E-Paper
Advertisement

అమ్మాయి మిస్సింగ్… ఈ ట్రైలరే ఇంత ఘోరంగా ఉందేమిటి భయ్యా

అమ్మాయి మిస్సింగ్… ఈ ట్రైలరే ఇంత ఘోరంగా ఉందేమిటి భయ్యా
Advertisement

Raakh Trailer : ప్రతిరోజూ డిజిటల్ స్ట్రీమింగ్ కు ఏదో ఒక సినిమా లేదా సిరీస్ సిద్ధంగా ఉంటోంది. తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ప్రైమ్ ఒరిజినల్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ “రాఖ్” ట్రైలర్‌ ను ఈరోజు విడుదల చేశారు. ఒక కల్పిత కథ ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉండబోతోందనే ఆసక్తి, అంచనా ట్రైలర్ తోనే పెంచారు మేకర్స్.

240 దేశాల్లో స్ట్రీమింగ్

సమాజంలో దాగి ఉన్న క్రూరత్వాన్ని బయటపెట్టే ఒక దారుణమైన, భయంకరమైన నేరంలోకి తొంగిచూసేలా చేస్తుంది ఈ సిరీస్. దీనికి ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. ఆయనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా గా కూడా వ్యవహరించారు. అనూష నందకుమార్, సందీప్ సాకేత్ సహ-రచయితలుగానే కాకుండా దర్శకులుగా పని చేశారు. ఆయుష్ త్రివేది డైలాగ్స్ రాశారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న, వెన్నులో వణుకు పుట్టించే ఈ సిరీస్ జూన్ 12న భారతదేశంలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు, భూభాగాల్లో ఈ సిరీస్ ప్రసారం కాబోతుండడం విశేషం.

సిరీస్ తారాగణం

Advertisement

అలీ ఫజల్, సోనాలి బింద్రే, అమీర్ బషీర్‌ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు ఆకాష్ మఖిజా, రమణదీప్ యాదవ్, దివ్య శర్మ, వివాన్ శర్మ, అన్షుల్ చౌహాన్, రాకేష్ బేడి, దిబ్యేందు భట్టాచార్య వంటి అనుభవజ్ఞులైన నటులు కూడా ఈ సస్పెన్స్ డ్రామాలో నటిస్తున్నారు.

పిల్లల మిస్సింగ్ చుట్టూ తిరిగే స్టోరీ

‘రాఖ్’ కథ 1970ల చివరలో ఢిల్లీ నేపథ్యంలో నడుస్తుంది. నిజానికి అప్పట్లో సూర్యాస్తమయం తర్వాత కూడా తమ పిల్లలు బయట తిరిగినా, ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా ఉంటారని తల్లిదండ్రులు నమ్మేవారు. కానీ ఈ ట్రైలర్ మాత్రం “పిల్లలు ఎంతకాలంగా కనిపించకుండా పోయారు?” అనే దిగ్భ్రాంతికరమైన ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఇది దేశ విశ్వాసాన్ని ఛిన్నాభిన్నం చేసిన ఒక ఘోరమైన నేరాన్ని కళ్ళకు కడుతుంది. తమ పిల్లలను కనుగొనాలని ఒక నిస్సహాయ తల్లి పడే ఆరాటం చుట్టూ సాగే స్టోరీ. ఈ దారుణమైన నేరానికి పాల్పడిన వారిని పట్టుకోవడానికి, సబ్-ఇన్‌స్పెక్టర్ జైప్రకాష్ ఏం చేశాడు ? ఇది అతడిని, ఏమాత్రం మనస్సాక్షి జాడ లేని నేరస్థుల వికృత మనస్తత్వపు ఊబిలోకి దిగిన ఆయన పరిస్థితి ఏమైంది ? అన్నది సిరీస్ లో చూడాల్సిన ఇంట్రెస్టింగ్ అంశం.

పోలీసుగా అలీ ఫజల్

Advertisement

ఈ సిరీస్‌లో ప్రధాన పాత్ర సబ్-ఇన్‌స్పెక్టర్ జైప్రకాష్ గా నటుడు అలీ ఫజల్ కనిపించబోతున్నాడు. ఆయన ఇప్పటికే మీర్జాపూర్ సిరీస్ తో పాపులర్ అయిన సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలీ ఈ సిరీస్ గురించి తన అనుభవాన్ని పంచుకుంటూ, తాను మొదట్లో ఇది ఒక సాధారణ క్రైమ్ థ్రిల్లర్ అని భావించాను అని, స్క్రిప్ట్ చదివిన తర్వాత దానిలోని అనేక కోణాలు, భావోద్వేగాలకు ఆకర్షితుడయ్యానని చెప్పారు. ఇందులో వేగంగా మారుతున్న రాజకీయ, సామాజిక వాతావరణంలో తనను తాను నిరూపించుకోవడానికి పోరాడతాడు జైప్రకాష్ పాత్ర. ప్రశాంతంగా ఉంటాడు కానీ సంక్లిష్టమైన, లోపాలున్న పోలీస్. అలీ ప్రకారం, “రాఖ్” కేవలం ఒక పోలీస్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ మాత్రమే కాదు, హృదయాన్ని కదిలించే కథ కూడా.

Also Read : వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

ఛాలెంజింగ్ రోల్ లో సోనాలి బింద్రే

చాలా కాలం విరామం తర్వాత నటి సోనాలి బింద్రే ఈ సిరీస్ తో రీఎంట్రీ ఇస్తోంది. ఈ సిరీస్‌లో ఆమె మోనా అరోరా పాత్రలో దర్శనం ఇవ్వబోతున్నారు. మోనా పాత్ర సున్నితంగా, ప్రశాంతంగా ఉండే మహిళ. అలాగే స్ట్రాంగ్ కూడా. మరోవైపు లెఫ్టినెంట్ కల్నల్ అశోక్ అరోరా పాత్రను నటుడు అమీర్ బషీర్ పోషిస్తున్నారు. ఇది ఆయన కెరీర్‌లోని అత్యంత కష్టమైన పాత్రలలో ఒకటని ఆయన అభివర్ణించారు.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by prime video IN (@primevideoin)

Related News

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

14,000 ఏళ్ల వయసున్న టీచర్… మైండ్ బ్లోయింగ్ ట్విస్టులున్న క్లాసిక్ సై-ఫై మూవీ

మనుషులంటేనే పడని మిస్టీరియస్ మనిషి… దిమ్మతిరిగే ట్విస్టులున్న మలయాళం థ్రిల్లర్

Big Stories

Advertisement
×