E-Paper
Advertisement

ఉగాండా కంటే దారుణంగా మారిన‌ ఆస్ట్రేలియా, మొన్న పాక్‌, ఇప్పుడు బంగ్లా చేతిలో చిత్తు

ఉగాండా కంటే దారుణంగా మారిన‌ ఆస్ట్రేలియా, మొన్న పాక్‌, ఇప్పుడు బంగ్లా చేతిలో చిత్తు
Advertisement

Australian Cricket in Trouble:  ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ జట్లను గడగడలాడించింది ఆస్ట్రేలియా. కంగారులతో మ్యాచ్ అంటేనే… ప్రత్యర్థి ఆటగాళ్లు గజ గజ వణికి పోయేవారు. అయితే అలాంటి క్రికెట్ ఆస్ట్రేలియా (Australian) ఇప్పుడు డీప్ ట్రబుల్ లో పడింది. పసికూడా బంగ్లాదేశ్, జింబాబ్వే, పాకిస్తాన్ లాంటి జట్ల చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతోంది. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత, క్రికెట్ ఆస్ట్రేలియా పరిస్థితి (Australian Cricket in Trouble) అత్యంత దారుణంగా తయారయింది. సింపుల్గా చెప్పాలంటే, ఉగాండా కంటే దారుణంగా తయారైంది క్రికెట్ ఆస్ట్రేలియా పరిస్థితి.

Also Read: Garry kirsten on Ind Vs Pak : పాక్ ఆట‌గాళ్లే బాబ‌ర్ కు వెన్నుపోటు.. 2024 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియా గెలిచేలా కుట్ర‌లు చేశారు

55 ఏళ్ల వన్డే చరిత్రలో ఆస్ట్రేలియాకు అత్యంత ఘోర ఓటమి

Advertisement

ప్రస్తుతం ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ 3 వన్డేల సిరీస్ లో బంగ్లాదేశ్ వరసగా రెండింటిలో విజయం సాధించి.. టైటిల్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో క్రికెట్ ఆస్ట్రేలియా అత్యంత ఘోరమైన చెత్త రికార్డును మూటగట్టుకుంది. 55 సంవత్సరాల వన్డే చరిత్రలో సొంత గడ్డపై ఆస్ట్రేలియాపై సిరీస్ గెలవడం బంగ్లాదేశ్ కు ఇదే తొలిసారి. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పని అయిపోయిందని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక అంతకుముందు పాకిస్తాన్ చేతిలో టి20 తో పాటు వన్డే సిరీస్ కూడా కోల్పోయింది ఆస్ట్రేలియా. అయితే ఇలా వరుసగా ఓటములను ఆస్ట్రేలియా చవిచూస్తున్న నేపథ్యంలో… దీనికి కారణం మిచెల్ మార్ష్ అంటూ మళ్లీ పాత చర్చ మొదలైంది.

2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా పతనం మొదలైందా ?

2023 వన్డే వరల్డ్ కప్ ( 2023 odi world cup) ఆస్ట్రేలియా గెలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా పై ఆస్ట్రేలియా విక్టరీ సాధించింది. అయితే ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో వరల్డ్ కప్ పైన కాళ్ళు పెట్టి మిచెల్ మార్ష్ (Mitchell Marsh) తన బలుపు చూపించాడు. దీనిపై అప్పట్లో వివాదం రాజుకుంది. అయితే అలా టైటిల్ పైన కాళ్లు పెట్టిన తర్వాత ఆస్ట్రేలియా సంకనాకి పోయిందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఆ ఒక్క సంఘటన తర్వాత 2026 T20 వరల్డ్ కప్ సందర్భంగా గ్రూప్ స్టేజ్ లోనే ఆస్ట్రేలియా ఇంటి దారి పట్టింది. ఇప్పుడు పాకిస్తాన్ చేతిలో అటు బంగ్లా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. వరల్డ్ కప్ సమయంలో జింబాబ్వే చేతిలో అత్యంత దారుణ ఓటమి చవిచూసింది ఆస్ట్రేలియా. ఇంగ్లాండ్ చేతిలో వన్డే సిరీస్, టీమిండియా చేతిలో టి20 సిరీస్ ఓడిపోయింది. మొన్నటికి మొన్న శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కూడా చేజేతులా పోగొట్టుకుంది. దీంతో 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా పతనం మొదలైందని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Also Read: Wahab Riaz Abusing Players: PCBకి మ‌రో త‌ల‌నొప్పి..పాకిస్తాన్ మ‌హిళా క్రికెట‌ర్ల‌ను వేధించిన వహాబ్ రియాజ్

 

 

Related News

సంజు కంటే అభిషేక్ శ‌ర్మ పెద్ద‌ పోటుగాడా? అంద‌రికీ ఒకే రూల్స్ ఉండాలి

పసికూన‌ జింబాబ్వే పైన గెలవడం కాదు…మ‌గాళ్లు అయితే మాపై గెల‌వండి!

పాకిస్తాన్ ఘోర అవ‌మానం…ఏ ఒక్క కామెంటేటర్ ను పిల‌వ‌ని వెస్టిండీస్‌

వైభ‌వ్ సెంచ‌రీ మిస్…టీమిండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్

Video: వైభవ్ సూర్యవంశీ భారీ సిక్సర్..స్టేడియం బయట పడ్డ బంతి

జింబాబ్వేను బెదిరించి సిరీస్ గెలుచుకున్నారు..త‌న్వీర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక ధోని కుట్ర‌లు?

జింబాబ్వే బౌలర్లు స్లో బంతులు వేశారు…అందుకే టీమిండియా గెలుపు

Big Stories

Advertisement
×