E-Paper
Advertisement

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్
Advertisement

Political Thriller:  ఓటీటీలో ఎన్నో సిరీస్ లు వస్తుంటాయి, పోతుంటాయి. కొన్ని మాత్రం ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన ముద్రను వేస్తాయి. అలాంటి వాటిలో ఈరోజు మన మూవీ సజెషన్ లో చెప్పుకోబోయే సిరీస్ కూడా ఉంటుంది. రాజకీయ సామ్రాజ్యం కోసం జరిగే రక్తపాతం… పాలిటిక్స్, క్రైమ్, రివేంజ్… ఇవన్నీ కలిసి సృష్టించిన భయంకరమైన గ్యాంగ్ వార్ కథ ‘రక్తాంచల్ సీజన్ 3’ (Raktanchal Season 3). తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? కథ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

కథలోకి వెళ్తే…

సీజన్ 2 ఎక్కడ ఎండ్ అయ్యిందో సీజన్ 3 అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. విజయ్ సింగ్ మరణించాడని అందరూ అనుకుంటారు. కానీ అతను రహస్య గుర్తింపుతో ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా బ్రతుకుతుంటాడు. సీజన్ ప్రారంభంలోనే విజయ్ భార్య రోలి, అతని కజిన్ బ్రదర్ దారుణంగా హత్యకు గురవుతారు. ఈ కోలుకోలేని దెబ్బ విజయ్‌లో ప్రతీకార జ్వాలను రగిల్చి, మళ్లీ పూర్వాంచల్‌లోకి అడుగుపెట్టేలా చేస్తుంది.

Advertisement

మరోవైపు అడవిలో వసీమ్ ఖాన్ తీవ్ర గాయాలతో పడి ఉండటం కథను మలుపు తిప్పుతుంది. స్పృహ కోల్పోయే ముందు తనపై దాడి చేసింది విజయ్ సింగ్ అని అతను చెప్పేస్తాడు. ఆ తర్వాత కోలుకున్న వసీమ్ ఖాన్, తన సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూనే విజయ్ సింగ్‌ను అంతం చేయడానికి ప్లాన్ వేస్తాడు. ఇంకోవైపు సరస్వతి దేవి ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ, వీరేంద్ర ప్రతాప్‌ను అణచడానికి వసీమ్ ఖాన్‌ను తిరిగి ఉత్తరప్రదేశ్‌కు తీసుకువస్తుంది.

వీరేంద్ర ప్రతాప్ సింగ్ వ్యాపారవేత్త. ఇతను విజయ్ సింగ్ మద్దతుతో రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి అవుతాడు. ACP హిమాన్షు పట్నాయక్ STF చీఫ్‌గా నియమితుడవుతాడు. ఇతను పూర్వాంచల్‌లో నేరాలను, విజయ్ సింగ్ నెట్‌వర్క్‌ను పూర్తిగా తుడిచిపెట్టడానికి రంగంలోకి దిగుతాడు. కథ క్లైమాక్స్‌కు చేరుకునే సరికి, వీరేంద్ర ప్రతాప్ సీఎం అయ్యాక నేరాలపై ఉక్కుపాదం మోపుతూ సరస్వతి దేవిని అరెస్ట్ చేయిస్తాడు. శత్రువులు చుట్టుముట్టిన తరుణంలో విజయ్ సింగ్ ఏం చేస్తాడు ? జైలు గోడల వెనుక అతను రచించిన వ్యూహాలు ఏంటి ? రాజకీయ సమీకరణాలను మారుస్తూ రాష్ట్రంలోనే అత్యంత శక్తివంతమైన కింగ్‌మేకర్‌ గా ఎలా అవతరిస్తాడు ? చివరకు వసీమ్ ఖాన్‌తో జరిగే భీకర పోరాటంతో గెలిచింది ఎవరు ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ ఉం చూడాల్సిందే.

స్ట్రీమింగ్ ఫ్రీగానే

Advertisement

సీజన్ 1లో టెండర్ మాఫియా ఆధిపత్యం నడుస్తుంది. సీజన్ 2లో రాజకీయాల వైపు మళ్లిన కథ, సీజన్ 3లో పూర్తి రాజకీయ ఆధిపత్యం కోసం సాగుతుంది. ‘రక్తాంచల్ సీజన్ 3’ ప్రతీకారం, అధికారం కోసం జరిగే యుద్ధం కథ. దీన్ని Amazon MX Playerలో ఉచితంగా చూడవచ్చు. తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది. అయితే సీజన్ 3 చూడడం కంటే ముందు మిగతా రెండు సీజన్లు చూస్తే ఒక క్లారిటీ వస్తుంది.

Read Also: కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×