E-Paper
Advertisement

జియో రూ. 189 రీఛార్జ్ ప్లాన్.. ఎయిర్‌టెల్, వీఐలకు చుక్కలే.. ఏది బెస్ట్ అంటే?

జియో రూ. 189 రీఛార్జ్ ప్లాన్.. ఎయిర్‌టెల్, వీఐలకు చుక్కలే.. ఏది బెస్ట్ అంటే?
Advertisement

Jio Rs 189: టెలికాం రంగంలో చౌకైన రీఛార్జ్ ప్లాన్ల కోసం చూసేవారికి రిలయన్స్ జియో (Jio) రూ. 189 ప్లాన్ ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. కేవలం సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవడానికే కాకుండా తక్కువ బడ్జెట్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ ఫీచర్‌ను కోరుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే జియో తీసుకొచ్చిన ఈ రూ. 189 ప్లాన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vi) ఎలాంటి ప్లాన్లను అందిస్తున్నాయి? వాటిలో ఏది బెస్ట్? అన్నది ఈ కథనంలో చూద్దాం.

జియో రూ. 189 ప్లాన్ బెనిఫిట్స్

జియో ఈ ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ కింద మొత్తం వాలిడిటీ కాలానికి 2GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbps కి తగ్గుతుంది. దీంతో పాటు ఓవరాల్గా 300 ఫ్రీ ఎస్ఎంఎస్ లు యూజర్లకు లభిస్తాయి. అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాప్స్‌కు ఉచిత యాక్సెస్ పొందొచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 199 ప్లాన్

Advertisement

జియో రూ. 189 ప్లాన్‌కు గట్టి పోటీగా ఎయిర్‌టెల్ తన రూ. 199 ప్లాన్‌ను అందిస్తోంది. 28 రోజుల వ్యాలిడితీ వచ్చిన ఈ ప్లాన్ కింద అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. జియో తరహాలోనే ఇందులోనూ మొత్తం వాలిడిటీకి 2GB డేటా మాత్రమే లభిస్తుంది. రోజుకు 100 SMSల చొప్పున లభిస్తాయి. జియోతో పోలిస్తే ఎయిర్‌టెల్ రూ. 10 ఎక్కువే అయినప్పటికీ ప్రతిరోజూ 100 SMSలు వాడుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

వొడాఫోన్ ఐడియా రూ. 199 ప్లాన్

వొడాఫోన్ ఐడియా (Vi) కూడా బడ్జెట్ వినియోగదారుల కోసం రూ. 199 ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది. ఇది కూడా 28 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ప్లాన్ మెుత్తం కాలానికి 2GB డేటా యూజర్లకు లభించనుంది. అలాగే మొత్తం వాలిడిటీకి 300 SMSలు లభిస్తాయి. ప్రయోజనాల పరంగా జియో, వీఐ (Vi) రెండు ప్లాన్లు ఒకేలా ఉన్నప్పటికీ.. జియో కంటే వీఐ ప్లాన్ రూ. 10 అదనపు ధరను కలిగి ఉంది.

Advertisement

Also Read: తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. బీజేపీకి అన్నామలై గుడ్ బై? త్వరలో కొత్తపార్టీ!

ఏది ఎంచుకుంటే బెటర్?

కేవలం సిమ్ కార్డ్‌ను యాక్టివ్‌గా ఉంచుకుంటూ తక్కువ బడ్జెట్ లో అపరిమిత కాల్స్ కోరుకుంటే జియో రూ. 189 ప్లాన్ అన్నింటికంటే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు రోజువారీ SMSలు ఎక్కువగా అవసరమైతే రూ. 10 అదనంగా పెట్టి ఎయిర్‌టెల్ రూ. 199 ప్లాన్ ఎంచుకోవడం మంచిది. అయితే ఈ ప్లాన్లు ఏవీ కూడా ప్రతిరోజూ ఇంటర్నెట్ వాడే వారికి సెట్ కావని చెప్పవచ్చు. కేవలం సెకండరీ సిమ్ మెయింటైన్ చేసే వారికి మాత్రమే ఇవి పర్ఫెక్ట్ ఛాయిస్.

Also Read: జిమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయిందా? పైసా ఖర్చు లేకుండా.. ఒక్క క్లిక్‌తో క్లీన్ చేసుకోండి!

Related News

సంచలనం.. ఫోల్డబుల్ iPhoneతో పాటు 11 కొత్త డివైజ్‌లు.. యాపిల్ మాస్టర్ ప్లాన్ అదిరింది!

వర్షాకాలంలో బ్యాడ్ స్మెల్‌కి గుడ్‌బై.. బట్టలను పూర్తిగా ఆరబెట్టే వాషింగ్ మెషీన్స్

ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఊహించని విధంగా తగ్గిన Galaxy A36 5G ధర, ఇప్పుడే కొనేయండి!

కరెంట్,నీళ్లు ఆదా అవ్వాలా? IFB వాషింగ్ మెషీన్లలో దాగున్న అసలు సీక్రెట్స్

బజాజ్ ‘యాపిల్ డేస్’ ధమాకా.. రూ.9 వేల క్యాష్‌బ్యాక్, రూ.10 వేల ఎక్స్ఛేంజ్ బోనస్.. చౌకగా ఐఫోన్లు, ఐప్యాడ్స్!

ఆయిల్‌ మరకలు,పప్పు పొంగుళ్లు.. వేటినైనా తట్టుకునే టాప్ క్లాస్ గ్యాస్ స్టౌవ్స్!

ఫ్రిడ్జ్‌లో రూ.1 నాణెం.. తర్వాత జరిగే బెనిఫిట్స్ చూస్తే.. దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే!

మోడ్రన్ కిచెన్స్‌లో ‘బెస్పోక్’ హవా.. లగ్జరీకి కేరాఫ్ అడ్రస్!

Big Stories

Advertisement
×