E-Paper
Advertisement

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్
Advertisement

Indian Railways : రైలు టికెట్ బుక్ చేసిన తర్వాత వెయిటింగ్ లిస్ట్‌లో పేరు యాడ్‌ అయితే టెన్షన్ అంతాఇంతా కాదు. టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనే ఆందోళన ఒకవైపు ఉంటే, రైలెక్కిన తర్వాత రిజర్వ్ కోచ్‌లలో కనిపించే అధిక రద్దీ మరోవైపు ప్రయాణికులను ఇబ్బంది పెడుతోంది. ఏసీ, స్లీపర్ బోగీలలో గ్యాలరీలన్నీ జనంతో నిండిపోతాయి. ఇటు టాయిలెట్ల వద్ద కూడా ప్రయాణికులు నిలబడతుంటారు. అయితే ఈ పరిస్థితులకు చెక్ పెట్టే దిశగా భారతీయ రైల్వే కీలక అడుగు వేసింది. ఇవాళ్టి(జూన్ 1) నుంచి అమల్లోకి వచ్చిన కొత్త వెయిటింగ్ టికెట్ విధానం రైలు ప్రయాణంలో భారీ మార్పులకు కారణం కానుంది.

ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, రిజర్వేషన్ కోచ్‌లలో పెరుగుతున్న రద్దీ కారణంగా రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై వెయిటింగ్ టిక్కెట్ల జారీకి పరిమితులు ఉంటాయి. ఇప్పటి వరకు స్లీపర్ క్లాస్‌లో వందల సంఖ్యలో వెయిటింగ్ టిక్కెట్లు జారీ చేసేవారు. కొన్ని రైళ్లలో వెయిటింగ్ జాబితా 400 వరకు చేరుకునేది. కానీ ఇకపై స్లీపర్ కోచ్‌లలో మొత్తం సీట్ల సామర్థ్యంలో గరిష్టంగా 30 శాతం మేరకే వెయిటింగ్ టిక్కెట్లు ఇవ్వనున్నారు. దీంతో సాధారణంగా ఒక్కో రైలులో 150 నుంచి 200 మధ్య మాత్రమే వెయిటింగ్ టిక్కెట్లు జారీ అయ్యే అవకాశం ఉంది.

Advertisement

ఏసీ కోచ్‌ల విషయంలో కూడా ఇదే తరహా మార్పు అమల్లోకి రానుంది. గతంలో 300 వరకు వెయిటింగ్ టిక్కెట్లు జారీ చేసిన సందర్భాలు ఉండగా, ఇప్పుడు మొత్తం సీట్ల సంఖ్యలో 60 శాతానికి మాత్రమే వెయిటింగ్ అనుమతించనున్నారు. దీని వల్ల అత్యంత పొడవైన వెయిటింగ్ జాబితాలు తగ్గడమే కాకుండా.. రిజర్వేషన్ కోచ్‌లలో అనవసర రద్దీ కూడా భారీగా తగ్గుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో ఎక్కువ ప్రయోజనం పొందేది కన్ఫర్మ్ టిక్కెట్లు ఉన్న ప్రయాణికులే. ప్రస్తుతం వెయిటింగ్ టికెట్ కలిగిన పలువురు ప్రయాణికులు కూడా ఏసీ, స్లీపర్ బోగీల్లోకి ఎక్కడం వల్ల సీట్ల వద్ద గందరగోళం నెలకొంటోంది. కొన్నిసార్లు ప్రయాణికులు తమ సీట్లను చేరుకోవడానికే ఇబ్బందులు పడుతున్నారు. కొత్త నిబంధనలతో ఈ సమస్యలకు చెక్ పడే ఛాన్స్ కనిపిస్తోంది

మరో ముఖ్యమైన అంశం బ్రోకర్ల వ్యవహారం. రైల్వే నిపుణుల అభిప్రాయం ప్రకారం, గతంలో కొంతమంది మధ్యవర్తులు పెద్ద సంఖ్యలో వెయిటింగ్ టిక్కెట్లు బుక్ చేసి, అవి కన్ఫర్మ్ చేయిస్తామని చెప్పి ప్రయాణికుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేసిన ఘటనలున్నాయి. వెయిటింగ్ టిక్కెట్ల పరిమితితో అలాంటి అక్రమాలకు కూడా అడ్డుకట్ట పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా వెయిటింగ్ టికెట్ ఉన్నవారు ఏసీ, స్లీపర్ కోచ్‌లలో ప్రయాణించడానికి అనుమతి ఉండదు. నిబంధనలను ఉల్లంఘిస్తే టీటీఈ జరిమానా విధిస్తారు.

Advertisement

Also Read : థియేటర్లను దడదడలాడిస్తున్న హారర్ థ్రిల్లర్… ఓటీటీ స్ట్రీమింగ్ పుకార్ల వెనకున్న నిజం ఇదే

ఇక ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ మరో కీలక చర్య కూడా చేపట్టింది. వేసవి సెలవుల సీజన్‌లో ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచేందుకు రికార్డు స్థాయిలో 908 ప్రత్యేక వేసవి రైళ్లను నడుపుతోంది. ఏప్రిల్ 15 నుంచి జూలై 15 వరకు ఈ రైళ్లు మొత్తం 18,262 ట్రిప్పులు నిర్వహించనున్నాయి. వెయిటింగ్ టికెట్ విధానంలో మార్పులు, అదనపు ప్రత్యేక రైళ్ల నిర్వహణ కలిసి రానున్న రోజుల్లో రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, క్రమబద్ధంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోట్లాది మంది ప్రయాణికులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రద్దీ సమస్యకు ఇది తాత్కాలికంగా అయినా సొలూష్యన్‌గానే కనిపిస్తోంది మరి.

Related News

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

అర్ధరాత్రి కూడా భానుడి ప్రతాపమే.. భూమిపై సూర్యుడు అస్తమించని ఆ 5 వింత ప్రదేశాలేవో తెలుసా?

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

భూమిపై 5 ప్రమాదకర పర్యాటక ప్రాంతాలు.. ఇక్కడికి వెళ్లడం ప్రాణాలతో చెలగాటం.. అయినా వెళుతున్న టూరిస్ట్స్

జూలైలో పర్యటించడానికి 6 అందమైన ప్రదేశాలు.. చల్లని, స్వచ్ఛమైన గాలితో మైమరిపించే వాతావరణం

Big Stories

Advertisement
×