E-Paper
Advertisement

సముద్రం మధ్యలో చావును వెతుక్కుంటూ వెళ్ళే ఫ్రెండ్స్… ఈ హార్రర్ మూవీ క్లైమాక్స్ కేక

సముద్రం మధ్యలో చావును వెతుక్కుంటూ వెళ్ళే ఫ్రెండ్స్… ఈ హార్రర్ మూవీ క్లైమాక్స్ కేక
Advertisement

Horror movie OTT : సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోలు కావాలి. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అడ్వెంచర్ కావాలి. అందుకే కొందరు స్నేహితులు సముద్రం మధ్యలో ఉన్న ఒక అందమైన దీవికి బయలుదేరుతారు. నీలిరంగు నీళ్లు, ప్రశాంతమైన బీచ్, అద్భుతమైన ప్రకృతి. మొదటి చూపులో అది స్వర్గంలా కనిపిస్తుంది. కానీ అక్కడి స్థానికులు మాత్రం ఒక హెచ్చరిక చేస్తారు. ఆ దీవిలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లొద్దని. ఆ హెచ్చరికను పట్టించుకోని క్షణం నుంచి వారి ట్రిప్ పీడకలగా మారిపోతుంది. ఇదే పులౌ (pulau) కథ.

రిలీజ్‌కి ముందే రచ్చ రచ్చ:

2023లో విడుదలైన ఈ మలేషియన్ హారర్ థ్రిల్లర్ కు యూస్రీ అబ్దుల్ హలీమ్ దర్శకత్వం వహించారు. అమీలియా హెండర్సన్, అలిఫ్ సతర్, సబ్రినా అలీ, మిస్ పాపా ప్రధాన పాత్రల్లో నటించారు. విడుదల సమయంలో తన బోల్డ్ కంటెంట్, హారర్ అంశాలు, వివాదాస్పద సన్నివేశాల కారణంగా ఈ చిత్రం విపరీతంగా చర్చకు వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

కథ ఒక ఫ్రెండ్స్ గ్రూప్ చుట్టూ తిరుగుతుంది. సాధారణ వెకేషన్ గా మొదలైన ప్రయాణం క్రమంగా భయంకరమైన అనుభవంగా మారుతుంది. సముద్రం మధ్యలో ఉన్న ఒక రహస్య దీవిలో వాళ్లు అడుగుపెట్టిన తర్వాత విచిత్ర సంఘటనలు మొదలవుతాయి. మొదట సరదాగా అనిపించిన విషయాలు తర్వాత భయానికి కారణమవుతాయి. రాత్రి వేళల్లో వినిపించే వింత శబ్దాలు, కనిపించని శక్తుల ఉనికి, దీవి చరిత్రకు సంబంధించిన భయంకరమైన కథలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. దీవిలో చాలా సంవత్సరాలుగా దాగి ఉన్న ఒక చీకటి రహస్యం ఉందని వారికి తెలుస్తుంది. అక్కడ జరిగిన పాత సంఘటనలు ఇంకా ముగియలేదని, కొన్ని శక్తులు ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని వదల్లేదని అర్థమవుతుంది. ఆ తర్వాత జరిగే సంఘటనలు కథను పూర్తిగా హారర్ మోడ్ లోకి తీసుకెళ్తాయి.

పులౌ బలం దాని లొకేషన్. చుట్టూ సముద్రం తప్ప ఇంకేం లేని దీవి వాతావరణం ప్రేక్షకుడికి కూడా ఒంటరితనం, భయం కలిగిస్తుంది. తప్పించుకోవడానికి దారి లేకపోవడం, సహాయం అందే అవకాశం లేకపోవడం కథలో ఉత్కంఠను పెంచుతాయి. హారర్ తో పాటు మిస్టరీ, సర్వైవల్ అంశాలు కూడా బాగా పనిచేశాయి. అయితే ఈ సినిమా అందరికీ కాదు. ఇందులో కొన్ని బోల్డ్ సీన్స్, అడల్ట్ థీమ్స్, కలవరపెట్టే హారర్ మూమెంట్స్ ఉన్నాయి. అందుకే ఫ్యామిలీతో కూర్చుని చూసే కంటెంట్ కంటే ఫ్రెండ్స్ తో లేదా ఒంటరిగా చూడడానికి ఇది బెటర్ సినిమాగా చెప్పవచ్చు.

Advertisement

Read Also : డెడ్లీ మార్షల్ ఆర్ట్స్… దుమ్మురేపే యాక్షన్ సీన్స్… ఈ మాస్టర్ పీస్ ను డోంట్ మిస్

Related News

స్కూల్లో చేయకూడని పని… కట్ చేస్తే రౌడీ సీఈఓతో… మనసును హత్తుకునే కొరియన్ ప్రేమ కథ

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×