E-Paper
Advertisement

Akhtar On Naqvi: భూత‌ద్దాలు పెట్టుకోని చూడు..పెట్రోల్ విష‌యంలో ఇండియా కాలి గోటికి కూడా పాక్ స‌రిపోదు

Akhtar On Naqvi: భూత‌ద్దాలు పెట్టుకోని చూడు..పెట్రోల్ విష‌యంలో ఇండియా కాలి గోటికి కూడా పాక్ స‌రిపోదు
Advertisement

Akhtar On Naqvi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను పొగుడుతూ, ఇండియా పరువు తీసే ప్రయత్నం చేశాడు మొహ్సిన్ న‌ఖ్వీ. ఐపీఎల్ కోసం డబ్బులు పెడుతున్న మోడీ ప్రభుత్వం, భార‌తీయ వాహనదారులను మాత్రం నడిరోడ్డుపైన నిలబెడుతోందని మండిపడ్డారు. ఇండియాలో పెట్రోల్ సమస్య విపరీతంగా ఉందని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) చేసిన వ్యాఖ్యలకు తాజాగా షోయబ్ అక్త‌ర్ ( Shoaib Akhtar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పెట్రోల్ విషయంలో ఇండియా కాలిగోటికి కూడా పాకిస్తాన్ సరిపోదని.. ముందుగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటును ప్రేక్షకులతో నిర్వహించేలా చూడు అంటూ మండిపడ్డారు అక్త‌ర్.

Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక‌..రోహిత్ శ‌ర్మ‌ను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్ష‌ల ఫైన్‌

ఇండియాలో పెట్రోల్ కొర‌త ఎక్కువంటూ మొహ్సిన్ న‌ఖ్వీ కారు కూత‌లు

Advertisement

ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాకిస్తాన్ దేశంలో ఈ చమురు సమస్య విపరీతంగా ఉంది. ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మోడీ సర్కార్ చమురు దిగుమతులను కొనసాగిస్తోంది. అయితే తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటును అభిమానులు లేకుండా ఎందుకు నిర్వహిస్తున్నారని ఓ విలేఖరి ప్రశ్నిస్తే, ఇండియాను అవమానించే తరహాలో మాట్లాడారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB)  చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ ( Mohsin Naqvi ) . ఇండియాలో పెట్రోల్ కొరత విపరీతంగా ఉందని.. అక్కడి వాహనదారులను మోడీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. ఇండియా కంటే పాకిస్తాన్ మెరుగ్గా ప్రజలకు చమురు అందిస్తోందని స్పష్టం చేశారు. దీంతో మొహ్సిన్ న‌ఖ్వీని సోషల్ మీడియాలో దారుణంగా ఆడుకుంటున్నారు ఇండియన్స్.

మొహ్సిన్ న‌ఖ్వీ పెద్ద ద‌ద్ద‌మ్మ‌..వాడికేం తెలీదు

ఇండియా పెట్రోల్ కొరత ( Petrol) ఉంద‌ని మాట్లాడిన మొహ్సిన్ న‌ఖ్వీకి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akthar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇండియాపై బురద జల్లే ముందు..పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ? అని తెలుసుకోవాలని సీరియస్ అయ్యారు. ఇండియాలో పెట్రోల్ కు ఎలాంటి సమస్య లేదని షోయ‌బ్ అక్త‌ర్ వెల్లడించారు. ఒకవేళ ఇండియాలో ఇంధన సమస్య ఉంటే.. ఇంత బ్రహ్మాండంగా ఐపీఎల్ ( Indian Premier League 2026 Tournament) టోర్నమెంట్ ప్రేక్షకులతో ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. పాకిస్తాన్ లో ఇంధన సమస్య ఉన్న నేపథ్యంలోనే ప్రేక్షకులు లేకుండానే PSL 2026 టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఇలాంటి నేపథ్యంలో అనవసరంగా ఇండియా పై ఆరోపణలు చేస్తే ఏం వస్తుంది ? అంటూ నఖ్వీని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీసేది ఇలాంటి వాళ్లేనని మండిపడ్డారు.

Advertisement

Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావ‌డానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ ప‌రువు తీసిన పాక్ రిపోర్ట‌ర్‌

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×