E-Paper
Advertisement

సైకియాట్రిస్ట్ ని కిడ్నాప్ చేసే సైకో… ఆ గదిలో జరిగే ప్రతి సీన్ షాకింగ్

సైకియాట్రిస్ట్ ని కిడ్నాప్ చేసే సైకో… ఆ గదిలో జరిగే ప్రతి సీన్ షాకింగ్
Advertisement

Psychological Thriller Series OTT : సీరియల్ కిల్లర్ స్టోరీలంటే అంతా రక్తపాతం, యాక్షన్ ఉంటాయి. ఓటీటీలో ఇలాంటి కంటెంట్ ను తెగ చూస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ లో మాత్రం అవేమీ ఉండవు. అయినా కూడా ఈ సిరీస్ ను బాగా ఆదరించారు. ఒక గదిలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే మాటలతో, ఒకరిని ఒకరు మానసికంగా ఎలా ప్రభావితం చేసుకుంటారనేదే ఇందులో మెయిన్ హైలైట్. ‘ది ఆఫీస్’ లాంటి కామెడీ షోలతో పేరు తెచ్చుకున్న స్టీవ్ కారెల్, ఇందులో చాలా సీరియస్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక సైకో కిల్లర్, ఒక సైకాలజిస్ట్ మధ్య జరిగే ఈ కథ ఎక్కడా బోర్ కొట్టదు.

జియో హాట్ స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్

ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ది పేషెంట్’ (The Patient). 2022లో వచ్చిన ఈ సిరీస్ లో స్టీవ్ కారెల్, డోమ్నాల్ గ్లీసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నటుడు డోమ్నాల్ గ్లీసన్ ఒక సైకో కిల్లర్‌గా ఎంత భయంకరంగా నటించాడంటే, అతనికి ఈ పాత్రకు గాను గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ కూడా వచ్చింది. ఇది ఒక లిమిటెడ్ సిరీస్ కావడంతో కథ మొత్తం 10 ఎపిసోడ్లలోనే ముగిసిపోతుంది. కాబట్టి రెండో సీజన్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఇది Jio Hotstarలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

అలెన్ అనే ఒక సైకాలజిస్ట్ భార్య చనిపోయిన బాధలో ఉంటాడు. ఒకరోజు సామ్ అనే కుర్రాడు పేషెంట్‌లా ఆయన దగ్గరికి వస్తాడు. తీరా చూస్తే అతను మామూలోడు కాదు, ఒక సీరియల్ కిల్లర్. వాడు అలెన్‌ను కిడ్నాప్ చేసి తన ఇంటి బేస్‌మెంట్ గదిలో గొలుసులతో కట్టేస్తాడు. అయితే చంపడానికి కాదు, వాడికి ఊరికే మనుషులను చంపాలనిపించే పిచ్చి ఉందంట, ఆ అలవాటును ఈ డాక్టరే మాన్పించాలని అతని కోరిక.

ఆ గదిలో గొలుసులతో బంధీగా ఉంటూనే, అలెన్ ఆ కిల్లర్ కి కౌన్సెలింగ్ మొదలుపెడతాడు. వాడేమో ప్రతిరోజూ బయటికి వెళ్లి ఎవర్నో ఒకరిని చంపేద్దామని ప్లాన్ చేస్తుంటాడు. ఈయన ఏమో తన మాటలతో వాడిని ఆపడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడప్పుడు వాడు చైనీస్ ఫుడ్ లాంటి రకరకాల తిండి తీసుకొచ్చి ఈ డాక్టరుకు పెడుతుంటాడు. ఆ టైమ్‌లో అలెన్ తన పాత జీవితాన్ని, తన కొడుకుతో ఉన్న ఎమోషన్స్ ను తలుచుకుంటూ ఎలాగైనా ఈ నరకం నుండి తప్పించుకోవాలని ప్లాన్లు వేస్తుంటాడు.

Advertisement

సామ్ వాళ్ల అమ్మకు కూడా తన కొడుకు కిల్లర్ అని, డాక్టరుని బంధించాడని తెలుసు. కానీ ఆమె కూడా వాడికే సపోర్ట్ చేస్తుంది. అలెన్ ఎన్ని రకాలుగా అతని మనసు మార్చాలని చూసినా, సామ్ మళ్ళీ మళ్ళీ హత్యలు చేస్తూనే ఉంటాడు. చివరకు ఈ ప్రాసెస్ అంతా చాలా సీరియస్‌గా మారి, ఒక షాకింగ్ ముగింపుతో సిరీస్ ముగుస్తుంది. డాక్టర్ ఆ కిల్లర్ బారి నుండి బయటపడ్డాడా లేదా అన్నదే ఈ కథలో అసలైన ట్విస్ట్.

Read Also : 40 ఏళ్ళ బ్యాచిలర్… 35 సార్లు రిజెక్షన్… ఇకనైనా పెళ్ళవుతుందా? నలభైలో మొదలైన నయా లవ్ స్టోరీ

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×