E-Paper
Advertisement

బ్రేకప్ తరువాత అందరూ చేసే తప్పులు ఇవే.. మీరు కూడా చేస్తున్నారా?

బ్రేకప్ తరువాత అందరూ చేసే తప్పులు ఇవే.. మీరు కూడా చేస్తున్నారా?
Advertisement

ప్రేమ, సహజీవనం తరువాత బ్రేకప్ అనేది జీవితంలో చాలా మందికి మానసికంగా ఒక కఠినమైన అనుభవం. అలాంటి సమయంలో బాధ, ఒంటరితనం, ఆందోళన సహజంగానే కనిపిస్తాయి. మనసు ప్రశాంతంగా లేకపోవడంతో కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి నిర్ణయాలు బాధ తగ్గించకపోగా మరింత పెంచే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి తప్పులను గుర్తించి వాటికి దూరంగా ఉండటం అవసరం. సమయం, ఓర్పు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతు ఉంటే ఈ దశను సులభంగా దాటవచ్చు.

సోషల్ మీడియాలో మీ మాజీ భాగస్వామి గురించి చూడకండి

బ్రేకప్ తర్వాత చాలామంది తమ మాజీ భాగస్వామి సోషల్ మీడియా అకౌంట్స్ తరచూ పరిశీలిస్తుంటారు. వారు ఎక్కడికి వెళ్తున్నారు లేదా ఎవరితో ఉన్నారనే విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఈ అలవాటు పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసి మనసుకు మరింత బాధ కలిగిస్తుంది. అందుకే కొంతకాలం వారికి దూరంగా ఉండటం మంచిది. అవసరమైతే సోషల్ మీడియాలో ఆ వ్యక్తిని మ్యూట్ లేదా అన్‌ఫాలో చేయడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

పూర్తిగా ఒంటరిగా ఉండటం మంచిది కాదు

Advertisement

కొంత సమయం ఒంటరిగా గడపడం సహజమే అయినా, పూర్తిగా అందరికీ దూరంగా ఉండటం మంచిది కాదు. ఇలా చేస్తే ఒత్తిడి, దిగులు, ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన స్నేహితులతో మాట్లాడటం మనసుకు ఉపశమనం ఇస్తుంది. వారి సహాయం మానసికంగా బలంగా నిలబడేందుకు తోడ్పడుతుంది.

తొందరపడి మరో వ్యక్తిని ప్రేమించడం తప్పు

బ్రేకప్ బాధను మర్చిపోవడానికి కొందరు వెంటనే కొత్త రిలేషన్‌షిప్ ప్రారంభిస్తారు. అయితే పాత జ్ఞాపకాలు పూర్తిగా మరవకముందే మరో వ్యక్తిని ప్రేమించడం కొత్త సమస్యలు రావచ్చు. దీనివల్ల ఇద్దరికీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా మనసుకు కోలుకునేందుకు సమయం ఇవ్వడం చాలా అవసరం.

మద్యం లేదా చెడు అలవాట్లపై ఆధారపడవద్దు

Advertisement

సినిమాల్లో సాధారణంగా బ్రేకప్ తర్వాత మద్యం తాగడం చూపిస్తారు. కానీ నిజ జీవితంలో అది సమస్యకు పరిష్కారం కాదు. మద్యం తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం ఇస్తుంది. తర్వాత బాధ మళ్లీ ఎక్కువగా అనిపించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం లేదా కొత్త హాబీలు మంచి మార్గాలుగా ఉపయోగపడతాయి.

Also Read: పిల్లలకు 18 ఏళ్ల వయసు నిండేలోపు ఈ పాఠాలు తప్పనిసరిగా నేర్పాలి.. లేకుంటే జీవితాంతం కష్టాలే

ప్రతీకారం లేదా ఆత్మహత్య లాంటి ఆలోచనలు ఎప్పుడూ చేయకూడదు

కోపం లేదా నిరాశ వల్ల కొందరు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. మరికొందరు తప్పంతా తనదేనని అపరాధ భావనకు గురవుతారు. ఇవి సమస్యను పరిష్కరించవు. బదులుగా వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. కొత్త లక్ష్యాలను ఏర్పరచుకుని ముందుకు సాగడం సరైన నిర్ణయం.

బ్రేకప్ నుంచి కోలుకోవడానికి సమయం అవసరం. ఆరోగ్యకరమైన అలవాట్లు, మంచి స్నేహితుల మద్దతు, సానుకూల ఆలోచనలు ఈ ప్రయాణాన్ని సులభం చేస్తాయి. గతాన్ని వదిలి భవిష్యత్తుపై దృష్టి పెడితే జీవితం మళ్లీ సంతోషంగా మారుతుంది.

Related News

15 నుంచి 18 ఏళ్ల టీనేజ్ పిలల్లను తల్లిదండ్రులు ప్రతిరోజు ఈ 5 ప్రశ్నలు అడగాలి..

సిబిఎస్ఈ సప్లిమెంటరీ పరీక్ష 2026.. మంచి మార్కులు సాధించాలంటే ఈ 7 తప్పులు అసలు చేయకూడదు

లైంగిక నేర బాధితురాలికి అండగా హైకోర్టు న్యాయవాది.. 200కు పైగా వీడియోలు!

బిర్యానీ అసలు ఏ దేశంలో పుట్టింది? భారత్, అఫ్ఘనిస్తాన్ లేదా ఇరాన్.. చరిత్రలో భిన్నాభిప్రాయాలు

శరీరానికి బలం కోసం రోజూ మల్టీవిటమిన్లు తీసుకుంటున్నారా? ఈ సమస్యలు దాని వల్లే

వానాకాలంలో ఇల్లు చెమ్మ వాసన వస్తోందా? నిమిషాల్లో దుర్వాసనకు చెక్

ఆ గుడిలో పులిహోర కాదు.. ప్రసాదంగా బంగారమే ఇస్తారు!

మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారా? ఈ ఫుడ్స్ తింటే సూపర్ ఫాస్ట్ జ్ఞాపకశక్తి

Big Stories

Advertisement
×