E-Paper
Advertisement

అంతుచిక్కని మిస్సింగ్ కేసు… మైండ్ గేమ్‌తో మెంటలెక్కించే ట్విస్టులు

అంతుచిక్కని మిస్సింగ్ కేసు… మైండ్ గేమ్‌తో మెంటలెక్కించే ట్విస్టులు
Advertisement

Psychological thriller OTT : పోలీస్ ఇన్వెస్టిగేషన్ కంటెంట్ అంటేనే పిచ్చెక్కిపోద్ది. అలాంటి పిచ్చెక్కించే ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇది మామూలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లా కాకుండా, మనుషుల మైండ్ గేమ్స్ మీద నడుస్తుంది. నేరం ఎవరు చేశారు అనే దానికంటే, ఒక మనిషిని దోషిగా చూపించడానికి పోలీసులు ఎంత దూరం వెళ్తారు అనే పాయింట్స్ మీద సినిమా సీరియస్ గా సాగుతుంది. ఇక ఈ కథ కూడా మొదట స్లో గా మొదలై, తరువాత ఉత్కంఠను పెంచుకుంటూ వెళ్తుంది. అంతేకాకుండా ఆల్ప్స్ పర్వతాల పొగమంచు బ్యాక్‌డ్రాప్‌లో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంటుంది. క్లైమాక్స్ వరకు సస్పెన్స్‌ను మెయింటైన్ చేస్తూ, చివర్లో ఇచ్చే ట్విస్ట్ అసలు ఊహించని విధంగా ఉంటుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు.

ఎక్కడ చూడచ్చు అంటే

2017లో వచ్చిన ఈ ఇటాలియన్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు “ది గర్ల్ ఇన్ ది ఫాగ్” (The Girl in the Fog). ఈ సినిమాని డైరెక్ట్ చేసిన డొనాటో కారిసి నిజానికి ఒక ఫేమస్ క్రైమ్ నవలా రచయిత. తను రాసిన నవలనే సినిమాగా తీస్తూ ఆయనే మెగాఫోన్ పట్టారు. ఇందులో కీలక పాత్ర పోషించిన జీన్ రెనో ‘మిషన్ ఇంపాజిబుల్’ వంటి హాలీవుడ్ సినిమాల ద్వారా ఫేమస్ అయ్యారు. ఈ సినిమాను ఇటలీలోని ఆల్ప్స్ పర్వతాల్లో ఉన్న అందమైన లొకేషన్లలో షూట్ చేశారు, ఆ మంచు కురిసే వాతావరణం కథలోని సీరియస్ నెస్‌ని ఇంకా పెంచుతుంది. ఇక ఇటలీలో ఇచ్చే ప్రతిష్టాత్మకమైన డేవిడ్ డి డోనాటెల్లో అవార్డును ఉత్తమ దర్శకుడిగా కారిసి గెలుచుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది .

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ఒక చిన్న ఊళ్లో అన్నా లౌ అనే 16 ఏళ్ల అమ్మాయి చర్చికి వెళ్తూ కనిపించకుండా పోతుంది. ఈ కేసును డీల్ చేయడానికి సిటీ నుండి వోగెల్ అనే ఒక పెద్ద డిటెక్టివ్ వస్తాడు. అతను మామూలోడు కాదు, ఆధారాల కంటే పబ్లిసిటీనే నమ్ముకుంటాడు. మీడియాను అడ్డం పెట్టుకుని ఊరందరినీ పిచ్చోళ్లను చేసి, ఎవడో ఒకడిని బలిపశువును చేయాలని ప్లాన్ వేస్తాడు. ఆ ఊళ్లో కొత్తగా వచ్చిన మార్టిని అనే స్కూల్ టీచర్ మీద వోగెల్ కన్ను పడుతుంది. ఆ టీచర్‌కి అప్పులు ఉన్నాయని, వాడు అమ్మాయిల పిచ్చోడని కలరింగ్ ఇచ్చి మీడియా ముందు దోషిగా నిలబెడతాడు.

ఆ టీచర్ నేను ఏ తప్పూ చేయలేదని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోరు. వోగెల్ తన పబ్లిసిటీ కోసం కొన్ని ఫేక్ ఆధారాలు కూడా సృష్టించి అతన్ని జైలుకు పంపిస్తాడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే.. 30 ఏళ్ల క్రితం ఆ ఊళ్లో ఇలాగే అమ్మాయిలను ఎత్తుకెళ్లే ఒక సీరియల్ కిల్లర్ (ఫాగ్ మ్యాన్) ఉండేవాడని తెలుస్తుంది. చివర్లో వచ్చే ఆ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. చివరికి టీచర్ నిజంగానే అమాయకుడా ? వోగెల్‌ని మించిన తెలివైనోడా ? అమ్మాయిల మిస్సింగ్ వెనుక ఉన్నది ఎవరు ? అనేది క్లైమాక్స్‌లో తెలుస్తుంది.

Advertisement

Read Also : అక్క మొగుడు చెల్లితో సంసారం… హత్యతో ఉలిక్కిపడే ఫ్యామిలీ… ఓటీటీలో దూసుకెళ్తున్న థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

Big Stories

Advertisement
×