E-Paper
Advertisement

ఓటీటీలోకి నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్… ట్విస్టులతో మెంటలెక్కించే మలయాళ మూవీ తెలుగులోనూ

ఓటీటీలోకి నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్… ట్విస్టులతో మెంటలెక్కించే మలయాళ మూవీ తెలుగులోనూ
Advertisement

Political thriller OTT: మలయాళ సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఓటీటీలో వీటిని తెగ చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఓటీటీలోకి ఏదో ఒక మలయాళం మూవీ వస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇప్పుడు పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో మరో మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ‘సర్వం మాయ’లో పంతులు గెటప్ తో సూపర్ హిట్ కొట్టిన నివిన్ పౌలీ, ఇప్పుడు పొలిటికల్ గెటప్ తో ఒక పవర్ ఫుల్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇందులో నివిన్ తన నటనతో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. అయితే థియేటర్లలో ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది.

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

నివిన్ పౌలీ, బాలచంద్ర మీనన్ కలయికలో వచ్చిన ఈ సినిమా ‘ప్రతిఛాయ’ (Prathichaya). ఇప్పుడు జియోహాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించారు. ఇందులో షరాఫ్ ఉద్దీన్, హరిశ్రీ అశోకన్, ఆన్ అగస్టిన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇది 2026 మార్చి 26న థియేటర్లలో విడుదలైంది. థియేటర్ రన్ తర్వాత, ఈ సినిమా ఏప్రిల్ 24 నుండి JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రాజకీయ వ్యూహాలు, కార్పొరేట్ కుట్రల నేపథ్యంలో సాగే కథ కావడంతో, సినిమా మేకింగ్ చాలా రిచ్‌గా ఉంటుంది. జస్టిన్ వర్గీస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సీరియస్ సీన్స్‌కు బాగా ఉపయోగపడింది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి (బాలచంద్ర మీనన్) మీద, ఒక మహిళ అత్యాచార ఆరోపణలు చేసిన మరుసటి రోజు ఆయన చనిపోతారు. దీంతో ఆ కుర్చీ కోసం పార్టీలో పెద్ద గొడవ మొదలవుతుంది. ఆ సీఎం పెద్ద కొడుకు తన తండ్రి వారసత్వాన్ని వాడుకుని పవర్ లోకి రావాలని ఫిక్స్ అవుతాడు. కానీ అతను బయటకి కనిపించేంత సాఫ్ట్ కాదు. లోపల చాలా కుట్రలు, కుతంత్రాలు నడుస్తుంటాయి. ఎవడు ఎవరికి వెన్నుపోటు పొడుస్తాడో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి టైమ్‌లోనే హీరో (నివిన్ పాలీ) ఎంట్రీ ఇస్తాడు. సీఎంకు ఇతను రెండో కొడుకు. తన అన్న బిజినెస్ లాభాల కోసం కొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలతో చేతులు కలిపి, రాష్ట్రానికి సంబంధించిన కీలక రహస్యాలను అమ్మేస్తున్నాడని హీరోకి తెలుస్తుంది.

తండ్రి ఇమేజ్‌ని వాడుకుంటూ కొడుకు చేస్తున్న ఈ అక్రమ దందాల వల్ల రాష్ట్రం పెద్ద ముప్పులో పడుతుందని హీరో గ్రహిస్తాడు. అలాగే తన తండ్రి మరణానికి సంబంధించి ఏదో మర్మం ఉందని అనుమానిస్తాడు. ఈ సమయంలో కొన్ని కార్పొరేట్ కుట్రలు బయటికి వస్తాయి. చివరికి ఆ రాజకీయ నాయకులను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? ఆ సీఎం సీటు ఎవరికి దక్కింది? ఆ కార్పొరేట్ గూండాల ఆటను హీరో ఎలా కట్ చేశాడు? అనేదే ఈ సినిమా క్లైమాక్స్. పక్కా పొలిటికల్ మైండ్ గేమ్స్‌తో, ట్విస్టులతో సినిమా సాగుతుంది.

Advertisement

Read Also : అమ్మాయి మిస్సింగ్ కేసులో పిచ్చెక్కించే ట్విస్టులు… ఉత్కంఠ రేకెత్తించే సరికొత్త క్రైమ్ మిస్టరీ

Related News

ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

మానవులకు, సైబోర్గ్స్‌కి మధ్య బ్లడీ బ్లడ్ బాత్… భవిష్యత్ ప్రపంచంలో మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

గ్రహశకలం ఢీకొట్టడంతో తెలియని గ్రహంపై క్రాష్ ల్యాండ్… డ్రాగన్లు, రాక్షస డైనోసార్లతో ఊపిరి పీల్చుకోనివ్వని పోరాటం

అరేబియన్ నైట్స్ ఫాంటసీకి భయపెట్టే ట్విస్ట్… ఎపిక్ హర్రర్ సిరీస్ స్ట్రీమింగ్ తెలుగులోనే

ట్రిప్ పేరుతో ఇదేం ట్విస్ట్… కార్పొరేట్ ఆఫీస్ పాలిటిక్స్ కల్చర్‌ను ఎండగట్టిన సినిమా

పెళ్లి ఒకరితో ప్రేమ మరొకరితో… హృదయాన్ని హత్తుకునే కొరియన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

అవయవాల అక్రమ రవాణా కుట్రను ఛేదించే ఆత్మ… మెంటలెక్కించే మెడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సిరీస్

అమాయకపు బొమ్మ రక్తాన్ని తాగే రాక్షసిగా మారితే… తెలుగులోనే ఈ హడలెత్తించే డార్క్ డెమోనిక్ హర్రర్ ఫిల్మ్

Big Stories

Advertisement
×