E-Paper
Advertisement

పెద్ద ఉద్యోగాలొచ్చినా అహంకారం వద్దు: కొత్త ఆఫీసర్లకు గవర్నర్ దిశా నిర్దేశం!

పెద్ద ఉద్యోగాలొచ్చినా అహంకారం వద్దు: కొత్త ఆఫీసర్లకు గవర్నర్ దిశా నిర్దేశం!
Advertisement

Public Service: స్వేచ్ఛ బ్యూరో: అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలనీ ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దిశా నిర్దేశం చేశారు.సోమవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్-1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ లు సంస్థ వైస్‌ చైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శాంతి కుమారి ఆధ్వర్యంలో గవర్నర్ ను లోక్ భవన్ లో కలిశారు. ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ ల ను గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రతి నిర్ణయంలో ప్రజల సంక్షేమమే మీ ప్రధాన లక్ష్యం కావాలన్నారు.పరిపాలనలో నిజాయితీ మీ గొప్ప బలం. అది ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. ప్రతి పౌరుని సమస్యను సున్నితంగా అర్థం చేసుకుని పరిష్కారం చూపాలన్నారు.పదవి ఒక అధికారం మాత్రమే కాదు, అది ఒక బాధ్యత” అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ రాష్ట్రాభివృద్ధికి, సమాజ పురోగతికి కీలకంగా మారాలన్నారు. సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్, సంయుక్త కార్యదర్శి శశికిరణా చారి లు పాల్గొన్నారు.

Also read: సూర్యాపేట జిల్లాలో విషాదం.. ఆస్తి కోసం సొంత అక్కను చంపిన తమ్ముడు!

సరస్వతి అంత్య పుష్కరాలకు దేవాదాయ శాఖ ఆహ్వానం

Advertisement

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరవ్వాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను దేవాదాయ శాఖ ఆహ్వానించింది. మంత్రి కొండా సురేఖ, ఆలయ అర్చకులు గవర్నర్ ను లోక్ భవన్‌లో సోమవారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు తదితరులున్నారు.

గవర్నర్‌ను కలిసిన గిగ్ కార్మికుల సంఘం ప్రతినిధులు

తెలంగాణ గిగ్ ,ఫ్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్, పలువురు యూనియన్ ప్రతినిధులు లోక్ భవన్‌ లో సోమవారం గవర్నర్ ను కలిశారు. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వివరించగా, గిగ్ వర్కర్లకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని గవర్నర్ తెలిపారు.

Advertisement

Also Read: జగదీష్​ రెడ్డి పై ఎంపీ చామల సెటైర్లు.. ఏమన్నారంటే?

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×