E-Paper
Advertisement

Psychological Thriller OTT: మంచు కొండల్లో మతిపోగొట్టే కిడ్నాప్… క్లైమాక్స్ వరకు సీట్ ఎడ్జ్ సస్పెన్స్

Psychological Thriller OTT: మంచు కొండల్లో మతిపోగొట్టే కిడ్నాప్… క్లైమాక్స్ వరకు సీట్ ఎడ్జ్ సస్పెన్స్
Advertisement

Psychological Thriller OTT : థ్రిల్లర్ జానర్ లో వచ్చే సినిమాలను చూసేందుకు ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు. ఈ కంటెంట్ లో ఇక అదిరిపోయే సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గత ఏడాది థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. భర్త అస్థికలను కలపడానికి మంచు ప్రాంతానికి వెళ్లిన బార్బ్ అనే మహిళ చుట్టూ కథ ఉంటుంది. అక్కడ ఒక సైకో జంట నుంచి తప్పించికునే క్రమంలో కథ ఉత్కంఠభరితమైన మలుపులు తీసుకుంటుంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు ‘డెడ్ ఆఫ్ వింటర్’ (Dead of Winter). ఇందులో ప్రముఖ నటి ఎమ్మా థాంప్సన్ ప్రధాన పాత్రలో నటించగా, జూడీ గ్రీర్, మార్క్ మెంచాకా, లారెల్ మార్స్‌డెన్ మిగతా పాత్రల్లో నటించారు. బ్రియాన్ కిర్క్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2025 సెప్టెంబర్ 26న థియేటర్లలో విడుదలైంది. ఇది థియేటర్లలో విడుదలయ్యే ముందు, ఆగస్టు 8, 2025న 78వ కేన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. ఇందులో విమర్శకులు ముఖ్యంగా ఎమ్మా థాంప్సన్ నటనను బాగా మెచ్చుకున్నారు కూడా. ప్రస్తుతం ఈ సినిమా HBO max, Amazon Prime Video డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

బార్బ్ (ఎమ్మా థాంప్సన్) అనే మహిళ తన భర్త చనిపోయిన బాధలో ఉంటుంది. అతని అస్థికలను నిమజ్జనం చేయడానికి బాగా మంచుతో నిండిన ఉత్తర మిన్నెసోటా ప్రాంతానికి ఒంటరిగా కారులో బయలుదేరుతుంది. కానీ అక్కడ మరింత విపరీతమైన మంచు తుఫాను మొదలవుతుంది. ఆ సమయంలో ఒక ప్రదేశంలో ఉన్న క్యాబిన్ దగ్గర, ఒక యువతిని (లారెల్ మార్స్‌డెన్) ఇద్దరు వ్యక్తులు బంధించి హింసించడాన్ని బార్బ్ చూస్తుంది. ఆ కిడ్నాపర్లు ఎవరో కాదు, ఒక సైకో జంట.

ఇక ఆ అమ్మాయిని కాపాడటానికి బార్బ్ తన ప్రాణాలకు తెగించి ఆ కిడ్నాపర్లతో పోరాడాల్సి వస్తుంది. అక్కడి నుండి తప్పించుకుందామంటే ఫోన్ సిగ్నల్ ఉండదు, చుట్టూ భారీగా పేరుకుపోయిన మంచు వల్ల కారు కూడా కదలదు. దీంతో ఒక సాదాసీదా మహిళగా వెళ్ళిన బార్బ్, ఆ గడ్డకట్టే చలిలో తన తెలివితేటలతో ఆ కిడ్నాపర్లని ఎలా ఎదుర్కొంది ? చివరికి ఆ అమ్మాయిని ఎలా కాపాడింది ? అనేదే ఈ సినిమాలోని అసలు ట్విస్ట్.

Advertisement

Read Also : చీకటి పడితే రెచ్చిపోయే దెయ్యం… ఆ ఊర్లో అడుగు పెడితే చావు మూడినట్టే

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×