఈ సమయంలో ఇలాంటి పదార్థాలు వాడితే సమస్యలు త్వరగా కనిపిస్తాయి. అందుకే ఏదైనా కొత్తది వాడే ముందు చిన్న ప్రాంతంలో పరీక్ష చేయడం మంచిది. చెన్‌లో ఉన్న పదార్థాలు సహజమైనవే అయినా అవి ఎప్పుడూ చర్మానికి సురక్షితం కావు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి చిట్కాను అలా పాటించడం సరైంది కాదు. చర్మానికి సరిపోయే, డెర్మటాలజిస్టులు సూచించిన ఉత్పత్తులు వాడటం మంచిది.

Related News

80ల నాటి మన ఇళ్లలో దాగున్న అపురూపమైన జ్ఞాపకాలు.. ఇవి మీ ఇంట్లో ఇంకా ఉన్నాయా?

గోలీలు, బొంగరాలతో ఆటలు.. నేటి ఆన్‌లైన్ గేమ్స్‌లో ఆ కిక్కేది?

80’s కిడ్స్.. ఫ్యాషన్ ఐకాన్స్, రెట్రో అంటే గుర్తొచ్చేది వీళ్ల స్టైలే!

అమ్మ చేతి కమ్మని వంట.. కిచెన్‌ నుంచి వచ్చే ఆ మసాలాల సువాసనలు, ఇప్పుడేవీ?

ఒక్క ఫోటో కోసం ఎన్నో రోజులు ఎదురుచూపులు.. 80s స్టూడియో అనుభూతే వేరు!

80ల్లో ఆటలు.. పెనవేసుకొనే బంధాలు.. ఇప్పుడవి ఏమైపోయాయ్?

80’s లవ్ లెటర్.. కాగితంపై మనసులో మాట.. అక్షరాల్లో అంతులేని ప్రేమ!

స్త్రీలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజం.. PCOS – PCOD మధ్య అసలు తేడా ఇదే!

Big Stories

Advertisement
×