E-Paper
Advertisement

దేవుడిని పరిచయం చేయడానికెళ్ళి డైరెక్ట్ గా దేవుడి దగ్గరకే… నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా

దేవుడిని పరిచయం చేయడానికెళ్ళి డైరెక్ట్ గా దేవుడి దగ్గరకే… నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా
Advertisement

Survival Thriller: సినిమా ప్రియులను ఎప్పుడూ థ్రిల్ చేసే సర్వైవల్, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన కథలకు ఆడియన్స్‌లో సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే నిజంగా జరిగిన సంఘటనలను తెరపై చూస్తున్నప్పుడు కలిగే ఉత్కంఠే వేరు. అలాంటి ఓ షాకింగ్ రియల్ స్టోరీతో తెరకెక్కిన సినిమానే ‘లాస్ట్ డేస్’ (Last Days). ప్రపంచానికి దూరంగా, బయటి వ్యక్తులతో సంబంధాలు లేకుండా జీవించే ఓ తెగను కలవాలని ప్రయత్నించిన 26 ఏళ్ల యువకుడి కథ ఇది. అండమాన్ సమీపంలోని నార్త్ సెంటినెల్ ఐలాండ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో, దేవుడి కోసం ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం అతడి జీవితాన్నే ఎలా మార్చేసిందో చూపించారు మేకర్స్. మరి ఇంతకీ ఈ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

కథలోకి వెళ్తే…

జాన్ అలెన్ చౌ అనే 26 ఏళ్ల అమెరికన్ మిషనరీ అంటే మత ప్రచారకుడిది ఇందులో కీలక పాత్ర. తన మత విశ్వాసాలను ఇతరులకు పరిచయం చేయాలనే బలమైన కోరిక ఉంటుంది. అందుకోసం బయటి ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోని సెంటినెలీస్ తెగను కలవాలని నిర్ణయించుకుంటాడు. అయితే అతడు వెళ్లాలనుకున్న నార్త్ సెంటినెల్ ఐలాండ్ ప్రజలు బయటి వ్యక్తులతో సంబంధాలను కోరుకోరు. వారి జీవన విధానంలో బయటి ప్రపంచం జోక్యం చేసుకోకూడదు. అంతేకాదు ఆ ప్రాంతంలోకి వెళ్లడంపై కూడా కఠినమైన ఆంక్షలు ఉన్నాయి.

Advertisement

ఈ ప్రమాదాల గురించి తెలిసినా జాన్ తన ప్రయత్నాన్ని విరమించుకోవడానికి సిద్ధపడడు. తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ద్వీపం వైపు ప్రయాణం మొదలుపెడతాడు. కానీ అతడి ఈ నిర్ణయం అతడికే కాకుండా, అక్కడ నివసిస్తున్న తెగ ప్రజలకు కూడా ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చని అధికారులు ఆందోళన చెందుతారు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడే కథలోకి మీరా గనాలి అనే పోలీసు అధికారి ఎంట్రీ ఇస్తుంది.
జాన్‌ను ఆపడమే కాదు… అతడికి, ద్వీపంలోని ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా చూడాలనేది ఆమె ఆలోచన. ఒకవైపు తన నమ్మకాన్ని నెరవేర్చుకోవాలనే పట్టుదలతో జాన్ ముందుకు సాగుతుంటే, మరోవైపు అతడి ప్రయాణాన్ని అడ్డుకోవాలని మీరా ప్రయత్నిస్తుంది. ఈ రెండు కోణాల్లో కథ సాగుతున్న కొద్దీ, జాన్ తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే ఉత్కంఠ పెరుగుతుంది. మరి ఈ కథ చివరికి ఎలాంటి మలుపు తీసుకుంది ? అనేది తెరపై చూడాల్సిందే.

ఓటీటీలో తెలుగులో ఉందా ?

‘లాస్ట్ డేస్’ (Last Days) సినిమా జియో హాట్‌స్టార్ (JioHotstar)లో అక్టోబర్ 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. అయితే తెలుగు డబ్బింగ్ ఆడియో మాత్రం లేదు. నిజ జీవిత ఘటనలు, ఇంటెన్స్ డ్రామా, సస్పెన్స్‌ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లు ఈ సినిమాను వీకెండ్ వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. స్కై యాంగ్ (Sky Yang) జాన్ అలెన్ చౌ పాత్రలో నటించగా, రాధికా ఆప్టే (Radhika Apte) మీరా గనాలి పాత్రలో కనిపిస్తుంది. కెన్ లియుంగ్ (Ken Leung) కూడా కీలక పాత్రలో నటించారు. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న జస్టిన్ లిన్ (Justin Lin) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అడ్వెంచర్ డ్రామాలు ఇష్టపడేవారికి ఈ మూవీ ఓ డిఫరెంట్ వాచ్‌ గా నిలవొచ్చు.

Advertisement

Read Also: సముద్రంలో చిక్కుకున్న అన్నదమ్ములు… ముంచేయడానికి దూసుకొచ్చే పెను తుఫాను… గూస్ బంప్స్ తెప్పించే సర్వైవల్ థ్రిల్లర్

Related News

సముద్రంలో మునిగే యుద్ధనౌక… సైనికుల రక్తం కోసం వెంటాడే భారీ షార్క్‌… తెలుగులోనే ఈ గుండె జారిపోయే సర్వైవల్ థ్రిల్లర్

నవలల్లో రాసిన నిధి కోసమే రచయిత్రి కిడ్నాప్‌… అడవిలోకి వెళ్ళాక ఒక్కొక్కరికీ చుక్కలు

30 సెకన్ల ఇంధనంతో చంద్రుడిపై ల్యాండింగ్‌… ప్రాణాలకు తెగించి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చేసిన ప్రయాణం… మస్ట్ వాచ్ మూవీ

అప్పుల వేటలో బలి… కొడుకు కోసం ఆవేదన… కన్నీళ్లు పెట్టించే కథ

ఖైదీ అనుకుంటే కాలయముడే… సీక్రెట్ జైల్లో ఊచకోత… బ్లడీ బ్లడ్ బాత్

ఇన్నాళ్లూ తాజ్‌మహల్‌ గురించి మనం చదివింది నిజమేనా ? పుస్తకాలలో చెప్పని నిజాలు… ఈ కోర్టు రూమ్ డ్రామాను డోంట్ మిస్

గోల్ కొట్టాలని గుడ్డివాడి వేషం… కట్ చేస్తే అడ్డంగా బుక్… వేరే దేశం వెళ్ళడానికి ఇదేం పాడు పని భయ్యా

Big Stories

Advertisement
×